సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించిన మల్లాది విష్ణు
- సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 25, 30, 59, 61 డివిజన్లలో అభివృద్ధి పనుల పరిశీలన
- క్షేత్ర స్థాయిలో పర్యటించిన శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 25, 30, 59, 61 డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు స్థానికంగా ఉన్న సమస్యలను క్షేత్ర స్థాయిలో స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్ తో కలసి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబందించి వర్షాల కారణంగా పనులకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ.. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు. 25వ డివిజన్ చాపరాలవారి వీధి, ఐనవోలువారి వీధులలో పల్లంగా ఉన్న రోడ్లను ఎత్తు పెంచేలా చర్యలు చేపట్టాలని, ఎల్ అండ్ టి వారు అసంపూర్తిగా వదిలేసిన డ్రెయిన్లు, కల్వర్టు పనులను పూర్తిచేసి వర్షపు నీరు పారేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సీతారామపురం డ్రెనేజి పంపింగ్ స్టేషన్ రోడ్డు నందు పాడైన భూగర్భ పైపులైన్ ను మార్చివేసి కొత్త రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా సీతారామపురం కాల్వగట్టున ఉన్న మురుగునీటి పైపులైన్ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు.
30వ డివిజన్ రామకృష్ణాపురం వంతెన వద్ద యూజీడీ, వాటర్ లైన్, రోడ్డు నిర్మాణ పనులకు సంబందించి రైల్వే అధికారులతో కలసి పరిశీలన జరిపి పనులు సత్వరమే చేపట్టునట్లుగా చూడాలన్నారు. జీ.వీ.ఆర్ నగర్, దావు బుచ్చయ్యకాలనీలలో యు.జీ.డి ట్రంక్ లైన్ పనులను పర్యవేక్షించి పనులు పూర్తైన వరకు మట్టిని తొలగించి తాత్కాలికంగా రోడ్డును పునరుద్దరించాలన్నారు. వినాయకనగర్ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడకుండా సమాంతరంగా మరో రెండు రోడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 59వ డివిజన్లో పర్యటిస్తూ,14వ ఆర్థిక సంఘం నిధులలో చేపట్టిన ఐకానిక్ పార్కులో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 61 డివిజన్ గాళ్ల వెంకయ్యకాలనీలో రోడ్డులు, పాయకాపురం చెరువు పార్కు పనులను పరిశీలించారు. పార్కులో గ్రీనరీని ఏర్పాటు చేసి నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే పాయకాపురం చెరువు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కలిపే రహదారి, కల్వర్టు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయి పర్యటనలో తమ దృష్టికి వచ్చిన బి.టి బీటీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని, అజిత్ సింగ్ నగర్ ఐకానిక్ పార్కు పనులను వేగవంతం చేసి మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని, పాయకాపురం చెరువు పార్కు పనులను కూడా 20 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు.
పర్యటనలో కార్పొరేటర్లు జానారెడ్డి, ఉమ్మడి రమాదేవి సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ నరసింహమూర్తి, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు వి. శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్. ప్రసాద్, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ గురునాథం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.