డివిజన్ స్థాయిలో ప్రజలు ఎదుర్కొను ఇబ్బందులను పరిష్కరించాలి: వెల్లంపల్లి

Related image

  • పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై సమీక్ష అధికారులకు పలు సూచనలు
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు 39,40,42 మరియు 43 డివిజన్లకు సంబంధించిన సమస్యలపై పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డివిజన్ కార్పొరేటర్లతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంలో గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో డివిజన్ నందు పర్యటించిన సందర్బంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, కొండ ప్రాంతాలలో మెట్ల మార్గం వంటి పలు ప్రధాన సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని వివరిస్తూ, నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులకు సత్వరమే పరిష్కరించునట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సమావేశంలో కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, యారడ్ల ఆంజనేయ రెడ్డి, పడిగపాటి చైతన్య రెడ్డి, బాపతి కోటిరెడ్డి, బుల్లా విజయ కుమార్ మరియు చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (జనరల్) యం. శ్యామల, మరియు ఇతర విభాగముల అధికారులు పాల్గొన్నారు.

More Press Releases