హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకుల కోసం కొత్త సేవలను ఆవిష్కరించిన పేటీఎం!
భారతదేశంలోని అతి పెద్ద డిజిటల్ చెల్లింపుల కంపెనీ, పేటీఎం హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికుల కోసం రూట్ సర్చ్ సేవను ఆవిష్కరించింది. ఇది, మెట్రో రైలు ప్రయాణీకులు వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగించదగిన అంశం. ఈ అంశం, మెట్రో సదుపాయం ఉన్న అన్ని 10 నగరాలు అయిన ఢిల్లీ, నోయిడా, గురుగావ్, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, చెన్నై, లక్నో, కొచ్చి, జైపూర్ లలో అందుబాటులో ఉంది. ఈ అంశం, మీ ఆరిజన్, గమ్యం మధ్య రూట్ ను మాత్రమే సూచించడమే కాకుండా, అంచనావేయబడిన ప్రయాణ సమయం, ఛార్జీలు, మధ్యలో వచ్చు స్టేషన్ల సంఖ్య, మార్పిడి లైన్స్ కోసం అంతరమార్పిడి స్టేషన్ లను కూడా అందిస్తుంది. బహుళ రూట్స్ సంభావ్యత ఉన్న చోట, ఇది మీకు ఉత్తమ రూట్ ను కూడా సూచిస్తుంది, ఇందులో ప్రయాణ సమయం, ప్రయాణ సమయంలో మెట్రో లైన్స్ ను ఎన్ని సార్లు మార్చాలి వంటివాటిని కూడా పరిగణిస్తుంది.
ఈ అంశాన్ని ఉపయోగించుకోవడం ఎలా?
1. పేటీఎం యాప్ లో ’మెట్రో’ ఐకాన్ పై క్లిక్ చేయండి.
2. మీ నగరాన్ని ఎంచుకోండి, రూట్ సర్చ్ పై క్లిక్ చేయండి.
3. మీ ఆరిజిన్, గమ్య స్థానములను ఎంచుకోండి. రూట్స్ చూడడానికి సర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
4. మీకు రూట్ ను సూచిస్తుంది. ఎంపిక చేసుకున్న స్టేషన్స్ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా మీకు చూపిస్తుంది.
ఈ ఆవిష్కరణ కోసం అభిషేక్ రాజన్, వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. “పేటీఎంలో, మేము మా యూజర్స్ యొక్క ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి తగిన మార్గాల గురించే మేము నిరంతరం ఆలోచిస్తూంటాము. ఈ మెట్రో రూట్ సర్చ్ అనేది మెట్రో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తెలివిగా ప్లాన్ చేసుకునేందుకు ఒక సౌకర్యవంతమైన పద్ధతిని అందించే దిశలో మరొక అడుగు. ఈ యాప్ లో దీనిని లైవ్ చేసిన కొద్ది గంటలలోనే ఈ అంశానికి అత్యద్భుత ప్రతిస్పందనను మేము గమనించాము. ఇంకా మరెన్నో సృజనాత్మక అంశాలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి, ఇవి అన్ని రవాణా పద్ధతులలో మా యూజర్స్ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.” అని అన్నారు.
పేటీఎం విమానం, బస్సు, రైలు ప్రయాణీకుల కోసం సృజనాత్మక అంశాలను ఆవిష్కరించడంలో ప్రముఖులుగా ఉన్నారు. ఇంతకుమునుపు, వారు ఉచిత రద్దును ఆవిష్కరించారు, ఇది యూజర్స్ తమ ప్రయాణ టికెట్ ను ఎలాంటి రద్దు ఛార్జీలు లేకుండానే రద్దు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఇతర ప్రముఖ అంశాలలో, లైవ్ ట్రెయిన్ ట్రాకింగ్, క్విక్ బుక్, వాయిస్ సర్చ్ లు ఉన్నాయి. ఇవి యూజర్స్ కు, ట్రెయిన్ టికెట్ బుకింగ్ ను ఒక అసమాన అనుభవాన్ని అందిస్తున్నాయి.
పేటీఎం అనేది రవాణా వ్యాపారంలో ప్రవేశించిన మొట్టమొదటి సమాంతర ఇ-కామర్స్ సంస్థ, ఇ-డొమెయిన్. ఇప్పటివరకు వెర్టికల్ ప్లేయర్స్ ద్వారా డామినేట్ చేయబడింది. అతి తక్కువ సమయంలోనే, ఇది రవాణా పరిశ్రమలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈ కంపెనీ తన రవాణా వ్యాపార కార్యకలాపాలకు బెంగళూరును మూలంగా చేసుకుంది, ఇక్కడ అతి తన జట్టు సైజును అతి వేగంగా అప్పుడే 300 కు చేర్చుకుంది.