కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి:తెలంగాణ సీఎస్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో కీటక జనిత వ్యాధుల (Vector borne diseases) నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో diseases పై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్య విధాన పరిషత్ కమీషనర్ యోగితారాణా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ వెక్టర్ బార్న్, డిసీస్ కంట్రోల్ డిప్యూటి డైరెక్టర్ సుమన్ లతా వటల్, కన్సల్టెంట్ కౌషల్ కుమార్, IDSP( Integrated Disease Surveillance Program) NCDC, Deputy Director, ప్రణవ్ కుమార్ వర్మ, Epidemiology కన్సల్టెంట్ సాహిత్ గోయల్, జిహెచ్ఎంసి సీనియర్ Epidemiologist రాంబాబు, కేంద్ర ప్రభుత్వ సీనియర్ Regional Director అనురాధ, అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Vector borne diseases (మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, ఫైలేరియా, జపానీస్ ఎన్ సెఫలైటిస్) లాంటి వ్యాధుల పై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి వెంటనే ప్రత్యేక టీమ్ ను పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాధుల నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించి, కార్యచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలతో పాటు, జ్వరాలు వచ్చిన చోట వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సి.యస్ అన్నారు. జ్వరాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. దోమల బ్రీడింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం నివారణ చేపట్టాలన్నారు. ఇందుకోసం సరియగు ఎక్విప్ మెంట్ ను వినియోగించాలన్నారు. ఫాగింగ్ ను సరియైన పద్ధతిలో చేపట్టి ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ వ్యాధుల నివారణ, వ్యాప్తి, వైద్య పరీక్షలు, అందుతున్న వైద్య సేవలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలలో District Program Officer లను సెన్సిటైజ్ చేయాలన్నారు.