ఆత్మప్రబోధనుసారమే ఓటు వేయాలి: మస్తాన్‌వల్లి
- చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్ననంగా నిరసన వ్యక్తం చేసిన నాయకులు
ధర్నాలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వల్లి, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు దోనేపూడి కాశీనాథ్ రావు, కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షులు నరహారశెట్టి నరసింహారావు, అమ్మ్ ఆద్మి పార్టీ నాయకులు పోతిన వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. చెవిలో పువ్వులు పెట్టుకుని నాయకులు వినూత్ననంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మస్తాన్ వల్లి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయన్నారు. అధికార పార్టీ చెందిన జగన్, ప్రతిపక్షంలో చంద్రబాబు, మోడీ కి దూత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందరూ గిరిజనులు అనే పదాన్ని వాడి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు అన్నారు. సామాజిక న్యాయం అంటూ మోసం చేస్తున్నారు అన్నారు. 2012లో జరగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లోప్రణబ్ ముఖర్జీ, పిఏ సంగ్మాల మధ్య పోటీ జరిగిందని, సంగ్మా మేఘాలయకు చెందిన గిరిజనుడని తెలిపారు. ఆ ఎన్నికల్లో గిరిజనుడు అయిన సంగ్మాకు కాకుండా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. గిరిజనుడు అయిన సంగ్మాకు మద్దతు ఇవ్వకుండా టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది అన్నారు. ఆనాడు ఈ రెండు పార్టీలకు సామాజిక న్యాయం ఏమైందని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేసిన ధర్మ పోరాటం ఏమైందని నిలదీశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్న జగన్ గర్జనలు ఏమయ్యాయని అడిగారు. ఈ రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టాయని ఆరోపించారు. రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ అని.. అటువంటి బీజేపీకి మద్దతు ఇస్తున్న వైసీపీ, టీడీపీలు మరింత ద్రోహులని మండిపడ్డారు. గిరిజనులపై ఏపి సీఎం జగన్‌కు అంత ప్రేమ ఉంటే వారి సలహామండలిలో ఎందుకు స్థానం ఇవ్వలేదన్నారు. వైసీపీ పాలనలో గిరిజనుల ఆస్తులను దోచేస్తున్నారని, వారి ఆస్తులలో మైనింగ్ జరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువంటి షరతులు పెట్టకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం. రెండూ కలసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని దుర్మార్గ విధానం, విపత్కర విధానం, అధికార .ప్రతిపక్షం రెండు పార్టీలు కలసి గుత్తా గంపగా మోడీ గారి కాళ్ల దగ్గర రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించడానికి తాకట్టు పెట్టిన విధానంపై ఆగ్రహం వెలిబుచ్చింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టిన విధానంపై ,మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మకానికి ఆటబొమ్మగా, కార్పొరేట్ మిత్రులకు రాజకీయ స్థావరంగా, అవసరమైతే ఈ రాష్ట్ర సంపదను తన బినామీలకు దోచి పెట్టడానికి ఉపయోగించుకునే విధంగా, ఉన్న మోడీ గారిని రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నించకుండా, ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానని ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్పి తమ మేనిఫెస్టోలో పెట్టి ప్రత్యేక హోదాని తెలుగు ప్రజలను పోలవరం, ఇవ్వకుండా.. పోలవరాన్ని పూర్తి చేయకుండా తమ కమీషన్లకు కక్కుర్తి కోసం మోడీని మంచి చేసుకొనుటకు ప్రజల ప్రాణ మాన గౌరవాలను తాకట్టు పెడుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకుంటే.. మోడీ రాష్ట్రపతి అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోతాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించకుండా డిమాండ్ చేయకుండా మోడీ గారి రాష్ట్రపతి అభ్యర్థిని కలవడం కోసం పోటీపడుతూ కాళ్ల మీద పడి ప్రాధేయ పడుతూ తమ ఎంపీలు ఎమ్మెల్యేలను తాకట్టు పెడుతున్న టువంటి పరిస్థితిని ప్రజలు గమనించి ఈ దుర్మార్గం ఆలోచన కలిగిన ప్రజాప్రతినిధులను నిలదీసి ప్రశ్నించాలని తమ స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తుని మోడీకి తాకట్టు పెట్టినందుకు పర్యావసనం ఎదుర్కోవలసి వస్తుందని ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు, ముందు ఉందని హెచ్చరిస్తూ ప్రజా ప్రతినిధులను గొర్రెల్లాగా తలవుపకుండా ఆత్మ ప్రబోధం అనుసారం బిజెపి అభ్యర్థి ఓడించండి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ మోడీని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీ నిర్మించిన రాజధాని ఇస్తానని, రాజధానికి నిర్మాణానికి పూర్తి డబ్బులు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నా, నీకు విగ్రహాలు, వ్యక్తిగత ప్రతిష్టకు భారత ఖజానాని ఉపయోగించే నీచ సంస్కృతి ని విడనాడి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.
సామాజిక న్యాయం గిరిజన అభివృద్ధి అనే మాటలతో ఈ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్న దుర్మార్గ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు, చిత్తశుద్ధి ఉంటే నాడు పిఎ సంగ్మా గిరిజన అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా డ్యూటీలో పోటీలో ఉన్నప్పుడు ఎందుకు మీరు ఓటు వేయలేదు ఏం మీకు ఆ రోజు సామాజిక న్యాయం గుర్తు రాలేదా. మీరు ఎప్పుడైనా ఒక గిరిజన అభ్యర్థిని మండలికి సభ్యునిగా చేసిన చరిత్ర లేదే, గిరిజన యూనివర్సిటీలను తీసుకురాలేదే ఈరోజు కూడా గిరిజనుల భూములను తమ వ్యక్తిగత స్వార్థపూరిత సంపాదన కోసం విచ్చలవిడిగా మైన్స్ చేస్తూ గిరిజనులను నాశనం చేస్తున్నా పరిస్థితులు లేవా గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి, మీ రాజకీయ ప్రస్థానంలో జరగలేదు కదా , ఆంధ్ర ప్రజలను వెర్రి వెంగళప్పలను చేశాను అంటే మీ అవివేకమే అని హెచ్చరించడం జరిగింది.