నగర పరిధిలో చేపట్టిన రోడ్లు అభివృద్ధి పనులుపై నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్ ను దర్శించిన విజయవాడ మేయర్

Related image

  • నగర పరిధిలో చేపట్టిన రోడ్లు అభివృద్ధి పనులుపై నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డివిజన్ కార్పొరేటర్లతో కలిసి డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కోను పలు సమస్యలపై అధికారులతో కలసి చర్చించారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివృద్ధి పనుల వివరాలు మరియు ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించవలసినదిగాను నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి పూర్తి చేయునట్లుగా చూడాలని కోరారు. డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కారించునట్లుగా చూడాలని అన్నారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగరంలో రోడ్ల పునరుద్ధరణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లకు, వైసీపీ ప్రభుత్వంలో ఆధునికీకరించిన రోడ్లకు మధ్య వ్యత్యాసం ఫొటో ఎగ్జిబిషన్ లో కళ్లకు కట్టేలా చూపడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.
కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రహదారుల వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.

సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు మరియు అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, ఎస్.ఇ నరశింహ మూర్తి, వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా. ఏ.రవిచంద్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.  

More Press Releases