డా కె.ఎల్ రావు పార్క్, స్విమ్మింగ్ పూల్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలి: విజయవాడ మేయర్

Related image

  • కొండ ప్రాంతములో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలి
  • 46వ డివిజన్ లోని పలు ప్రాంతాలు పరిశీలన
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు అధికారులతో కలసి 46వ డివిజన్ పరిధిలోని పలు విధులు మరియు కొండ ప్రాంతాలలో పర్యటించారు. కొండ ప్రాంతములో పర్యటిస్తూ, కొండ ప్రాంత వాసులకు రోడ్లు, డ్రెయిన్, మెట్లు, త్రాగునీటి సరఫరా మొదలగునవి సక్రమముగా అందుబాటులో ఉన్నవి లేనివి అడిగితెలుసుకొని, డివిజన్ లో పారిశుధ్య నిర్వహణ విధానము మెరుగుపరచాలని, ఖాళి స్థలములలో గల చెత్త మరియు వ్యర్ధములు తొలగించి స్థానికులు ఎవరు చెత్త మరియు వ్యర్ధములు పడవేయకుండా చూడాలని సూచించారు.

డివిజన్ నందలి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దుటతో పాటుగా మెట్ల మార్గంలో గల వాటర్ పైపు లైన్ లను కాంక్రీట్ తో ముసివేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో త్రాగునీటి సరఫరా విధానము మేరుగుపరచుటలో భాగంగా బీమన జానకిరామయ్య వీధి కొండపైన ELSR వాటర్ రిజర్వాయర్ నిర్మించుట కొరకు గుర్తించిన స్థలమును పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు.

తదుపరి కె. యల్. రావు పార్కు, స్విమ్మింగ్ పూల్ మరియు ధోభీఖానా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పార్క్ నందు ప్రజలకు అందుబాటులో ఉండేలా షేటిల్ కోర్ట్, స్క్రిటింగ్ మొదలగునవి ఏర్పాటు చేయాలని సూచించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, నరశింహమూర్తి, సిటీ ప్లానర్ జీ.వి ప్రసాద్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ఏ.డి.హెచ్ శ్రీనివాస్,  హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

స్పందనలలో 13  అర్జీలను స్వీకరణ, సమస్యలను సత్వరమే పరిష్కారించాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 7,  ఇంజనీరింగ్ – 2, పబ్లిక్ హెల్త్ విభాగం – 2, రెవిన్యూ విభాగం – 2, అర్జీలు వచ్చినవి.

S.NoNAME OF THE PETITIONER, ADDRESSPHONE NUMBERSUBJECTDEPARTMENT
 
1
T.PRASADA RAO, 43-106/1-51/1A, NANDAMURI NAGAR.9494870356REQUEST FOR EXEMPTION OF PROPERTY TAX.DCR
2T.SAMMI RAJ,36-5-24, WOOD PET.9494366988ROAD OCCUPAOD AND MAKE UNAUTHORISED CONSTRUCTION.CP
3J.VIJAY BHASKAR, 75-14-100A, BHAVANI PURAM.9618996666REQUEST TO PROVIDE SIDE DRAINSCE
4P.SIVA LEELA, 38-1-22/A, INDIRA TOWERS COMPLEX, BANDAR ROAD9948328724ROAD ENCROACHMENTCP
5N.KUMAR DEVADAS, 8-33-137, WYNCHPET.9030522175REQUEST TO REMOVAL OF UNAUTHORISED CONSTRUCTIONCP
6B.DURGA VENKATA RAM, 71-3-13A, KONERUVARI STREET, PATAMATA9966002666ENCROACHMENT TO BE REMOVEDCP
7K.HARI PRASAD, 9-42-106, K.T. ROAD.9848489711REQUEST TO PROVID CEMENT ROAD.CE
8U.VENKATA KRISHNA, 10-14-7, AKULAVARI STREET, MALLIKHARJUNA PET9246167094REQUESTED TO CHANGE PROPERTY TAXDCR
9K.SREEKANTH, 48-13-1/5, SIRI ENCLAVE, SRI RAMA CHANDRA NAGAR9912298999CLAY BRICKS CONSTRUCTION TO BE STOPPEDCP
10G.JOHN BHUSHANAM, 20-7-27, SANTHI NAGAR.9393763789STREET DOG ISSUE.CMOH
11SL.ABDUL SYNUDDIN, 31-6-6/1, ASR STREET, MARUTHI NAGAR9618074444ILLEGAL CONSTRUCTIONCP
12MD.SAIMUNNISA BEGUM, 75-5-3, PRESIDENT STREET, BHAVANIPURAM9059456882NEIGHBOURS DRAINAGE PROBLEMCMOH
13Y.RAJEEV, 70-1-1, PATAMATA.8885262628REQUEST FOR CONSTRUCTION OF SIDE DRAINSCP

 
కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కే. శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు.

జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక -1, ఇంజనీరింగ్ విభాగం – 2 అర్జీలు, సర్కిల్ –3 కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం – 1 అర్జీ మరియు సర్కిల్ – 2 పరిధిలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

More Press Releases