పశ్చిమ నియోజకవర్గoలో రూ.690 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం; మున్సిపల్ శాఖా మాత్యులు ఆదిమూలపు సురేష్

Related image

పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ.690 లక్షల అభివృద్ధి పనులకు మున్సిపల్ శాఖా మంత్రివర్యులు శ్రీ అదిమూలపు సురేష్, శాసన సభ్యులు శ్రీ  వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ శ్రీమతి భాగ్య లక్ష్మీ, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్  ఐ.ఏ.ఎస్,  డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి మరియు పలువురు కార్పొరేటర్లు లతో కలసి శంఖుస్థాపన చేసారు. అదే విధంగా కాలుష్య మరియు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుటలో భాగంగా నిర్వహిస్తున్న IEC కార్యక్రమములను పరిశీలించి స్థానికులకు క్లాత్ సంచులను పంపిణి చేసారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజి శుభ్ర పరచు సిబ్బందికి పి.పి. కిట్స్, రక్షణ పరికరాలు పంపిణి చేసారు.

ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులైన 46వ డివిజన్ నందు రూ.90 లక్షలతో ఆధునీకరించిన కె.ఎల్ రావు పార్క్ స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు. అదే విధంగా రూ. 300 లక్షల 15వ ఆర్ధిక సంఘ నిధులతో 39,40,42,43 మరియు 44 డివిజన్ లకు సంబంధించి ఆర్.టి.సి వర్క్ షాప్ రోడ్ లో బి.టి రోడ్ నిర్మాణం ఎండ్ టు  ఎండ్ పెవర్ బ్లాక్స్ ఏర్పాటు పనులకు మరియు  రూ. 300 లక్షల 15వ ఆర్ధిక సంఘ నిధులతో 43వ డివిజన్ ఐరన్ యార్డ్ నందు మిగిలిన రోడ్లుకు బి.టి & సి.సి డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని అన్నారు. ప్రదానంగా నగరాలు అన్ని డస్ట్ బిన్ ఫ్రీ గా తీర్చిదిద్దాలని సాలిడ్ వేస్ట్ మరియు లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సమర్ధవంతంగా ఎదుర్కోవాలనే ఉదేశ్యంతో పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు అందించుట జరుగుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వై.ఎస్ ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచి ఇవ్వటంతో పాటుగా హెల్త్ ఎలవేన్స్ అందించుట జరుగుతుందని పేర్కొన్నారు. రాబోవు రోజులలో నియోజకవర్గ పరిధిలో మిగిలిన అన్ని పనులతో పాటుగా స్టేడియం పనులు కూడా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అదే విధంగా నగరాలలో ప్లాస్టిక్ రహిత నగరాలుగా అభివృద్ధి చేయాలనే నినాదంతో ఉద్యమముగా తీసుకురావాలనే లక్ష్యంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించి కాలుష్యాని తగ్గించాలనే గౌ.ముఖ్యమంతి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వంతో పాటుగా స్వచ్చంద సంస్థలు మరియు ప్రజలు కూడా కలసి నిభందనలు పాటిస్తూ, ప్లాస్టిక్ కు బదులుగా జ్యూట్ లేదా క్లాత్ సంచులు వినియోగించాలని అన్నారు.  

అదే విధంగా శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నవని,  ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించుటలో  నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేసి వాటిని వదిలి వేయకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి లక్ష్మo నగరాభివృద్ధి పరస్తూ, శంఖుస్ధాపనలు చేసి వాటిని అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని వివరించారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటతో పాటుగా చిన్న పిల్లలను ఆకర్షించే పార్క్ లను ఆధునీకరించుట జరుగుతుందని పేర్కొన్నారు.

నగర మేయర్ మాట్లాడుతూ నేడు డా.కె.ఎల్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించుట మరియు పలు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని, గత పాలకులు నిర్లక్ష్యం చేసిన అనేక పనులను మా ప్రభుత్వం వచ్చిన మూడు ఏళ్ల కాలంలో అనేక పనులు చేపట్టి నగరాని అభివృద్ధి పరచుట జరుగుతుందని అన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నియోజక వర్గంలో 6.9 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేస్తూ, స్విమ్మింగ్ పూల్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం పరచుకోవాలని, యు.జీ.డి శుభ్రం చేయు సమయంలో అధిక శాతం శానిటరీ నాప్కిన్స్ లేదా డైపర్స్ ఉంటున్నవని వాటిని యు.జీ.డి లో పడవేయకుండా మీకు అందించిన రెడ్ కలర్ బీన్స్ నందు వేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని అన్నారు.   

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్లుతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, కో.అప్టేడ్ మెంబర్లు మరియు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 
   

More Press Releases