దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది

Related image

ప్రెస్ నోట్
హైదరాబాద్:2 డిసెంబర్,2022

- పట్టణ ప్రగతి కింద రాష్టంలోని నగరాలు, పట్టణాలకు ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం
- పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు రూ. 3,786 కోట్ల 78 లక్షల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- అందులో GHMC కే రూ.1,919 కోట్ల 49 లక్షల నిధులు ఇచ్చిన ప్రభుత్వం

దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందున్నది. నానాటికి విస్తరిస్తున్న పట్టణ, నగరములలో స్థిరపడిన ప్రజలతో పాటు వివిధ అవసరాలు, పనుల నిమిత్తం వచ్చే వారికి అవసరమైన మౌళిక వసతుల అభివృద్ధి పనులను ప్రణాళికయుతంగా చేపట్టుటకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రా వు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మార్గనిర్దేశంలో మౌళిక వసతులు,పారిశుధ్య పనులను మెరుగుపరుచుటకు ఆధునిక పద్ధతుల్లో పనులు చేయుటకు
ప్రభుత్వం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తున్నది. పట్టణ ప్రగతి పనులకు 2020 మార్చి నెల నుండి ఇప్పటివరకు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, నగరాలకు ప్రభుత్వం రూ.3,786 కోట్ల 78 లక్షలు నిధులు విడుదల చేసింది.అందులో GHMC కి రూ.1,919 కోట్ల 49 లక్షలు, మిగిలిన 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు రూ.1,866 కోట్ల 29 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిదులలో ఇప్పటివరకు రూ.3,066 కోట్ల 21 లక్షలు వినియోగించబడినాయి. రెగ్యులర్ గా పట్టణ ప్రగతికి విదూధల చేస్తున్న నిధులలో భాగంగా రూపాయలు 170.30 కోట్లను ఇటీ వాలెన్ ఇటీ వాలెన్ విడుదల చేసింది. 125 కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన పట్టణ ప్రగతి కార్యక్రమం నిధులు ఇవి అంధులో GHMC కి రూపాయలు 91.65 కోట్లు మిగిలిన కార్పొరేషన్లకురూ.78.48 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
     పట్టణ ప్రగతిలో అంత్యంత నివాసయోగ్య నగరాలు, పట్టణాలున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయస్థాయిలో గుర్తింపు లాబిస్తున్నది. GHMC మినహా 141 ULB లలో ఉన్న 2,548 శానిటేషన్ వెహికల్స్ ద్వారా రోజుకు 2,675 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించేవారు.పట్టణ ప్రగతితో అదనంగా 2,165 శానిటేషన్వె హికల్స్ ను కొనుగోలు చేశారు. శానిటేషన్ వెహికల్స్ సంఖ్య 4,713 కి పెరుగుట వలన రోజుకు తరలిస్తున్న గార్బేజి పరిమాణం 4,356 టన్నులకు చేరింది. దీనితో పట్టణ, నగర ప్రాంతాల్లో శానిటేషన్ప రిస్థితి మెరుగైంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగా 141 పురపాలక సంస్థలు మొత్తం 965 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో డంప్ యార్డ్స్ ను నిర్వహిస్తున్నవి .205 చోట్ల పొడి, తడి చెత్త సేకరణ కేంద్రాలను, 224 కాంపోస్ట్ షెడ్స్, బెడ్స్ ను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాలను కలుషితం కాకుండా కాపాడుటకు 71 నగర,పురపాలక సంస్థలో రూ.250 కోట్ల 73 లక్షలతో హమ్ మోడల్ లో నెలకొల్పిన మానవ మల వ్యర్ధాల శుద్ధి ప్లాంట్స్(FSTP ) నిర్వహణను పటిష్టo చేశారు. అలాగే రూ.177 కోట్ల 33 లక్షలతో కొత్తగా 68 పుర,నగర పాలక సంస్థల్లో EPC మోడల్ లో FSTP లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 139 FSTP ల ద్వారా రోజుకు 2,060 కిలోలీటర్ల మానవ మల వ్యర్ధాల శుద్ధికరణ చేసే సామార్థ్యం ఏర్పడుతుంది.
      కొత్తగా 20 నగర, పుర పాలక సంస్థల్లో మంజూరు చేసిన FSTP ల పనులు పూర్తయినాయి. 24 చోట్ల చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మరో 36 చోట్ల చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే 46 ULB లలో FSTP ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించడం జరిగింది. మరో 22 ULB లలో స్థల అన్వేషణ జరుగుతున్నది. గతంలో GHMC మినహా 141 ULB లలో 4,970 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నవి . ప్రతి వేయి మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం అమలుచేస్తున్నది. దానిలో భాగంగా పురుషులకు 2,060, మహిళలకు 2,058 మొత్తం 4,118 పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించారు. వీటితో కలిపి పబ్లిక్ టాయిలెట్స్ సంఖ్య 9,088 కి చేరాయి. పబ్లిక్టా యిలెట్స్ నిర్వహణకై 18 పారామీటర్లతో app based online checking ను అమలు చేస్తున్నది. ఈ పారామీటర్ల ప్రకారం ప్రతి మంగళవారం, శుక్రవారాలలో పబ్లిక్ టాయిలెట్స్ ను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో నగర,పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుకు చేపట్టిన పనులతో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నది.

          
 

More Press Releases