టియర్ 2 నగరాలతో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిన అల్టిగ్రీన్
విజయవాడ, 19 డిసెంబర్ 2022 ః భారతదేశంలో సుప్రసిద్ధ వాణిజ్య విద్యుత్ వాహన తయారీదారు అల్టిగ్రీన్, తమ పూర్తి సరికొత్త రిటైల్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని విజయవాడలో డిసెంబర్ 19,2022 న ప్రారంభించింది. ఇది కంపెనీకి అతి స్వల్పకాలంలోనే భారతదేశంలో పన్నెండవ రిటైల్ డీలర్‌షిప్. కంపెనీ వెల్లడించే దాని ప్రకారం, ఈ ఎక్స్‌పీరియన్స్ కేంద్ర ఈవీ ప్రియులు అల్టిగ్రీన్ యొక్క విద్యుత్ వాహనాలను సొంతం చేసుకునే అవకాశం అందిస్తుంది. అల్టిగ్రీన్ ఈ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయమైన మరియు ఆధారపడతగిన పేరుగా గుర్తించబడిన లక్ష్మి గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకుంది. వీరితో కలిసి చెన్నైలో సైతం అల్టిగ్రీన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రంను వీరు ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో ఆటోమొబైల్ డీలర్‌షిప్స్ పరంగా సుప్రసిద్ధ సంస్థలలో లక్ష్మి గ్రూప్ ఒకటి. లక్ష్మీ గ్రూప్ ప్రమోటర్ శ్రీ కె రామ మోహన రావు ఈ సంస్థను 1998లో అత్యున్నత నాణ్యత కలిగిన విక్రయాలు, సేవా అనుభవాలతో వినియోగదారులకు ఆనందం కలిగించే లక్ష్యంతో ప్రారంభించారు. లక్ష్మిగ్రూప్ ప్రస్తుతం, 100కు పైగా అత్యాధునిక వర్క్‌షాప్‌లు, ఆలోమొబైల్ షోరూమ్‌లు, యూజ్డ్ కార్ షోరూమ్‌లు, కమర్షియల్ వాహన షోరూమ్‌లు మరియు ఒక డ్రైవింగ్ స్కూల్‌ను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు వ్యాప్తంగా నిర్వహిస్తుంది.
విజయవాడలోని అల్టిగ్రీన్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని ఆర్ ప్రవీణ్, ఆర్‌టీఓ, విజయవాడ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాల నుంచి విద్యుత్ వాహనాల దిశగా ఆటోమొబైల్ ప్రపంచం మారడానికి అతి ముఖ్యమైన ముందడుగు వేస్తున్నందున ఈ రిటైల్ డీలర్‌షిప్ ప్రారంభంతో అల్టిగ్రీన్ , తమ వినియోగదారులకు మెరుగైన విధానాన్ని అందించడంలో తమ నిబద్ధతను కొనసాగిస్తోంది. ఈ డీలర్‌షిప్‌లో ప్రతి అంశాన్నీ స్వాగతించతగ్గ అనుభూతులను అందించే రీతిలో తీర్చిదిద్దారు. మరీ ముఖ్యంగా ఈ షోరూమ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ అంటే ఆటో రిక్షా డ్రైవర్లు, చిరు వ్యాపార యజమానులు మరియు అన్ని వర్గాల ప్రజలకు ఈ అనుభూతులను అందిస్తుంది. కంపెనీ యొక్క విలువలను ప్రతిబింబించే రీతిలో ఈ డీలర్‌షిప్‌ను అల్టిగ్రీన్ తీర్చిదిద్దడంతో పాటుగా వాహన ఉద్గారాలు తగ్గించబడతాయనే రీతిలో ఉంటూనే వినియోగదారుల నమ్మకాన్నీ పొందేందుకు కృషి చేస్తుంది.
అల్టిగ్రీన్ సీఈఓ మరియు ఫౌండర్ డాక్టర్ అమితాబ్ శరణ్ మాట్లాడుతూ ‘‘విజయవాడలోని మా నూతన రిటైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా జరిగిన ఈ విస్తరణతో, ఐసీఈ నుంచి ఈవీలకు మారే ప్రక్రియను సరళతరం చేస్తూ దేశవ్యాప్తంగా శక్తివంతమైన నెట్‌వర్క్ నిర్మించాలనే మా నిబద్ధతను కొనసాగిస్తున్నాము. ఇప్పుడు వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత పెరగడంతో ఈవీలు ప్రధాన స్రవంతి వాహనాలుగా మారుతున్నాయి. విజయవాడలో మా విస్తరణ మా ప్రణాళికలకనుగుణంగా జరిగింది. భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టియర్ 2 నగరాలలో ఒకటైన విజయవాడలో వృద్ధి చెందుతున్న వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు అవసరమైన శక్తివంతమైన మార్కెట్ ఉనికిని కలిగి ఉన్నామని నిర్ధారిస్తున్నాము. చెన్నై తరువాత, లక్ష్మి గ్రూప్‌తో మా భాగస్వామ్యంను విజయవాడలో కూడా విస్తరించినందుకు సంతోషంగా ఉన్నాము. బహుళ వాహన విభాగాలలో ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను అందించనున్నాము’’ అని అన్నారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీకాంత్ ఎర్రబల్లి, మేనేజింగ్ డైరెక్టర్ –లక్ష్మి గ్రూప్ మాట్లాడుతూ ‘‘అల్టిగ్రీన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతో విజయవాడలో ఈవీ విప్లవం తీసుకురానున్నాము. ఓ గ్రూప్‌గా, ప్రాంతీయంగా బలమైన పోటీతత్త్వాన్ని కలిగి ఉండటానికి ఆవిష్కరణల మాధ్యమం వినియోగించడం ద్వారా రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదగడానికి కృషి చేస్తున్నాము. విశ్వసనీయ బ్రాండ్లు మరియు ఉత్పత్తులతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని మేము నమ్ముతున్నాము. దీనిద్వారా నేటి వినియోగదారుల అవసరాలను తీర్చగలము. అల్టిగ్రీన్‌తో భాగస్వామ్యంతో, మా లక్ష్యంలో ఓ సమర్ధవంతమైన భాగస్వామితో చేతులు కలిపామని సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యంతో సస్టెయినబల్ లివింగ్‌కు ప్రచారం చేయడంతో పాటుగా విద్యుత్ మొబిలిటీ కి అతి సులభంగా మారడమూ సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ సరికొత్త మొబిలిటీ సొల్యూషన్స్‌కు మారే దిశగా ఉంది మరియు దానికి తగిన పర్యావరణ వ్యవస్ధనూ తీర్చిదిద్దింది. విద్యుత్ మొబిలిటీకి సంబంధించి అతి ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018–2023ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. వాటాదారులు,పరిశ్రమ అసోసియేషన్లు, పారిశ్రామిక నిపుణులతో సంప్రదింపులు జరిపి మరీ ఈ పాలసీ తీర్చిదిద్దారు. ఈ పాలసీ ద్వారా విద్యుత్ మొబిలిటీకి సంబంధించి ప్రతి అంశానికి మద్దతు అందించడం లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం విద్యుత్ వాహనాల స్వీకరణ వేగవంతం చేసేలా తోడ్పడే రీతిలో దీనిని రూపొందించారు.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనంతట తానుగా ఓ లక్ష్యం నిర్ధేశించుకుంది. దాని ప్రకారం 2022 నాటికి దేశంలో అత్యుత్తమ మూడు రాష్ట్రాలలో ఒకటిగా నిలువడంతో పాటుగా 2029 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా నిలువాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2050 నాటికి అంతర్జాతీయంగా అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా నిలవాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. దీనికనుగుణంగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ మొబిలిటీ రంగాన్ని గుర్తిచడంతో పాటుగా రాబోయే సంవత్సరాలలో వృద్ధి చోదకంగానూ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్ధను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్ధను నిర్మించడంలో అగ్రగామిగా ఉండాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
--