తెలంగాణాలో వాటర్‌ హీటర్ల ఉత్పత్తిని ప్రారంభించిన హింటాస్టికా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీఎల్‌) ; తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడి

Related image

·       మూడు బిలియన్‌ యూరో కంపెనీ గ్రూప్‌ అట్లాంటికా మరియు హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ నడుమ ఉమ్మడి భాగస్వామ్య సంస్ధ హెచ్‌పీఎల్‌.

·       అత్యాఽధునిక  తయారీ కేంద్రాన్ని తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. ఈ ఉత్పత్తులను సార్క్‌ రీజియన్‌లో బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక లకు ఎగుమతి చేస్తారు.

·       ఈ ప్లాంట్‌ను హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌  ఛైర్మన్‌ శ్రీ సందీప్‌ సోమానీ ; గ్రూప్‌ అట్లాంటిక్‌  సీఈఓ  శ్రీ పియర్రీ లూయిస్‌ ఫ్రాన్కోయిస్‌ మరియు  భారత్‌లో ఫ్రాన్స్‌  రాయబార కార్యాలయం– ట్రేడ్‌ కమిషనర్‌ శ్రీ ఎరిక్‌ ఫాజోల్‌  ప్రారంభించారు.
ఇండియా , 12 జనవరి 2023 : హింటాస్టికా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీఎల్‌) నేడు తమ శ్రేణి హీటింగ్‌ అప్లయెన్సస్‌ను తెలంగాణాలోని జడ్చర్లలో  ఏర్పాటుచేసిన అత్యాధునిక  ప్లాంట్‌ వద్ద తయారుచేయడం ప్రారంభించామని వెల్లడించింది.
దాదాపు 5.7 ఎకరాల విస్తీర్ణంలో 210 కోట్ల రూపాయల తొలి పెట్టుబడితో నిర్మించిన ఈ కేంద్రంలో  సంవత్సరానికి  ఆరు లక్షల యూనిట్ల వాటర్‌ హీటర్లు మరియు హీటింగ్‌ అప్లయెన్సస్‌ను  తయారుచేసే సామర్ధ్యం ఉంది.  ఈ సంస్ధ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.  ఈ ప్లాంట్‌ను పూర్తి అనుకూల డిజైన్‌తో రూపొందిచారు. ఇది అత్యాధునిక ఇంధన పొదుపు తయారీ యంత్రసామాగ్రి  మరియు పునరుత్పాదక విద్యుత్‌ వనరులను వినియోగించుకుంటుంది.


ఈ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌  ఛైర్మన్‌ శ్రీ సందీప్‌ సోమానీ ; గ్రూప్‌ అట్లాంటిక్‌  సీఈఓ  శ్రీ పియర్రీ లూయిస్‌ ఫ్రాన్కోయిస్‌ మరియు  భారత్‌లో ఫ్రాన్స్‌  రాయబార కార్యాలయం– ట్రేడ్‌ కమిషనర్‌ శ్రీ ఎరిక్‌ ఫాజోల్‌  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రూప్‌ అట్లాంటిక్‌ సీనియర్‌ ఉన్నతాధికారులు, వ్యూహాత్మక భాగస్వాములు. స్టేక్‌హోల్డర్లు సైతం పాల్గొన్నారు.


హెచ్‌పీఎల్‌కు  ఇప్పుడు ఈ ప్లాంట్‌ కూడా మద్దతు అందిస్తుంది కాబట్టి   అది ప్రబలశక్తిగా మారనుంది. ఈ ప్లాంట్‌ ద్వారా  సార్క్‌లో భాగమైన చుట్టు పక్కల దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. ఈ దేశాలో బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌,శ్రీలంక ఉన్నాయి.  ఈ ప్లాంట్‌ వద్ద ఉత్పత్తిస్కేర్‌ నమూనా మరియు సిలిండ్రికల్‌ స్టోరేజీ  వాటర్‌ హీటర్‌మోడల్స్‌ అల్వియో ; ఎర్జో నియా అంటూ అందిస్తుంది. మొట్టమొదటి పోర్బబల్‌ వాటర్‌ హీటర్‌, హింద్‌వేర్‌ అట్లాంటిక్‌ల క్వీక్‌ సైతం ఈ ప్లాంట్‌లో తయారు చేయనన్నారు
ఇటీవలి వెల్లడించిన పరిశ్రమ అంచనాల ప్రకారవ,  భారతదేశంలో వాటర్‌ హీటర్‌ల  మార్కెట్‌ సుమారు 2300 కోట్ల రూపాయలు మరియు ఇది  2032 నాటికి 6100 కోట్ల రూపాయలు కావొచ్చని అంచనా. భారతదేశంలో వ్యక్తిగత  విద్యుత్‌ వాటర్‌ హీటర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. దీనికి తోడు వేగవంతమైన నగరీకరణ, విద్యుత్‌ విస్తృత స్థాయిలో లభిస్తుండటం, పెరిగిన డిస్పోజబల్‌ ఇన్‌కమ్‌ కూడా దీనికి కారణం. అదనంగా,  భారతదేశంలో అత్యంత కీలకమైన  మెట్రో నగరాలలో ప్రీమియం హోమ్‌ అప్లయెన్సస్‌ ఉత్పత్తులకు సైతం గణనీయంగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు ఈ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం వల్ల కంపెనీ తమ లక్ష్య సాకార దిశగామరోఅడుగు ముందుకేస్తుంది. దానితో పాటుగా వాటర్‌  హీటర్‌ విభాగంలో మరింతగా మార్కెట్‌ పొంది, రాబోయే ఐదేళ్లలో అగ్రశ్రేణి మూడు కంపెనీలలో ఒకటిగా నిలువనుంది.


హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ శ్రీ సందీప్‌ సోమానీ మాట్లాడుతూ ‘‘గ్రూప్‌ అట్లాంటిక్‌తో మా ఉమ్మడి సంస్ధలో అత్యంత కీలకమైన అంశం ఇది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఉత్పత్తిని ఇప్పుడు ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము.  మా నూతన తయారీ కేంద్రం ప్రారంభించడం ద్వారా  మా మార్కెట్‌ వాటాను గణనీయంగా వృద్ధి చేయగలమని భావిస్తున్నాము. వాటర్‌ హీటర్‌ విభాగంలో మా స్థానాన్ని మరింతగా బలోపేతం చేయనున్నాము’’ అని అన్నారు.


గ్రూప్‌ అట్లాంటిక్‌ సీఈఓ శ్రీ పియార్రీ లూయిస్‌ ఫ్రాంకోయిస్‌ మాట్లాడుతూ ‘‘ పది సంవత్సరాల క్రితం హింద్‌వేర్‌తో మా అనుబంధం ప్రారంభమైంది. నేడు, ఆ భాగస్వామ్యంను మరోస్ధాయికి తీసుకువెళ్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము.  ఈ భాగస్వామ్యంతోనే ఈ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ హీటర్‌ కంపెనీ ప్రారంభించాము.  రెండు గ్రూప్‌లూ ఒకే తరహా పారిశ్రామిక, ఫ్యామిలీ విలువలు పంచుకుంటుంటాయి. భారతదేశంలో మా కార్యక్రమాలు  ప్రారంభమయ్యాయి.  ఇంతటి భారీ  మరియు మహోన్నత దేశమైన ఇండియాలో విజయం సాధించాలంటే మాకు బలమైన స్ధానిక భాగస్వామి కావాలని మాకు తెలుసు మరియు భారతదేశంలో తయారీ కార్యక్రమాలకు అది తప్పనిసరి’’ అని అన్నారు.


ఆయనే మాట్లాడుతూ‘‘ విడిభాగాల సాంకేతికతల పట్ల పూర్తి అవగాహన పొందడానికి ఇది సంబంధితంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ కారణం చేతనే మేము భారతదేశానికి మా విజ్ఞానాన్ని శక్తి నిర్వహణ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ పరంగా తీసుకువస్తున్నాము. ఇది మా భారతీయ డెవలప్‌మెంట్‌కు అతిపెద్ద ఆస్తిగా నిలుస్తుందని  మరియు అతి తక్కువ కార్బన్‌ ధర్మల్‌ ఉత్పత్తులతో శక్తి వినియోగాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము’’ అని అన్నారు.


      
ఈ ప్లాంట్‌ను  పర్యావరణ అనుకూలత మరియు ఇంధన సామర్ధ్యం అనే అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేశారు. ఈ భవంతి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ)ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది మరియు గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ కోసం అర్హత సాధించింది. ఈ ప్లాంట్‌కు సోలార్‌ప్యానెల్స్‌ అమర్చడం జరిగింది.  వీటి వార్షిక విద్యుత్‌  ఉత్పత్తి సామర్థ్యం1 మెగా వాట్‌. ఇదే కాదు, ప్లాంట్‌లోని కృత్రిమ కాంతి అంతా కూడా  ఓ ప్రత్యేక వ్యవస్ధను కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా ఎల్‌ఈడీ దీపాలను వినియోగిస్తుంది. ఈ ప్లాంట్‌లో రెయిన్‌వాటర్‌  స్టోరేజీ ట్యాంక్‌ కూడా ఉంది. ఇది 90% వర్షపు నీటిని ప్లాంట్‌లో తిరిగి వినియోగిస్తుందనే భరోసా అందిస్తుంది.  హార్వెస్టెడ్‌ రెయిన్‌ వాటర్‌, గ్రీన్‌బెల్ట్స్‌, సోలార్‌ పవర్‌ వినియోగంతో ఈ ప్లాంట్‌ తమ కార్యకలాపాలలో పునరుత్పాదక శక్తిని వినియోగిస్తుంది.


తయారీ , అభివృద్ధి, పర్యావరణ అనుకూల థర్మల్‌ పరిష్కారాలు, ఉత్పత్తుల పంపిణీ పరంగా ఆధిపత్యం చూపుతున్న గ్రూప్‌ అట్లాంటిక్‌ , ఇప్పుడు  హెచ్‌పీఎల్‌కు సాంకేతిక నైపుణ్యం అందించడం ద్వారా ప్రపంచ శ్రేణి హీటింగ్‌ అప్లయెన్సస్‌ ఉత్పత్తి చేస్తుంది.

More Press Releases