2022 సంవత్సరంలో 1200 నగరాల వ్యాప్తంగా 1.7 బిలియన్‌ ఉత్పత్తులను రవాణా చేసిన ఉడాన్‌

Related image

  • ఉడాన్‌పై ఒక కోటి రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలను నిర్వహించిన 586 మంది విక్రేతలు
  • 22 మిలియన్‌ ఆర్డర్లను నిర్వహించిన ఉడాన్‌
  • 70 మిలియన్‌ ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు, 30 మిలియన్‌లకు పైగా ఉత్పత్తులను లైఫ్‌స్టైల్‌ జనరల్‌ మర్చండైజ్‌ విభాగాలలో నిర్వహించడంతో పాటుగా 9 లక్షల టన్నుల నిత్యావసరాలు, 1.5 లక్షల టన్నుల ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయించారు
  • ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై 25% మంది రిటైలర్లు డిజిటల్‌ చెల్లింపులను జరిపారు
బెంగళూరు, 19 జనవరి 2023 :  భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఉడాన్‌ నేడు తాము 2022 సంవత్సరంలో 22 మిలియన్‌ ఆర్డర్ల  అవసరాలను తీరుస్తూ 1.7 బిలియన్‌ ఉత్పత్తులను రవాణా చేసినట్లు వెల్లడించింది. ఈ ఆర్డర్లను 1200 పట్టణాలు మరియు నగరాలలో  12500కు పైగా పిన్‌కోడ్‌లకు చేరవేసినట్లు వెల్లడించింది.  నిత్యావసరాల విభాగం కింద 9 లక్షల టన్నుల ఉత్పత్తులను  ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా డెలివరీ చేశామని, ఉడాన్‌ ద్వారా  2.5 మిలియన్‌ ఆర్డర్ల అవసరాలను తీరుస్తూ 131 మిలియన్‌ ఉత్పత్తులను ఎలకా్ట్రనిక్స్‌ , జనరల్‌ మర్చండైజ్‌, లైఫ్‌స్టైల్‌ విభాగాలలో రవాణా చేశామని వెల్లడించింది. ఈ కాలంలో 586మంది విక్రేతలు ఒక కోటి రూపాయల వ్యాపారం చేస్తే, 174 మంది విక్రేతలు 2 కోట్ల రూపాయల రూపాయల విలువైన వ్యాపారం చేసినట్లు వెల్లడించింది.

    


కిరాణా కామర్స్‌ను వృద్ధి చేయడంతో పాటుగా సాంకేతికతపై ఆధారపడి ఉడాన్‌, చెల్లింపులకు సైతం డిజిటైజేషన్‌ ప్రోత్సహిస్తుందని, 2022 సంవత్సరంలో దాదాపు 25% మంది రిటైలర్లుడిజిటల్‌ మాధ్యమాలను చెల్లింపుల కోసం వినియోగించినట్లు వెల్లడించింది.


ఉడాన్‌ సీఈఓ, కో–ఫౌండర్‌ వైభవ్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘ఫుడ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఎలకా్ట్రనిక్స్‌, జనరల్‌ మర్చండైజ్‌, ఫార్మా తదితర రంగాలలో చక్కటి వృద్ధిని మేము చూశాము.పలు బ్రాండ్లతో మా బంధాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నాము. వారు మా ప్లాట్‌ఫామ్‌పై చక్కటి వృద్ధిని నమోదు చేస్తున్నారు. మా చేరిక, సామర్థ్యం, నెట్‌వర్క్‌ చేరికతో  ఈ–కామర్స్‌ ప్రయోజనాలను లక్షలాది మంది రిటైలర్లు, కిరాణా స్టోర్లకు భారత్‌ వ్యాప్తంగా అందిస్తున్నాము’’ అని అన్నారు.

More Press Releases