డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో ఎకో విన్న‌ర్స్ సమావేశం

Related image

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 20, 2023: అస్సాం, ప‌శ్చిమ‌బెంగాల్, ఢిల్లీ, కేర‌ళ‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఆరుగురు ఫైన‌లిస్టుల‌తో డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో ఎకో విన్న‌ర్స్ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశం జ‌న‌వ‌రి 18, 19 తేదీల్లో జ‌రిగింది. యువత నాయకత్వం, కార్యాచరణపై ఇంటరాక్టివ్ సెషన్లలో పాల్గొన్నారు. అమీన్ పూర్ చిత్తడి నేలలు, మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం సంద‌ర్శ‌న‌తో పాటు, హైదరాబాద్ నగరంలోని చారిత్ర‌క ప్రాతాల్లో పర్యటన నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్ ఇండియా ఎకో యూత్ అంబాసిడర్ దీప్షికా య‌దుగిరి పాల్గొన్నారు. యువత సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది కొత్త ఆలోచనలను ప్రాసెస్ చేయడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో నాయకులను బాధ్యతలు స్వీకరించేలా సిద్ధం చేయడానికి చేసే ప్రయత్నమ‌ని ఆమె న‌మ్ముతారు.
 
ఎకో - ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ హీరోస్ అనేది దేశ‌వ్యాప్తంగా యువ‌త‌ను ఎంగేజ్ చేసే కార్య‌క్ర‌మం. ఇది విశ్వవిద్యాలయ విద్యార్థులు హరిత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవకాశాన్ని అందిస్తుంది. 2018లో కేవలం నాలుగు నగరాలు, 20 కళాశాలలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్ర‌మంగా.. దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలోని కార్యక్రమంగా అభివృద్ధి చెందింది. కళలు, సైన్స్, ఇంజనీరింగ్, వైద్య సంస్థలు, మేనేజ్‌మెంట్‌, లా.. ఇలాంటి విభిన్న విద్యా నేపథ్యాలకు చెందిన‌ యువత ఆసక్తులను ఆకర్షిస్తుంది. 2022 నాటికి ఎకో పది రాష్ట్రాలు, 78 సంస్థలకు విస్తరించింది.
 
డ‌బ్ల్యుడ‌బ్ల్యుఎఫ్-ఇండియా ప్రస్తుత పర్యావరణ ఆందోళన కేంద్రంగా ప్ర‌తియేటా ఒక థీమ్‌ను ప్రకటిస్తుంది. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. పర్యావరణ సమస్యకు వినూత్నమైన, విభిన్న‌మైన పరిష్కారాన్ని గుర్తించి, దానిని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని యువతకు సూచిస్తుంది. యువత నేతృత్వంలోని ప్రాజెక్టులను రాష్ట్ర, జాతీయ స్థాయి సదస్సుల్లో ప్రదర్శిస్తారు. ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్ నెస్, ఇంపాక్ట్, స్కేలబిలిటీ వంటి పారామీటర్లపై నిపుణుల ప్యానెల్ ఈ పైలట్ ప్రాజెక్టుల ఫలితాలను పరిశీలిస్తుంది.  వ‌చ్చిన‌వాటిలో ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేసి, దాన్ని మ‌రింతగా అభివృద్ధి చేసేందుకు సీడ్ గ్రాంటు ఇస్తారు.

గత నాలుగు చాప్ట‌ర్లలో, యువత 200కి పైగా ఎకో ప్రాజెక్టులను అమలు చేశారు. మూస‌ప‌ద్ధ‌తుల‌ను తోసిరాజ‌ని, సాంకేతిక ఆవిష్కరణలను ప్రవేశపెట్టి, అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఉద్దేశించి ఐదు మిలియన్ల మందిని ప్రభావితం చేశారు.
 
ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ప్రపంచ ప్రయత్నాలకు కేంద్రబిందువుగా ఉంది. అవి, సహజ ప్రపంచాన్ని రక్షించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం మరియు సహజ వనరులలో ప్రజలు తమ న్యాయమైన వాటాను మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలు కల్పించడం. 50 సంవత్సరాలుగా, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా, వివిధ ప్రాంతాలలో త‌న కార్యాలయాల ద్వారా, ప్రకృతి పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా సంరక్షణ ప్రయత్నాల ప్రధాన అంశాలలో ఒకటి విద్య‌. పరిరక్షణ చర్యలు, సృజనాత్మకత వైపు యువత‌ను ప్రేరేపించడం, ప్రకృతితో వారిని అనుసంధానించడం ముఖ్యమైన ల‌క్ష్యాలు.
 
పర్యావరణ విద్యను డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా ఎప్ప‌టినుంచో చేప‌డుతోంది. సుస్థిర భూగ్రహం కోసం చర్యలు తీసుకోవడానికి భారతదేశంలోని పిల్లలు, యువత, పౌరులకు సమాచారం ఇవ్వడం, ప్రేరేపించడం, సాధికారత కల్పించడం అనే దాని లక్ష్యం, దార్శనికత కోసం ఈ విభాగం నిరంతరం పనిచేస్తోంది.

More Press Releases