250 పడకల అమోర్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
- దేశంలోనే ఉత్తమ ఆర్థో ఆంకాలజీ సర్జన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ కిషోర్ బి. రెడ్డి నేతృత్వంలో ప్రపంచ స్థాయి మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ అందించనున్న అమోర్ ఆస్పత్రి
- ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 4, 2023: నగరంలో మల్టీ స్పెషాలిటీ, కేన్సర్ చికిత్స సదుపాయాలతో 250 పడకలతో కూడిన అమోర్ ఆస్పత్రిని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ టి. హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. దేశంలోనే ఉత్తమ ఆర్థో ఆంకాలజీ సర్జన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ కిషోర్ బి. రెడ్డి నేతృత్వంలో ప్రపంచ స్థాయి మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలను అమోర్ ఆస్పత్రి అందించనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
కూకట్‌పల్లి వై.జంక్షన్ సమీపంలో ఉన్న అమోర్ ఆస్పత్రిలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు ఉన్నారు. వారు రోగులకు చికిత్స, మద్దతు అందించడానికి 24 గంటలూ అందుబాటులో ఉంటారు. అత్యాధునిక క్లినికల్ పరిశోధనల ద్వారా రోగులకు ఎవరికి వారికే కచ్చితమైన చికిత్సను అందించడానికి డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు ద్వారా అమోర్ ఆస్పత్రిలోని హెల్త్ కేర్ టెక్నాలజీ మద్దతు ఇస్తుంది. 30కి పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అమోర్ ఆస్పత్రి అంతర్జాతీయ స్థాయి చికిత్సను అందించనుంది.
ఈ సందర్భంగా అమోర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, “నాణ్యమైన వైద్యసేవలు ఇప్పుడు విలాసం కావు. ఈ కాలంలో చాలా అవసరమని అమోర్ ఆస్పత్రిలో మేమంతా నమ్ముతున్నాము. రోగులు, వారి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం అమోర్ ఆస్పత్రి మొదటి లక్ష్యం. నాణ్యమైన చికిత్సలను అందించాలన్న అభిరుచి, నిబద్ధతను చాటేందుకు కలిసి వచ్చిన వైద్య నిపుణుల మానసపుత్రికే ఈ ఆస్పత్రి. అమోర్ ఆస్పత్రి ప్రధాన విలువలు దాని పేరుకు ఉన్న అర్థంతో ప్రతిధ్వనిస్తాయి. రోగులకు ప్రేమ, సానుభూతి, సంరక్షణతో సేవలందించడంపై మా దృష్టి ఉంటుంది” అన్నారు.
రాడికల్ లాంజ్‌తో కూడిన అధునాతన క్యాథ్ ల్యాబ్, 1.5 టెస్లా ఎంఆర్ఐ సదుపాయం, అనేక ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నిపుణులతో... సంపూర్ణ చికిత్సలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం అమోర్ ఆస్పత్రి ప్రత్యేకత. ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ సదుపాయంతో పాటు 2 ఐసోలేషన్ పడకలు ఆ తరహా అవసరం ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. అధునాతన ప్రాసెసింగ్ కోసం ఫుల్ రూమ్ డిఆర్ ఎక్స్-రే యంత్రం అమోర్ ఆస్పత్రి వంటి మధ్యతరహా ఆస్పత్రులకు పూర్తిగా కొత్తదనం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి సభ్యులు శ్రీ కె.నవీన్ కుమార్, కూకట్ పల్లి శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పగడాల శిరీష, మరికొందరు విశిష్ట అతిథులు హాజరయ్యారు.
అమోర్ ఆస్పత్రి గురించి:
పలువురు వైద్యనిపుణులు, వైద్యరంగ నిపుణులు కలిసి నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్న తపన, నిబద్ధతతో ఏర్పాటుచేసినదే అమోర్ ఆస్పత్రి. అమోర్ ఆస్పత్రి ప్రధాన విలువలు దాని పేరుకు ఉన్న అర్థంతో ప్రతిధ్వనిస్తాయి. ప్రేమ, సహానుభూతి, సంరక్షణతో రోగులకు సేవ చేయడంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. నాణ్యమైన చికిత్సలకు, ఆర్థిక స్థోమతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలనే లక్ష్యంతో, అమోర్ ఆస్పపత్రి రోగి సంరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. డాక్టర్ కిశోర్ బి. రెడ్డి నేతృత్వంలోని అమోర్ ఆస్పపత్రి రోగ నిర్ధారణ, చికిత్సలో రోగికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇది చికిత్స విధానాలకు వెన్నెముక లాంటిది. దీన్ని పాలనావ్యవస్థలో అంతర్భాగం చేయడం రోగులు, వారి కుటుంబాలతో మా సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి దోహదపడుతుంది.