2023 హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ గ్రహీతలను వెల్లడించిన హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌

Related image

ఇండియా, 27 ఫిబ్రవరి 2023 : హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ నేడు  తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌  2023 ఎడిషన్‌ కోసం ఎన్‌జీఓలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారతదేశంలో పర్యావరణ అనుకూల గ్రామీణాభివృద్ధికి మద్దతును  ఈ హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ అందిస్తుంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ యొక్క కార్పోరేట్‌ సామాజిక బాధ్యత లక్ష్యాలను  హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ చేరుకునేందుకు కృషి చేస్తుంది.


మూడు ఎన్‌జీఓలు– ప్లానెట్‌ ఎర్త్‌, ఇన్నోవేటర్స్‌ ఇన్‌ హెల్త్‌ (ఐఐహెచ్‌) ఇండియా మరియు మేఘ్‌శాల ట్రస్ట్‌ లు – ఒక్కోదానికి ఐదు కోట్ల రూపాయలు (సుమారు ఒక్కొక్కరికి 6,20,000 డాలర్లు) చొప్పున హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ఎండోమేంట్‌ కింద తమ ప్రాజెక్టులకు అందుకున్నాయి. ఈ సంవత్సరపు విజేతలను 15వేల సంస్థలు పంపిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ దరఖాస్తుల సంఖ్య 80% పెరిగింది.


హెచ్‌సీఎల్‌ టెక్‌  బోర్డు సభ్యులు మరియు హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌  శ్రీమతి రాబిన్‌ అన్‌ అబ్రామ్స్‌ మాట్లాడుతూ ‘‘ఈ సంస్థలు మరియు వాటి ప్రాజెక్టులు– హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ దృష్టి సారించిన అత్యంత కీలకమైన విభాగాలైనటువంటి పర్యావరణం, ఆరోగ్యం, విద్యకు అనుగుణంగా ఉండటంతో పాటుగా  కనిపించే రీతిలో తుదికంటా కూడా సమ్మిళిత మార్పును తీసుకువస్తుంది.  వారి కార్యకలాపాలు గ్రామీణ సమాజంలో   ఆరోగ్య సంరక్షణ పరంగా అసమానతలను తొలగించడం, మంచినీటి పొదుపులో సహాయపడటం, బీద వర్గాల ప్రజలకు విద్యను తీసుకురావడం ద్వారా  అతి ముఖ్యమైన జీవనాధారాన్ని అందిస్తుందని మేము నమ్ముతున్నాము’’ అని అన్నారు.


అదనంగా, ఆరుగురు ఎన్‌జీఓ ఫైనలిస్ట్‌లు 25 లక్షల రూపాయల చొప్పున గ్రాంటు (దాదాపు 30వేల డాలర్ల చొప్పున) ఈ దిగువ విభాగాలలో అందుకున్నారు :
·       పర్యావరణం : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ , పూనె (ఐఐఎస్‌ఈఆర్‌) ; నార్త్‌ ఈస్ట్‌ ఇనీషియేటివ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఈఐడీఏ)
·       విద్య : మహాన్‌ ; శ్రీ శ్రీ రూరల్‌ డెవలప్‌మెంట్‌  ప్రోగ్రామ్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌డీపీటీ)
·       ఆరోగ్యం : టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) ; గురియా స్వయం సేవా సంస్థాన్‌ (జీఎస్‌ఎస్‌ఎస్‌)
ఎనిమిది  సంవత్సరాల క్రితం హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించిన నాటి నుంచి  హెచ్‌సీఎల్‌  ఫౌండేషన్‌ ఇప్పటి వరకూ 130 కోట్ల రూపాయలు (దాదాపు 16 మిలియన్‌డాలర్లు)ను ఎన్‌జీఓలకు అందించింది. వీటి ద్వారా దాదాపు 1.8 మిలియన్‌ల మంది లబ్ధిదారులు , భారతదేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలు,రెండు  కేంద్రపాలిత ప్రాంతాలలోని 25వేల గ్రామాలలో చేరుకోగలిగింది.


హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌, గ్లోబల్‌ సీఎస్‌ఆర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ నిధి పున్ధీర్‌ , పలువురు ఎన్‌జీఓల ప్రతినిధులు, హెచ్‌సీఎల్‌ ,  హెచ్‌సీఎల్‌ టెక్‌, మీడియా ప్రతినిధులు హాజరైన వర్ట్యువల్‌ వేడుకలో అవార్డు గ్రహీతలకు  వాటిని అందజేశారు.  ఈ అవార్డులను పూర్తి స్థాయిలో గ్రాంట్‌ థోరంటన్‌–ఆడిటెడ్‌  ప్రక్రియలో  అందించారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరారంభంలో  దేశవ్యాప్తంగా పలు సింపోజియంలను ఏర్పాటుచేయడంతో పాటుగా  రెండు వేలకు పైగా ఎన్‌జీవోలు, ప్రభుత్వం, కార్పోరేట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.


‘‘ఈ సంవత్సరపు ఎంపిక ప్రక్రియ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ఈ ఎన్‌జీఓలతో  భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా గవర్నెన్స్‌ను శక్తివంతం చేయడంతో పాటుగా  స్ధిరమైన గ్రామీణాభివృద్ది  కోసం వినూత్నమైన ఆలోచనలను మెరుగుపరుచుకోవడంలోనూ సహాయపడుతుంది. గ్రామీణ కమ్యూనిటీల కోసం వేగవంతమైన వృద్ధిని పెంచే వినూత్నమైన జోక్యాలను వృద్ధి చేయడానికి ఈ సంవత్సరం ఎంపిక కాబడిన ఎన్‌జీఓలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని  డాక్టర్‌ పున్ధీర్‌ అన్నారు.


గత కాలంలో హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ గ్రహీతలు చేసిన కృషిని వివరించే ఫిప్త్‌ ఎస్టేట్‌ –ఎన్‌జీఓస్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌, హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఫిఫ్త్‌ ఎస్టేట్‌ –  పర్యావరణం, ఆరోగ్యం, విద్యలో  లు గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చిన ఎన్‌జీవోలు) శీర్షికన  సంకలనం యొక్క ఏడవ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పుస్తకం అన్ని జాతీయ లైబ్రరీలలో మరియు అంతర్జాతీయ అనుబంధ సంస్ధల ద్వారా అందుబాటులో ఉంటుంది.


పర్యావరణ విభాగంలో హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ను ప్లానెట్‌ఎర్త్‌కు అందించారు.  నీటి వనరుల పరిరక్షణకు ఈ సంస్ధ తమ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా సముద్రాల నుంచి ప్లాస్టిక్స్‌ను ఏరివేయడం ద్వారా నీటి వనరులను పరిరక్షిస్తుంది. చెరువులు మరియు బ్యాక్‌వాటర్స్‌ నుంచి గుర్రపు డెక్క వంటివి తొలగించడం వంటివి చేస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా కేరళలో 45 గ్రామాలలో 170,000 మంది మత్య్యకారులు నేరుగా ప్రయోజనం పొందారు. ఈ ప్రాజెక్ట్‌తో నీటి వనరుల నాణ్యత మెరుగుపరచడంతో పాటుగా చేపలు పట్టే వృత్తిలో ఉన్న వారి జీవనోపాధిపై సానుకూల ప్రభావమూ పడుతుంది.


‘‘ప్రపంచంలో  సముద్రాలు మరియు మరీ ముఖ్యంగా కేరళలో తీరప్రాంతాలు ప్లాస్టిక్‌ చేత కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి.  దీని కారణంగా   చేపల వృత్తిలో ఉన్నవారి జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ద్వారా మేము మా లక్ష్యాలను చేరుకోవడంతో పాటుగా కేరళలో గ్రామీణ  మత్య్సకారులకు  సహాయపడుతూనే భూగోళాన్ని కూడా పరిరక్షించగలము’’ అని సూరజ్‌ అబ్రహం, ఫౌండర్‌, ప్లానెట్‌ ఎర్త్‌ అన్నారు.


ఇన్నోవేటర్స్‌ ఇన్‌ హెల్త్‌ (ఐఐహెచ్‌) ఇండియా  ఈ హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ను ఆరోగ్య విభాగంలో  అందుకుంది. గ్రామీణ బీహార్‌లో  యూనివర్శిల్‌ క్షయ చికత్స ప్రాజెక్ట్‌పై ఇది పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌తో  ప్రజా ఆరోగ్య వ్యవస్ధలను మిళితం  చేయడం ద్వారా క్షయ భారం తగ్గించడంతో పాటుగా  డయాగ్నోస్టిక్స్‌ను మెరుగుపరచడం మరియు చికిత్సావకాశాలను మెరుగుపరచడమూ సాధ్యమవుతుంది.  బీహార్‌లోని  సమస్తిపూర్‌ జిల్లాలో 1260 గ్రామాల్లోని 10500 మందిని ఇది చేరుకుంది.


‘‘మా పట్ల  నమ్మకం చూపిన హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.  ఈ గ్రాంట్‌ తో మా సేవలను విస్తరించడం సాధ్యమవుతుంది.  ఇప్పటికే మేము విస్తృత శ్రేణిలో ప్రజలను చేరుకోవడంతో పాటుగా  భారతదేశంలో క్షయ చికిత్స పరంగా సమిష్టిపూర్‌ను వినూత్నమైన జిల్లాగా మార్చాము’’ అని డాక్టర్‌ మనీష్‌ కుమార్‌ , సీఈఓ, ఇన్నోవేటర్స్‌ ఇన్‌ హెల్త్‌ (ఐఐహెచ్‌) ఇండియా అన్నారు.


విద్య విభాగంలో  మేఘశాలకు హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ను  అందజేశారు. ఈ సంస్థ సాంకేతిక ఆధారిత టీచర్‌ సామర్ధ్య నిర్మాణ ప్రాజెక్ట్‌పై కృషి చేస్తుంది.  మరీ ముఖ్యంగా స్ధానిక భాషలపై దృష్టి సారించి ఇది చేస్తుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా సిక్కింలో  2700 మంది ప్రైమరీ, సెకండరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు 63వేల మంది గ్రేట్‌1–8 విద్యార్ధులు 460 గ్రామాలలో ప్రయోజనం పొందారు.  ఈ ప్రాజెక్ట్‌తో  డిజిటల్‌ అక్ష్యరాస్యత  మెరుగుపడటంతో  పాటుగా యువతరం స్ధానిక భాషలు మాట్లాడేందుకు సైతం ప్రోత్సహిస్తుంది.


‘‘మా అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోనూ  భాష  అత్యంత కీలకంగా ఉంది. హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ యొక్క మద్దతు  తో మా సేవలను విస్తరించడంతో పాటుగా దేశవ్యాప్తంగా మా క్లాస్‌రూమ్‌లను  విస్తరించడం కూడా సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా  ఇది స్ధానిక భాషలలో బోధన చేయడంతో పాటుగా మా జోక్యం అవసరమైనప్పుడు అది  చేయడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని జ్యోతి త్యాగరాజన్‌, ఫౌండర్‌ మరియు సీఈఓ  మేఘ్‌శాల ట్రస్ట్‌ అన్నారు.


 ఈ గ్రాంట్‌ అందుకున్న ఎన్‌జీవోలను సుప్రసిద్ధ న్యాయనిర్ణేతలు  సమగ్రంగా సమీక్షించి  ఎంపిక చేశారు. హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ గవర్నన్స్‌ పార్టనర్‌ గ్రాంట్‌ థోరంటన్‌ ఆడిట్‌ చేశారు.  ఈ న్యాయనిర్ణేతల బృందానికి  ఛైర్‌పర్సన్‌గా  హెచ్‌సీఎల్‌ టెక్‌ బోర్డు సభ్యురాలు  శ్రీమతి రాబిన్‌ అన్‌ అబ్రహం వ్యవహరించగా,  నెస్లే ఇండియా  లిమిటెడ్‌  ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సురేష్‌ నారాయణ్‌ ;  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌  పూర్వ డైరెక్టర్‌ మరియు హ్యూమన్‌ రిసోర్శెస్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ పూర్వ సెక్రటరీ శ్రీ బీ ఎస్‌ బస్వాన్‌ ;  షార్దూల్‌ అమర్‌చంద్‌ మంగల్‌దాస్‌ అండ్‌ కో మేనేజింగ్‌ పార్టనర్‌ శ్రీమతి పల్లవి ష్రాఫ్‌ ;  సంస్కృత్‌ స్కాలర్‌ అండ్‌  ప్రెసిడెంట్‌ ఎమిరటస్‌, ఫీల్డ్‌ మ్యూజియం (చికాగో) డాక్టర్‌ రిచార్డ్‌ లరివీరీ ; హెచ్‌సీఎల్‌ గ్రూప్‌  ఫౌండర్‌ మరియు  హెచ్‌సీఎల్‌ టెక్‌ ఛైర్మన్‌ ఎమిరటస్‌ శ్రీ శివ్‌ నాదార్‌ ఉన్నారు.
 

More Press Releases