కొరొనరీ అర్టెరీస్‌లో పేరుకుపోయిన కాల్షియం నిల్వలను తొలగించడం కోసం నూతన టెక్నాలజీ వినియోగించిన కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌

Related image

హైదరాబాద్‌, 13 మార్చి 2023 : కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ నూతన బెంచ్‌మార్క్‌ను  అత్యంత విజయవంతంగా అత్యాధునిక ఆర్బిటాల్‌ అథెరెక్టమీ డివైజ్‌ సాంకేతికతను వినియోగించడం ద్వారా  క్లీనికల్‌ ఎక్స్‌లెన్స్‌ పరంగా ఏర్పరిచింది.  ఈ ఉపకరణాన్ని యుఎస్‌ఏలో  గత ఏడు సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు ఇప్పుడు ఇది ఇండియాకు కూడా వచ్చింది. తద్వారా భారతీయ రోగులు ఈ నూతన సాంకేతికతతో ప్రయోజనం పొందగలరు. ఈ ప్రక్రియ, ముఖ్యంగా తమ కొరొనరీ అర్టెరీస్‌ (గుండెకు రక్త సరఫరా చేసే ధమనులు)లో కాల్షియం అధికంగా పేరుకుపోయి, రక్త ప్రసరణ పరంగా తీవ్ర అవరోధాలు ఎదురయ్యే అవకాశాలున్న రోగులకు సహాయకారిగా ఉంటుంది.


కొరొనరీ అర్టెరీస్‌ , ప్రధానంగా మూడు ఉంటాయి. ఇవి  ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండెకు సరఫరా చేయడంలో బాధ్యత వహిస్తాయి. అయితే, మధుమేహం, పొగతాగే అలవాటు, అత్యధిక కొవ్వుతో కూడిన ఆహారం, వ్యాయామాలు లేకపోవడం మరియు ఒత్తిడి వంటివి  ఈ ధమనులలో  కొలెస్ట్రాల్‌ నిల్వలు పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఇది రక్తప్రసరణలో అవాంతరానికి మరియు గుండెపోటుకు కారణమవుతుంది. కొంతకాలానికి, ఈ అవరోధాలు అత్యంత కఠినమైన కాల్షియం నిల్వలుగా మారడంతో పాటుగా బైపాస్‌ సర్జరీ అవసరం పడేటట్లు చేస్తాయి. అదృష్టవశాత్తు , ఈ కాల్షియం నిల్వలను తొలగించడం కోసం కటింగ్‌ బెలూన్స్‌, ఐవీఎల్‌  (లిథోట్రిప్సీ), రోటాబ్లాటర్‌ సహా పలు పద్ధతులు ఉన్నాయి.  ఇప్పుడు కొత్తగా  ఆర్బిటాల్‌ అథెరెక్టోమీ డివైజ్‌ వచ్చింది.


వినూత్నమైన సాంకేతికత ఆర్బిటాల్‌ అథెరెక్టోమీ డివైజ్‌. దీనిలో  1.25 మిల్లీమీటర్‌ వ్యాసార్థం కలిగిన మినీయేచర్‌ క్రోన్‌ చుట్టూ డైమండ్‌ చిప్స్‌ పొదిగి ఉంటాయి. ఈ ఉపకరణం, నిమిషానికి సుమారు 1,00,000 రొటేషన్స్‌  చేయడంతో పాటుగా కాల్షియంను తొలగిస్తుంది. ఆ తరువాత స్టెంట్‌ను లోపలకు పంపుతారు. ఈ డివైజ్‌తో ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయని అత్యాధునిక ఇమేజింగ్‌ మెషీన్‌ ఓసీటీ (ఆప్టికల్‌ కో౅హెరెన్స్‌ టోమోగ్రఫీ) వినియోగించి  నిర్థారించారు.  ఈ డివైజ్‌తో చికిత్స పొందిన రోగులను 48 గంటలలో డిశ్చార్జ్‌ చేస్తారు. దీనితో బైపాస్‌ సర్జరీ అవసరం కూడా తప్పుతుంది. అనంతర కాలంలో, యాంటీ ప్లేటెలెట్స్‌ మరియు స్టాటిన్స్‌ సైతం వినియోగించడం ద్వారా  ఆరోగ్యానికి భరోసా అందిస్తారు.


కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ వద్ద కార్డియాలజిస్ట్‌ల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ సూర్య ప్రకాష్‌ రావు,  డాక్టర్‌ బీకెఎస్‌ శాస్త్రి మరియు డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్ధిలతో కూడిన బృందం ఈ ప్రక్రియను అత్యున్నత విజయాలతో  చేసింది.  తమ గుండె ధమనులలో  తీవ్రంగా కాల్షియం నిల్వలు కలిగిన నలుగురు రోగులకు,  ఆర్బిటాల్‌ అథెరెక్టోమీ తో విజయవంతంగా చికిత్సను కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ వద్ద చేశారు. ఈ రోగులలో   గతంలో బైపాస్‌ చేయించుకున్న రోగులు కూడా ఉన్నారు.  కేర్‌ హాస్పిటల్స్‌ వద్ద ఈ  విధానాన్ని తొలిసారిగా వినియోగించాము అని డాక్టర్‌ సూర్య ప్రకాష్‌ రావు అన్నారు.


‘‘విప్లవాత్మక ఆర్బిటాల్‌ అథెరెక్టోమీ డివైజ్‌ను కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ వద్ద  పరిచయం చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.  గుండె ధమనులలో పేరుకుపోయిన కాల్షియం నిల్వలను తొలగించే దిశగా వేసిన అతి పెద్ద ముందడుగు ఇది. ఈ నూతన సాంకేతికత మరింతగా మా రోగులకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన చికిత్సావకాశాలను అందించడంలో తోడ్పడుతుంది. ఈ చికిత్సతో రోగి కోలుకునేందుకు తక్కువ సమయం పట్టడంతో పాటుగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా  తక్కువగా ఉంటాయి.  కేర్‌ హాస్పిటల్స్‌ వద్ద, మేము అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఆరోగ్య సంరక్షణ పద్ధతులను మా రోగుల కోసం తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. ఆ నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ’’ అని  కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌, గ్రూప్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌– డాక్టర్‌ నిఖిల్‌మాథుర్‌ అన్నారు.


ఈ నూతన విధానంతో చికిత్స పొందిన నలుగురు రోగులూ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారు. వారి  శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యాయి.  ఇది కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌కు మరో విజయవంతమైన మైలురాయిగా నిలిచింది. రోగులకు మెరుగైన ఫలితాలను అందించేందుకు  విప్లవాత్మక సాంకేతికత  వినియోగించడం ద్వారా  క్లీనికల్‌ పరంగా ఉన్నత ఫలితాలను పొందేందుకు ఇది ప్రాధాన్యతనిస్తుంది.

More Press Releases