ఆహా’వారి ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ స్టేజ్‌పై ర్యాప్ డాన్స్ పెర్ఫామెన్స్‌తో దుమ్ము రేపిన నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ మరోసారి ఆహాలో అభిమానులను అలరించటానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన తన మ్యూజికల్ టాలెంట్‌ను స్టేజ్‌పై చూపించబోతున్నారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ నిర్వహిస్తోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ లో పాల్గొనబోతున్న టాప్ 12 కంటెస్టెంట్స్‌ను ఈ సరికొత్త లుక్‌లో లెజండ్రీ యాక్టర్ ఆడియెన్స్‌కు పరిచయం చేయబోతున్నారు. అది కూడా తొలిసారిగా ఆయన స్టేజ్‌పై హేమ చంద్ర కంపోజ్ చేసిన పాటను పాడుతూ డాన్స్‌తో అలరిస్తూనే మరోవైపు ఇండియన్ ఐడల్ 2 కంటెస్టెంట్స్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు బాలకృష్ణ. ఇంతకు ముందెన్నడూ చూడని స్టైల్లో బాలకృష్ణ స్టేజ్‌పై ప్రేక్షకులను అలరించటం అనేది ఎంటర్‌టైన్మెంట్ షోలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించనుంది. ఈ షో మార్చి 17, 18వ తేదీల్లో ఆహాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.
ఓ ర్యాప్ పాడుతూ డాన్స్ చేయటం గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘సంగీతం ఎప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 కార్యక్రమంలో నేను భాగం కావటం అనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నేను ఇప్పటి వరకు చేయని ర్యాప్ పెర్ఫామెన్స్‌ను స్టేజ్‌పై చేయబోతున్నాను. ఇది కచ్చితంగా ఆడియెన్స్‌ను సర్‌ప్రైజింగ్ అనే చెప్పాలి. కార్యక్రమంలో కంటెస్ట్ 12 మందిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాను. వారికి మ్యూజిక్‌పై నాకున్న ప్రేమ, అనుబంధాన్ని తెలియజేస్తాను. ఇది నిజంగా ఓ గొప్ప అనుభవం. ప్రతి ఒక్కరూ వారి అభిరుచిని బట్టి ముందుకు వెళ్లాలి. అలా వెళుతూ వారి కలలను నేరవేర్చుకోవాలి. ఆహాలో #గాలా విత్ బాలతో మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్‌ను సెలబ్రేట్ చేసుకుందాం.’’
న్యూ జెర్సీ నుంచి శ్రుతి నండూరి (26), హైదరాబాద్ నుంచి సాకేత్ కొమ్మ జోశ్యుల (18), హైదరాబాద్ నుంచి జి.వి.ఆదిత్య (21), పలాస నుంచి చక్రపాణి నాగ్రి (29), విశాఖపట్నం నుంచి అయియ్యం ప్రణతి (14), హైదరాబాద్ నుంచి కార్తికేయ (16), సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ (21), విశాఖపట్నం నుంచి సౌజన్య భాగవతుల (30), విజయవాడ నుంచి సాయి వైష్ణవి (27), హైదరాబాద్ నుంచి పైలా జయరాం (20), హైదరాబాద్ నుంచి మానస (21), బెంగళూరు నుంచి యూతి హర్షవర్ధన్ (18).... ఈ 12 మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే తమ అద్భుతమైన ప్రతిభతో ఇటు ప్రేక్షకులు, ఆటు జడ్జిల మెప్పును పొందారు. సీజన్ 1 కంటే సీజన్ 2 పెద్ద లెవల్లో అద్బుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.
తెలుగ ఇండియన్ ఐడల్ 2లో పాల్గొంటున్న ఈ 12 మంది పోటీదారులు వేర్వేరు నగరాలకు చెందిన వారు, వేర్వేరు వయసులకు చెందినవారు. ఈ పోటీని చూసే ఆడియెన్స్‌కు ఇదొక మరుపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ నుంచి పోటీ చాలా ఎక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు.. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన కంటెస్టెంట్స్ అసాధారణ ప్రతిభను చూపినవారే. ఇప్పటి వరకు జరిగిన రౌండ్స్ అన్నింటినీ దాటుకుని వారిక్కడకు చేరుకున్నారు. ఒక్కొక్క రౌండ్ వారికి ఒక్కొక్క చాలెంజ్‌ను ఇవ్వటమే కాకుండా మంచి అవకాశాలను క్రియేట్ చేసింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్, పాపులర్ గీతా మాధురి, వెర్సటైల్ సింగర్ కార్తీక జడ్జీల ప్యానెల్‌గా ఏర్పడి ఈ మ్యూజిక్ ట్రీట్‌లో భాగమయ్యారు. ప్రముఖ టాలెంటెడ్ సింగర్ హేమ చంద్ర ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన తనదైన టాలెంట్‌ను షోకు తన ఎనర్జీని జోడించి దాన్ని మరింత ఆకర్షణీయంగా, ప్రేక్షకులు మెచ్చేలా ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు.
మార్చి 17నుంచి ఫేవరేట్ కంటెస్టెంట్స్‌కి ప్రేక్షకులు కూడా ఓట్లు వేయవచ్చు. పోటీలో ఎవరు ఉండాలి, ఎవరు బయటకు వెళ్లిపోవాలి అనే విషయంలో న్యాయ నిర్ణేతలులాగానే ప్రేక్షకుల వేసే ఓటింగ్ కూడా కీలకంగా మారనుంది. తెలుగు సంగీత ప్రపంచంలో అసలైన ప్రతిభను కనుగొనటమే కాకుండా తదుపరి పెను సంచలనంగా మారడానికి తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఒక వేదికగా నిలుస్తుందని ప్రామిస్ చేసింది. వేదికపై కంటెస్టెంట్స్ తమ ప్రతిభతో పోటీ పడుతున్నప్పుడు ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యేలా అద్భుతమైన ప్రదర్శనను కోరుకుంటారు. అది ప్రేక్షకుల హృదయాలను కదిలించే అందమైన మెలోడీస్ కావచ్చు లేదా మరేదైన గొప్పదైన ప్రదర్శన కావచ్చు.. ఏదేమైనా మ్యాజిక ఆఫ్ మ్యూజిక్ అనే దానికి తెలుగు ఇండియన్ ఐడల్ 2 వేదిక సజీవ సాక్ష్యంకానుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ 2తో అద్భుతమైన ప్రతిభ, అభిరుచి, వినోదాలను మేళవించి సంగీతం కోలాహలాన్ని అందిస్తామని ఆహా హామీ ఇచ్చింది. కాబట్టి ఆహా వేదికలో ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ట్యూన్ అవ్వండి.