లక్ష మొక్కల లక్ష్యం దిశగా అనంతపురం!
- సిఎం ఆకాంక్షల మేరకు కార్యక్రమానికి రూపకల్పన చేసిన కలెక్టర్
- జిల్లా అభివృద్ధి విషయంలో వినూత్న ప్రణాళికలు: గంధం చంద్రుడు
అధికారులే కాదు ప్రజా ప్రతినిధులను సైతం భాగస్వాములను చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిని అమలు చేయాలంటూ క్రిందిస్దాయి సిబ్బందిని ఆదేశించి చేతులు దులుపు కోలేదు. తానే భాధ్యత తీసుకున్నారు తిలి బీజం నాటారు. పది మందిని మార్గదర్శిగా మారారు. స్పష్టమైన కార్యాచరణ, సుశిక్షుతులైన సిబ్బంది, ముందుండి నడిపించే దిక్సూచిగా జిల్లా కలెక్టర్, ఇక తిరుగేముంది అనంత సీమ పచ్చదనం పరుచుకునేందుకు మార్గం సుమగమమైంది. వాస్తవానికి అనంత జిల్లాలో పచ్చదనం కోసం పలువురు అధికారులు ఎంతో చేసారు, కొంత మేర విజయం సాధించారు, అయితే ఇప్పడు జరుగుతున్న ఉద్యమం పూర్తి స్ధాయి విజయం దిశగా అంటన్నారు జిల్లా ప్రధమ పౌరుడు గంధం చంద్రుడు.
నూతన సంవత్సరం 2020 జనవరి రెండు నాటికి జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలన్నది తమ ధ్యేయమన్న కలెక్టర్ ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, విద్యార్డులు, యువత, అంగన్ వాడీ కార్యకర్తలు, శ్రమ శక్తి సంఘాలు ... ఇలా అందరినీ భాగస్వాములు చేసామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు, ఆయన మాటలే స్పూర్తిగా కార్యక్రమం ప్రారంభించి మూడు వారాలు అవుతుందని, లక్ష్యానికి చేరువలో ఉన్నమన్న నమ్మకం కలిగిందని చంద్రుడు వివరించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన స్పందన కార్యక్రమంతో పాటే, ప్రతి సోమవారం మొక్కలు నాటటంపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అటవీ, విధ్య, డిఆర్ డిఎ, డ్వామా తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని వివరించారు. అనంతపురం జిల్లా తొలి కలెక్టర్ ధామస్ మున్రో మొదలు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ సీమను శస్యశ్యామలం చేసేందుకు కృషి చేసారని, వందో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తాను ఆ పాదముద్రలను కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నానని చంధ్రుడు పేర్కొన్నారు. సోమేష్ కుమార్ కలెక్టర్ గా ఉన్న కాలంలో ప్రారంభించిన చింతతో నిశ్చింత కార్యక్రమం మంచి విజయాన్ని సాధించగా, నేడు అర్ధిక పరమైన తోడ్సాటును సైతం అందించగలుగు తుందన్నారు.
దశల వారిగా విభిన్న కార్యక్రమాలను జిల్లాలో అమలు చేయాలన్న ఆలోచనలు, అతిత్వరలోనే ఆచరణ సాధ్యం కానున్నాయన్న గంధం చంద్రుడు, నేను సైతం అన్న కోణంలో ఆలోచించి ప్రతి ఒక్కరూ మొక్కల పెంపక మహోధ్యమంలో భాగస్వామలు కావాలని పిలుపు నిచ్చారు. ఏవరో ఏదో చేస్తారన్న ధోరణి విడనాడాలన్నారు.