కేర్‌గివర్స్ సమావేశం నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్ మిలాప్
విజయవాడ, మార్చి 2023 : భారతదేశంలో అతి పెద్ద, విశ్వసనీయ క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ మిలాప్ డాట్ ఓఆర్‌జీ (https://milaap.org/) నగరంలో కేర్ గివర్స్ సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం వైద్య అత్యవసరాలు కలిగిన వ్యక్తులు లేదంటే వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సంక్షోభ సమయంలో ఆర్థిక మద్దతును పొందేందుకు ఆధారపడతగిన వనరుగా క్రౌడ్ ఫండింగ్‌ను ఏ విధంగా వినియోగించవచ్చో అర్ధం చేసుకునే అవకాశం దీని ద్వారా కలిగింది. నోరి హాస్పిటల్స్‌కు చెందిన సుప్రసిద్ధ పిడియాట్రిషియన్ డాక్టర్ నోరి సూర్యనారాయణ ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్స్ గురించి మాట్లాడటంతో పాటుగా అవి ఏ విధంగా చికిత్స సమయంలో తోడ్పడతాయో వెల్లడించారు.
ఒకవేళ మీకు ఏదైనా వైద్య అత్యవసరం పడి, నిధుల కొరత ఎదుర్కొంటుంటే మీ ఫండ్ రైజర్‌ను https://milaap.org/వినియోగించి ప్రారంభించండి.