జంకు ఫుడ్ వదిలి ఆరోగ్యంగా ఉందాం. మన జాగ్రత్తలే మన ఆరోగ్యం- అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం- ఏప్రిల్ 7న

Related image

డా. ఆరతి బళ్లారి
కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్
కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్.
 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. 1948 నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రతి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. మెరుగైన జీవితం కోసం ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. దీంతో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది హెల్త్ ఫర్ ఆల్ థీమ్ తో ముందుకు వెళ్తున్నారు.


ఇక కోవిడ్ వచ్చిన వెళ్లిన తరువాత ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల కరోనా మహమ్మారి సమయంలో సాధారణ వ్యాధులు వ్యాప్తి చెందలేదనే చెప్పుకోవాలి. ఇంటి నుండి బయటకి వెళ్లి వచ్చిన తరువాత తప్పకుండా చేతులు, కాళ్లు కడకోవడం, మాస్కులు ధరించడం వంటివి చేశారు. అలాగే అనేక రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే దాదాపు రెండేళ్ల తరువాత మళ్లీ కోవిడ్ ప్రభావం చూపుతుందనే వార్తలు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరగడం, పైగా వేసవి కాలం కావడం అనేది కాస్త కలవర పెట్టే అంశమనే చెప్పుకోవాలి. గతంలో సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట వేయవచ్చు అనే చెప్పుకోవాలి. సాధారణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్ల మీద కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు.

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి

ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం మేలు.

2. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి

శరీరంలో నీటి కొరత రాకుండా ఉండటానికి, రోజుకు కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలి. ఎందుకంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఇలా చేయకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని మురికి చాలా వరకు తొలగిపోతుంది.
3. రోజులో సరైన నిద్ర

మీ రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీంతో రోజంతా రిఫ్రెష్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడికి దూరంగా ఉంటారు. ఇలా చేయడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

4. క్రమం తప్పకుండా వ్యాయామం

మీరు ఫిట్‌గా ఉండాలంటే బెల్లీ ఫ్యాట్ పెరగకూడదనుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, జిమ్‌కి కూడా వెళ్లొచ్చు.

5. మద్యం, సిగరెట్లు మానేయాలి

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మీరు దీనికి అలవాటు పడి ఉంటే, ఈరోజే దానిని మానేయండి. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.

More Press Releases