రూ.99/- కే ఆహా సబ్ స్క్రిప్షన్; తెలుగువారికి ఆహా ఇస్తున్న బంపర్ ఆఫర్
ఓటీటీ సేవల రంగంలో తనదైన మార్కుతో అత్యంత వేగంగా దూసుకుపోతున్న మన తెలుగు ఓటీటీ యాప్ ఆహా మరో సరికొత్త ప్యాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.99 కే మొబైల్ ప్లాన్ ను అందిస్తోంది. దీనిద్వారా ఆహాలో ప్రసారమయ్యే అన్ని వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు.
మొబైల్ వినియోగం రోజుకురోజుకు పెరుగుతున్న ఈ తరుణంలో వినోద ప్రేమికులకు అత్యంత నాణ్యమైన ప్రాంతీయ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ఆహా ఈ ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా 2 వేల గంటలకు పైగా నిడివి కలిగిన కంటెంట్ 350 గంటలకు పైగా ఒరిజినల్ కంటెంట్ కలిగి ఉంది. ఆహా ఇప్పటివరకు 32 మిలియన్ల యాప్ డౌన్లోడ్స్, కోటీ ఇరవై లక్షల మంది యాక్టివ్ యూజర్స్ తో అత్యంత వేగంగా దూసుకుపోతుంది.
ఈ రూ.99/- మొబైల్ ప్యాక్ ద్వారా యూజర్స్ తమ మొబైల్ ఫోన్స్ లో తెలుగు ఇండియన్ ఐడల్ 2, బాలయ్యబాబు అన్ స్టాపబుల్ 2, సరికొత్త న్యూసెన్స్ వెబ్ సిరీస్, ఇంటింటి రామాయణం, వినరో భాగ్యము విష్ణు కథ, దాస్ కా థమ్కీ వంటి మరెన్నో షోస్, సినిమాలు వీక్షించవచ్చు. అంతే కాక తెలుగులో డబ్ చేసిన కొరియన్ డ్రామా సిరీస్లు, గేమ్స్, డైలీ సిరీయల్స్ ఇంకా ఎన్నెన్నో వీనోద కార్యక్రమాలు చూస్తూ ఆనందివచ్చు.
దీనిపై ఆహా సబ్ స్క్రిప్షన్ మరియు బిజినెస్ స్ట్రాటజీ హెడ్ రాకేష్ స్పందిస్తూ “తెలుగు ప్రేక్షకులకు అత్యంత నాణ్యమైన, ప్రాంతీయ వినోదాన్ని అందుబాటు ధరైన రూ.99/- కే అందించాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఆహా మరింత మందికి చేరువకావాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి ఆఫర్లు అందిస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వినోదాన్ని అందించడంలో ఆహా ఎప్పుడూ ముందే ఉంటుంది.”
ఆహా ఓటీటీ యాప్ 2020 లో తన కార్యకలపాలను ప్రారంభించి అనతి కాలంలోనే తెలుగు వారి ప్రేమను చూరగొంది. ప్రస్తుతం తమిళ్ కూడా తన ప్రస్థానాన్ని అరంభించి మెల్లగా విదేశాల్లో కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతుంది. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు, తమిళ వారికి మాతృబాషలోని అద్భుతమైన వినోదాన్ని అందిస్తోంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూకే, ఆస్ట్రేలియా, అగ్నేసియా, మలేషియా, మయన్మార్, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న తమిళ, తెలుగు వారికి వినోద సేవలను అందిస్తోంది.
ఆహా గురించి..
వీడియో ఆన్ డిమాండ్ సేవలను అందిస్తున్న ఆహా ఒక ఇండియన్ లోకల్ లాంగ్వేజ్ ఓటీటీ. ఇది 100% లోకల్ కంటెంట్ ను వినియోగదారులకు అందిస్తోంది. 2020 లో ప్రారంభింపబడిన ఆహా ఓటీటీ పలు రకాల సినిమాలు, షోలు, వెబ్ సీరిస్లు ను తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్హా మీడియా బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ పేరిట మై హోమ్ గ్రూప్ మరియు అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్) కలిసి జాయింట్ వెంచర్ గా దీన్ని ప్రారంభించారు. ఇటీవలే ఇంటర్నెట్ & మొబైల్ అసోసియేషన్ ఇండియా డిజిటల్ అవార్డ్ 2023 నుంచి (IAMAI) “బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాప్” పొందింది. ఒక ప్రాంతీయ భాష ఓటీటీగా మార్కెట్ లో అగ్రగామిగా వెలుగొందుతుంది.