వరల్డ్ సిటిజన్ డెవలప్‌మెంట్ వీక్‌ను ప్రారంభించిన ఇండియా ఇంక్
ఇండియా, ఏప్రిల్ 2023 : వాస్తవ ప్రపంచపు సమస్యలకు తగు పరిష్కారాలను అందించడంలో ఆవిష్కరణ మరియు సృజనాత్మకత యొక్క ఆవశ్యకతను అంతర్జాతీయంగా వేడుక చేసేందుకు వరల్డ్ క్రియేటివిటీ ఇన్నోవేషన్ డే ను యునైటెడ్ నేషన్స్ రూపకల్పన చేసింది . యుఎన్ ఉద్దేశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సృజనాత్మకతను ఒడిసిపడుతూ, భారతీయ టెక్నాలజీ సంస్థ 17–21 ఏప్రిల్ 2023 వరకూ ఇన్నోవేషన్ డే పురస్కరించుకుని వరల్డ్ సిటిజన్ డెవలప్‌మెంట్ వీక్‌ను ప్రారంభించింది. అసలు కోడింగ్ తెలియకుండానే అనుకూలీకరించిన అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లు, ఇతర డిజిటల్ పరిష్కారాలను రూపొందించడంలో వ్యక్తులకు తగిన సాధికారితను అందించే నేపఽథ్యం సిటిజన్ డెవలప్‌మెంట్. వారం రోజుల పాటు జరిగే ఈ నాలెడ్జ్ ప్యానెల్స్ నో–కోడ్ లో–కోడ్ టూల్స్ పట్ల అవగాహన కల్పిస్తాయి. ఇది ఆలోచలను జీవితానికి వేగంగా తీసుకురావడంతో పాటుగా విస్తృతశ్రేణి డెవలప్‌మెంట్ బృందాలపై ఆధారపడాల్సిన ఆవశ్యకతనూ తప్పిస్తుంది.
భారతీయ నో–కోడ్ టెక్నాలజీ కంపెనీ క్విక్సీ , ఆలోచనలతో రూపుదిద్దుకున్న వరల్డ్ సిటిజన్ డెవలప్‌మెంట్ వీక్ అత్యంత వేగంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందింది. పలు సాంకేతిక కంపెనీలు నూతనంగా ప్రారంభించిన వార్షిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. సాంకేతికత మరియు ఆవిష్కరణ రంగంలో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ తో కూడిన బృందం నిర్వహించనున్న ఈ కార్యక్రమం వ్యక్తులు మరియు వ్యాపారాలను వారి అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకోవడానికి అవసరమైన జ్ఞానం మరియు సాధనాలతో సాధికారిత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో జాతీయ మరియు అంతర్జాతీయంగా డెలిగేట్లు హాజరుకావడంతో పాటుగా వైవిధ్యమైన ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, సమర్పణలు, నెట్‌వర్కింగ్ సెషన్‌ల నుంచి నేర్చుకోవచ్చు
మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురించి క్విక్సీ మార్కెటింగ్– ఇవాంగిలిజమ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వివేక్ గోయల్ మాట్లాడుతూ ‘‘సిటిజన్ డెవలప్‌మెంట్ వీక్‌ను కమ్యూనిటీ మరియు సహకార స్ఫూర్తిని పెంపొందించే రీతిలో రూపకల్పన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత విలువ కలిగిన అతిథులు పాల్గొనడంతో పాటుగా తమ విలువైన పరిజ్ఞానాన్ని సిటిజన్ డెవలప్‌మెంట్స్ , దాని ఆచరణాత్మకత, దీని ఏఐ (కృత్రిమ మేథస్సు) వినియోగ అంశాలు మరియు ఇతర ఆసక్తికర అంశాలను తెలుపుతుంది. విస్తృత శ్రేణి స్పీకర్లు మరియు టాపిక్స్‌తో ఈ కార్యక్రమం ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై సంప్రదాయ లుక్‌ను సమూలంగా మార్చనుంది’’ అని అన్నారు.
ఈ ప్యానెల్స్‌లో పాల్గొనబోయే కీలకమైన ఉపన్యాసకులలో క్విక్సీ మార్కెటింగ్– ఇవాంగిలిజమ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వివేక్ గోయల్ ; ట్రాక్‌వయా హెడ్ ఆఫ్ ఆపరేషనల్ ఎక్స్‌లెన్స్ శ్రీ మట్ హబ్బార్డ్ ; ఏగిల్‌పాయింట్ కో–ఫౌండర్, సీఈఓ శ్రీ జెస్సీ షియా ; సిరియస్ ఎక్స్‌ఎం ఆటోమేషన్ అండ్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీనియర్ డైరెక్టర్ శ్రీ జెస్సీ ఫు ; ఆమ్‌ట్రాక్ సిటిజన్ డెవలప్‌మెంట్ బిజినెస్ ఆర్కిటెక్ట్ శ్రీ మైఖేల్ మెక్‌క్యుల్లోగ్ ; షెల్ , ఐటీ బజినెస్ ఎనలిస్ట్ శ్రీమతి మే లిన్ లియో అమోరెల్లి తదితరులు ఉండనున్నారు.