ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’లో లాస్యప్రియ సంగీతలాలిత్యానికి మురిసిపోయిన మంత్రి హరీష్‌రావు

Related image

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21:  శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు. భారతీయ సంస్కృతిలో అంతలా మమేకమైపోయింది సంగీతం. యుగాలుగా మన సంప్రదాయంలో అంతర్లీనమైన కళ సంగీతం. అన్ని వయసుల వారికీ, అన్నీ వర్గాల వారికీ ఆనందాన్ని పంచుతుంది సంగీతం. పుట్టుకతో పరిచయమయ్యే సంగీతంలోని భావోద్వేగాలను, దానికి సంబంధించిన అత్యుత్తమ కథనాలను మనసులను గెలుచుకునే రీతిలో ప్రసారం చేస్తోంది ‘ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’. సంగీత ప్రియుల్లో అత్యద్భుతమైన ఆదరణ పొందిన కార్యక్రమం ఇది. సంగీత ప్రముఖులైన శ్రేయా ఘోషల్‌, విశాల్‌ దడ్లానీ, హిమేష్‌ రేష్మియా, జీవీ ప్రకాష్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మెప్పు పొందిన పాటల వేడుక.

 
వీరందరి లిస్టులోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు. ఇటీవల ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌2లో పార్టిసిపేట్‌ చేసే లాస్యప్రియ ప్రతిభ గురించి రాశారు. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2’లో అత్యంత ప్రతిభను చూడటం  చాలా ఆనందంగా అనిపించింది. లాస్యప్రియ గళం నా చెవుల్లో మారుమోగుతోంది. ఆమె భవిష్యత్‌ ప్రణాళికలన్నీ సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను'' అని ట్వీట్‌ చేశారు హరీష్‌ రావు.

 
ప్రజాదరణ పొందిన, ప్రజల మనసులకు దగ్గరైన తెలుగు పాటలను హృద్యంగా ఆలపిస్తూ సంగీతప్రియుల అభిమానాన్ని అందుకుంటున్నారు లాస్యప్రియ. ఇప్పుడున్న ఏడుగురు కంటెస్టంట్లలో ఆమె ఒకరు. ఆమె పెర్ఫార్మెన్సులు మెచ్చి న్యాయ నిర్ణేతలు ఎప్పటికప్పుడు అభినందనలు చెబుతూనే ఉన్నారు. శ్రోతల్లోనూ ఆమె గళానికి ముగ్దులవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

 అత్యంత ఆదరాభిమానాలతో విరాజిల్లుతున్న ఈ షో దినదినప్రవృద్ధిమానమవుతూ ఉంది. జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది. ఎంతో మంది బావుందని మెచ్చుకుంటూ ఉన్నారు.

More Press Releases