భారతదేశపు మొట్టమొదటి గేర్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌బైక్‌ ఎరా ప్రీ బుకింగ్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకున్న మ్యాటర్‌

Related image

      వినియోగదారులు  తమ మ్యాటర్‌ ఎరా మోటర్‌బైక్‌ను ఫ్లిప్‌కార్ట్‌పై మ్యాటర్‌ స్టోర్‌ (https://flipkart.com/matter-store (App Store) వద్ద ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు,  వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా  తమ ఈవీ ప్రయాణం ప్రారంభించవచ్చు

·       ఈ భాగస్వామ్యం వినియోగదారులకు ప్రత్యేక పరిచయ ధరలను అందించడంతో పాటుగా మ్యాటర్‌ ఎరా ముందస్తు బుకింగ్స్‌పై అదనపు ప్రయోజనాలు అందిస్తోంది.

ఏప్రిల్‌ 29, 2023 : టెక్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ మ్యాటర్‌, నేడు  భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్‌ మార్కెట్‌ ప్రాంగణం ఫ్లిప్‌కార్ట్‌తో  భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్‌ ఎరా మోటర్‌ బైక్‌ను ముందస్తు బుకింగ్‌ చేయడంతో పాటుగా మ్యాటర్‌ ఎరా  కొనుగోలు చేయడమూ చేయవచ్చు.  వారు ప్రత్యేక ఆఫర్ల ప్రయోజనాలను పొందే అవకాశం లభిస్తుంది. తద్వారా అత్యంత ఆకర్షణీయమైన అవకాశంగా ఇది విద్యుత్‌ వాహనాల దిశగా మారేందుకు తోడ్పడుతుంది.


వినియోగదారుల అనుభవం మ్యాటర్‌ యొక్క విలువలలో అత్యంత కీలకం మరియు ఇది వినియోగదారులకు స్ధిరమైన, ఇంటిగ్రేటెడ్‌ అనుభవాలను ఆన్‌లైన్‌, మొబైల్‌, భౌతిక డీలర్‌షిప్‌ సహా అన్ని మార్గాలలో అందించాలనే లక్ష్యంకు అనుగుణంగా ఉంటుంది. ఫ్ల్లిప్‌కార్ట్‌ యొక్క విస్తృతశ్రేణి చేరిక, వినియోగదారుల అభిప్రాయాలు మరియు ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్రాంగణ అనుభవం తో, మ్యాటర్‌ తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన కొనుగోలు అనుభవాలను గేర్డ్‌ మోటర్‌ బైక్‌ మ్యాటర్‌ ఎరా పరంగా అందిస్తాయి. ఫ్ల్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం, బ్రాండ్‌ యొక్క ఓమ్నీ ఛానెల్‌ అనుభవాలను అందించాలనే దిశగా మొదటి అడుగు. ప్రయాణ సమయంలో కూడా  బుకింగ్‌ అనుభవాలను  అత్యంత సరళంగా, వేగంగా ఇది అందిస్తుంది.


మ్యాటర్‌ గ్రూప్‌ సీఈఓ, ఫౌండర్‌ మోహల్‌ లాల్‌భాయ్‌ మాట్లాడుతూ ‘‘ అందరికి మరియు ప్రతి ప్రాంతానికీ విద్యుత్‌వాహనాలను చేరువ చేయాలనేది మ్యాటర్‌ లక్ష్యం. స్మార్ట్‌ఫోన్‌ , ఇంటర్నెట్‌, ఈ–కామర్స్‌ అందిస్తున్న అవకాశాలు లభిస్తోన్న యుగంలో, ఫ్ల్లిప్‌కార్ట్‌తో మా భాగస్వామ్యం తో విస్తృతశ్రేణిలో వినియోగదారులను చేరుకోవడంతో పాటుగా నూతన తరపు మొబిలిటీ మరియు సస్టెయినబల్‌ సాంకేతికతను స్వీకరించడంలోనూ తోడ్పడనున్నాము. ఇది 22వ శతాబ్దంలో మెరుగైన భవిష్యత్‌ను సృష్టించడం వీలవుతుంది’’ అని అన్నారు


భరత్‌కుమార్‌ బీఎస్‌, డైరెక్టర్‌–కేటగిరి హెడ్‌, ఎలకా్ట్రనిక్స్‌ డివైజస్‌ అండ్‌ ఆటోమొబైల్స్‌, ఫ్లిప్‌కార్ట్‌ మాట్లాడుతూ ‘‘దేశీయంగా అభివృద్ధి చెందిన మార్కెట్‌ప్రాంగణం, ఫ్ల్లిప్‌కార్ట్‌, ఆవిష్కరణలను చేయడంలో ముందుండటంతో పాటుగా మారుతున్న వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఉత్పత్తులను తీసుకువస్తుంటుంది. భారతదేశపు మొట్టమొదటి గేర్డ్‌ మోటర్‌సైకిల్‌ మ్యాటర్‌ ఎరా ఆవిష్కరణ ఆ దిశగా చేసిన ఓ ముందడుగు.  భారతదేశం వ్యాప్తంగా 25 జిల్లాలో 2వేలకు పైగా పిన్‌కోడ్స్‌ను కవర్‌ చేస్తున్నాము. వీటిని ముందస్తు బుకింగ్స్‌ చేయడంతో పాటుగా మ్యాటర్‌ ఎరా మోటర్‌సైకిల్‌ను ఫ్లిప్‌కార్ట్‌పై  కొనుగోలు చేయవచ్చు.   అదే సమయంలో విస్తృత శ్రేణి ఆఫర్లు, ప్రయోజనాలనూ పొందవచ్చు.  సస్టెయినబల్‌ ప్రాక్టీసెస్‌ను ఆచరించేందుకు కట్టుబడిన కంపెనీగా, మ్యాటర్‌తో భాగస్వామ్యం మరింతగా కొనసాగించడంతో పాటుగా మా ఈవీ ఫోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నాము మరియు మా పర్యావరణ అనుకూల ప్రక్రియలను ప్రోత్సహించనున్నాము’’ అని అన్నారు

More Press Releases