తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు
"ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు అందరికీ నమస్కారం!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి అనిర్వచనీయం. అమెరికాలో నివసిస్తున్న పిల్లలు మరియు పెద్దలకు తెలుగు భాష పై మక్కువ , పటిష్ఠత, అభిరుచి పెంచడంతో పాటు పిల్లలకు భావ ప్రకటన పెంపుదల కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు’ నిర్వహిస్తున్నాం. కథలు చెప్పడం మన ప్రాచీన సంస్కృతి, ఈ ‘కథా కేళి’ పోటీలకు నమూనా గా 100 చిట్టి నీతి కథలను అందరూ సులువుగా చదివి, పోటీకి ప్రిపేర్ అవ్వడానికి, మీకు ఓక .pdf పుస్తక రూపంలో పొందుపరచి ఇస్తాము. ఈ పోటీల్లో, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చును. ఈ పోటీలలో మీతో పాటు మీ పిల్లలను ప్రోత్సహించి భాగస్వాములు చేయవలసిందిగా కోరుచున్నాము.
దరఖాస్తు మరియు నియమ నిబంధనలు కోసం ఈ క్రింది లంకెను క్లిక్ చేయండి:
https://forms.gle/LCwLxCXjSRfubJ6S9
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది: మే 21, 2023.
జూన్ 24,25 తేదీల్లో జూమ్ లో పోటీల నిర్వహణ.