వినయపూర్వకమైన ప్రారంభం నుండి 70 సంవత్సరాల విజయం వరకు: మైల్‌స్టోన్ వార్షికోత్సవానికి చేరుకున్న ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్

Related image

హైదరాబాద్, 8 మే 2023: హైదరాబాద్ మరియు భారతదేశంలోని అనేక ఇతర నగరాల్లోని బిర్యానీ ప్రియులందరికీ ప్రామాణికమైన హైదరాబాదీ బిర్యానీని అందిస్తూ ఈ సెప్టెంబర్ 1కు ప్యారడైజ్ బిర్యానీ ఏడు అద్భుతమైన దశాబ్దాలను పూర్తి చేసుకొనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇష్టపడే ప్రసిద్ధ బిర్యానీ బ్రాండ్ గా మాత్రమే కాదు హైదరాబాదీ రుచులకు నిలయం గానూ  మారింది, ప్యారడైజ్ ...కేవలం రుచికరమైన ట్రీట్‌గా కాకుండా ఒక భావోద్వేగంగానూ మారింది. 70 ఏళ్ల వేడుకలో భాగంగా ప్యారడైజ్ ప్రత్యేకం గా 70 ఏళ్ల వేడుక ఆఫర్లను అందిస్తుంది. దీనిలో  భాగంగా రూ. 199/-కు రాయల్ చికెన్ బిర్యానీ మరియు రూ. 299/- కు నిజామీ చికెన్ బిర్యానీ అందిస్తుంది. ఇవి కాకుండా  కస్టమర్ అభ్యర్థనపై అదనపు బిర్యానీ రైస్ కూడా ఉచితంగా అందించబడుతుంది. ఈ వేడుక ఆఫర్‌లు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ప్యారడైజ్‌లోని అన్ని స్టోర్‌లలో డెబ్బైవ సంవత్సరాల వేడుకల్లో భాగంగా అందుబాటులో ఉన్నాయి.

గత కొన్ని నెలలుగా, బిర్యానీ ప్రియులకు కొత్త రుచులను అందించడానికి ప్యారడైజ్ తన మెనూలో అనేక కొత్త బిర్యానీలు మరియు కబాబ్‌లను జోడించింది.  మసాలా ప్రియుల కోసం ఫీయర్సీ బిర్యానీ, సౌత్ మసాలా ప్రియుల కోసం దక్షిణ్ బిర్యానీ మరియు కబాబ్‌లు మరియు ఇటీవలే ప్రారంభించిన పెరి పెరి బిర్యానీ & కబాబ్‌లు వంటివి బిర్యానీ ప్రియులకు కొత్త అనుభూతిని అందించాయి  కొత్త రుచులతో అసలైన దమ్ బిర్యానీ కలయికను వీటిని అందించారు. ఈ సంవత్సరం రంజాన్ సీజన్‌లో,  పండుగ సీజన్ మరియు దానితో వచ్చే వేడుకల కోసం చికెన్ హలీమ్ మరియు కుటుంబ హలీమ్ ప్యాక్‌ను కూడా జోడించారు.

డెబ్బై సంవత్సరాలుగా ప్యారడైజ్ కు నాణ్యత మరియు పరిశుభ్రత  ప్రధానమైనవి గా నిలిచాయి. ప్రస్తుత కాలంలో సేఫ్టీ ప్రోటోకాల్‌లు మరియు పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ఆహారాన్ని డిష్ చేసే వరకు సిద్ధం చేయడానికి తగినంత జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. ప్యారడైజ్ ఏడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న రుచి మరియు నాణ్యత పరంగా అతిథులుకు హామీ ఇస్తుంది.

‘ఒక సంవత్సరంలో అత్యధిక బిర్యానీలు వడ్డించినందుకు’ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఫుడ్ చైన్ తన స్థానాన్ని సంపాదించుకుంది. 2017లో ప్యారడైజ్ 70 లక్షలకు పైగా బిర్యానీలను అందించగా, 2018లో వాటి సంఖ్య 90 లక్షలకు పైగా చేరింది. 2018లో ఆసియా ఫుడ్ కాంగ్రెస్‌లో 'రెస్టారెంట్ సర్వింగ్ ది బెస్ట్ బిర్యానీ' అవార్డును మరియు 2018లో ఇండియా ఫుడ్ ఫోరమ్‌లో గోల్డెన్ స్పూన్ అవార్డును కూడా ప్యారడైజ్ గెలుచుకుంది.  తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, GHMC, టైమ్స్ ఫుడ్ అవార్డ్ ల నుండి అనేక ప్రశంసలు మరియు పురస్కారాలను ఇది గెలుచుకుంది. వీటిలో , ప్రైడ్ ఆఫ్ తెలంగాణ మరియు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వంటివి కొన్నిగా పేర్కొనవచ్చు.

More Press Releases