తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు
తానా-సిరివెన్నెల సాహితీపురస్కారం-2023
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులకు, రచయితలకు శుభవార్త! ప్రముఖకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సంస్మరణలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము.
•విజేతకు లక్ష రూపాయల నగదుపురస్కారం
• కావ్యాలు అందవలసిన చివరితేది: మే 31, 2023
• ఫలితాల ప్రకటన: జూన్ 30, 2023 లోపు
నియమ నిబంధనలు:
అంశం:
1. సమకాలీన సామాజికసమస్యలు-పరిష్కారాలు;
2. మానవసంబంధాలు-కుటుంబ విలువలు;
3. ప్రకృతి-పర్యావరణం;
4. యువతరం-భవిష్యత్తు;
5. దేశభక్తి-జాతీయవాదం
అంశాలలో ఏదైనా ఒక అంశం తీసుకుని పద్యకావ్యం లేదా గేయకావ్యంగాని 60 పేజీలకు (A4 సైజులో) మించకుండా ఉండేటట్లుగా రాసి పంపవలసినదిగా మనవి.
సరికొత్తగా వ్రాయబడిన కావ్యాలు మాత్రమే పోటీకి పరిగణింపబడతాయి.
ఇప్పటికే ముద్రించబడిన, సామాజిక మాధ్యమాలలో, వెబ్ పత్రికలల్లో ప్రచురితమైన రచనలు ఈ పోటీలకు అర్హం కావు.
కేవలం ఈ పోటీకోసం వ్రాసిన స్వీయరచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. ఆ మేరకు హామీపత్రం జతచేయడం తప్పనిసరి.
పంపే రచనలతోపాటు మీ ఛాయాచిత్రాన్ని, పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వాట్స్యాప్ నంబర్, ఇమెయిల్ ను జతపరచవలెను.
మీరు రాసిన కావ్యాన్ని స్కాన్ చేసి కానీ, తెలుగులో డి.టి.పి చేసి కానీ పంపించండి.
డి.టి.పి ప్రతిని ఇమెయిల్ రూపంలో [email protected] కు, వాట్స్యాప్ రూపంలో అయితే 1-972-591-1208 కు పంపవలెను.
మాకు అందిన కావ్యాలలో - బహుమతి పొందిన కావ్యాన్ని, మేము ఎంపికచేసిన కొన్ని కావ్యాలను ఇ- పుస్తకంగా ప్రచురిస్తాము.
మీరు పోటీలకు పంపిన కావ్యాలను తిరిగి మీకు పంపడం సాధ్యం కాదు. రచయితలు మూలప్రతిని తమవద్ద ఉంచుకోవడం మంచిది.
న్యాయనిర్ణేతల ఎంపికపై ఉత్తరప్రత్యుత్తరాలకు అవకాశంలేదు.
మిగిలిన వివరాలకు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు – డా. ప్రసాద్ తోటకూర ను 1-817- 300-4747 లో గాని, లేదా [email protected] ద్వారా గాని సంప్రదించవచ్చును.