1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 Below FIDE రేటింగ్ చెస్ టోర్నమెంట్
Ist Telangana Gurukulams ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ ఏప్రిల్ నెలలో(26 నుండి 30 వరకు) విజయవంతంగా నిర్వహించాము , 592 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తదుపరి టోర్నమెంట్‌గా ఇప్పుడు మేము 1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా Below 1600 rating Chess Tournament నిర్వహించబోతున్నాము TSWREIS & TTWREIS సెక్రటరీ రోనాల్డ్ రోజ్ గారి అధ్వర్యం లో ఈ టోర్నమెంట్ నిర్వహించటానికి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది *1వ తెలంగాణ గురుకులం ఆల్ ఇండియా 1600 Below FIDE రేటింగ్ చెస్ టోర్నమెంట్ - మొదటిసారిగా ఒక ప్రభుత్వ విద్యాసంస్థ , గుర్తింపు పొందిన చెస్ టోర్నమెంట్‌ని నిర్వహిస్తో న్నము. ఆల్ ఇండియా చెస్ అసోసియేషన్ మరియు తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు .
◆ జూన్ 2 నుండి 4 వరకు జరుగును
◆వేదిక:కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ,హైదరాబాద్
*గురుకులంలోని వర్ధమాన చెస్ క్రీడాకారులకు తగిన వేదికను అందించడానికి, వారి రేటింగ్ మెరుగుపరచుకోవడానికి మరియు ఉత్తమ రేటింగ్ పొందిన ఆటగాళ్లతో ఆడే అవకాశాన్ని కల్పించడానికి ఈ టోర్నమెంట్‌ని నిర్వహిస్తున్నారు.
*ఈ టోర్నీ 3 రోజుల పాటు జరగనుంది.
◆రోజూ 3 రౌండ్లు
◆ ఈ టోర్నమెంట్ 693 క్రీడాకారులు పాల్గొంటారు
◆ప్రైజ్ మనీగా మొత్తం 4,99,999 /- rupees నగదు
*113 నగదు పురస్కారాలు
*విజేతలకు 105 ట్రోఫీలు పంపిణీ చేయనున్నారు
*ఈ టోర్నీలో మొత్తం 693 మంది పైబడిన క్రీడాకారులు పాల్గొననున్నారు.