అంబేడ్కర్ స్మృతివనంలో జరుగుతున్న పనుల నాణ్యత పరిశీలించిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Related image

స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను గురువారం  ఉదయం  క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్. పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్  అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని ఆదేశించారు.   
                                   
అనంతరం గురువారం మధ్యానం పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లోని అంబెడ్కర్ స్మృతి వనము లో రాత్రి పూట జరిగే పని వివరాలను తెలుసుకుని వారికి కేటాయించిన పనులను ఉదయనికి పూర్తిచేయాలని కాంట్రాక్టలను ఆదేశించారు.

 తదుపరి కమిషనర్ శుక్రవారం ఉదయం క్షేత్ర స్థాయిలో అంబేడ్కర్ స్మృతి వనములో జరుగుతున్న పనులను పరిశీలించడానికి వస్తానని తెలియచేసారు

ఈ పని అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సకాలoలో పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లు ను ఆదేశించారు.
                                                                                                                                                                                           
అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్  గారు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు  కే.పి.సి. ప్రాజెక్ట్  కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 

More Press Releases