ఈచ్ వ‌న్‌ - టీచ్ వ‌న్‌లో పోలీసు శాఖ పాల్గొంటుంది: డీజీపీ మహేంద‌ర్‌రెడ్డి

Related image

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన ఈచ్‌వ‌న్‌ - టీచ్ వ‌న్ కార్య‌క్ర‌మంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుంద‌ని రాష్ట్ర పోలీసు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎం.మ‌హేంద‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించారు. డీజీపీ కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో భాగంగా కేక్‌ను క‌ట్‌ చేశారు. సీనియ‌ర్ పోలీసు అధికారులు, కార్యాల‌య సిబ్బంది హాజ‌రైన ఈ కేక్‌క‌ట్ కార్య‌క్ర‌మంలో డీజీపీ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డానికి ప్ర‌భుత్వం ప్రారంభించిన ఈచ్‌వ‌న్‌ - టీచ్‌వ‌న్ కార్య‌క్ర‌మంలో పోలీసు శాఖ చిత్త‌శుద్దితో పాల్గొని, ఒక్కొక్క పోలీసు యూనిట్ క‌నీసం త‌మ ప‌రిధిలోని 20మంది నిర‌క్ష‌రాస్యుల‌ను అక్ష‌రాస్యులుగా చేయాల‌నే ల‌క్ష్యాన్ని నిర్థారిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

త‌మ ర‌క్ష‌ణ‌కే పోలీసు శాఖ ఉంద‌నే న‌మ్మ‌కాన్ని పౌరుల‌లో క‌ల్పించాల‌ని, దీనిలో భాగంగా సామాజిక అవ్య‌వ‌స్థ‌ను అంతం చేసేందుకు కూడా పోలీసు శాఖ కృషి చేస్తుంద‌ని అన్నారు. మాన‌వ జ‌న్మ‌కు సార్థ‌క‌త చేకూరాలంటే త‌న చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాల‌ని పేర్కొన్నారు. పోలీసు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌తనిస్తున్నామ‌ని ఇందుకుగాను సిబ్బందికి ప్ర‌త్యేక మూర్తిమ‌త్వ అంశాల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణనిస్తామ‌ని తెలిపారు. 2020 సంవ‌త్స‌రాన్ని మ‌హిళా ర‌క్ష‌ణ‌ - రోడ్డు భ‌ద్ర‌త సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మ‌హిళ‌లు, పిల్ల‌ల ర‌క్ష‌ణ‌తో పాటు రోడ్డు భ‌ద్ర‌త‌కు ఈ సంవ‌త్స‌రం ప్రాధాన్య‌త‌గా చేప‌డ్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ డీజీపీలు, ఐ.జిలు, సీనియ‌ర్ పోలీసు అధికారుల‌తో పాటు డీజీపీ కార్యాల‌య సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases