25 శస్త్రచికిత్సలు విఫలమైన రోగికి కుడికాలు కాపాడిన అమోర్ ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్, జూన్ 7, 2023: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, 25 విఫల శస్త్రచికిత్సలు చేయించుకున్న ఓ యువకుడికి కుడికాలిని తాము కాపాడినట్లు నగరంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ, కేన్సర్ చికిత్స కేంద్రమైన అమోర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అమోర్ ఆస్పత్రికి రావడానికి ముందు ఆ యువకుడికి తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా కాలు తీసేస్తామని వేరే ఆస్పత్రిలో వైద్యులు చెప్పారు. కానీ, అమోర్ ఆస్పత్రిలో మాత్రం కాలిని కాపాడగలిగారు.
భద్రాచలానికి చెందిన 27 ఏళ్ల వయసున్న రాజేష్ 2019లో ఒక పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటినుంచి హైదరాబాద్‌లో అతడికి పలు శస్త్రచికిత్సలు జరిగాయి. అప్పట్నుంచి మూడు సంవత్సరాల పాటు 25 శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా అప్పటికీ బాధితుడికి కాలిలో విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. 25 విఫల శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు కాలు తీసేస్తామని చెప్పారు.
రోగి పరిస్థితి గురించి, అతడికి అందించిన చికిత్సల గురించి అమోర్ ఆస్పత్రికి చెందిన చీఫ్ ఆర్థో-ఆంకాలజీ సర్జన్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, “రోగికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాని తర్వాత గాయం మానడానికి అవసరమైన సరైన పద్దతులు పాటించకపోవడంతో అతడికి తీవ్రంగా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. ప్రమాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా రోగి భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా రోగి నష్టపోయాడు. అమోర్ ఆస్పత్రికి రాగానే మేం ముందుగా అతడి అనుమానాలు తీర్చడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి సాయం చేశాం” అన్నారు.
“మరో రౌండు శస్త్రచికిత్సలకు సిద్ధమైన తర్వాత, మేం కాలులోని ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా శుభ్రం చేశాం. తర్వాత వాక్యూమ్-అసిస్టెడ్ వూండ్ క్లోజర్ (విఎసి) థెరపీని అనుసరించాము. గాయం పూర్తిగా నయం అవడానికి మరో రెండుసార్లు అదే విధానాన్ని అమలుచేశాం. బాధితుడి కాలి పాదం కూడా తీవ్రంగా దెబ్బతినడంతో, దానికి కూడా అమోర్ ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స అందించాం. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత, బాధితుడు నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే కొన్ని నెలల్లో అతను స్వేచ్ఛగా నడవడానికి, సాధారణ జీవితాన్ని గడపడానికి పూర్తి ఫిట్ గా ఉంటాడు” అని డాక్టర్ కిశోర్ బి.రెడ్డి వివరించారు.
అమోర్ ఆస్పత్రి వైద్యుల బృందానికి బాధితుడు రాజేష్ కృతజ్ఞతలు తెలిపాడు. అతడు మాట్లాడుతూ, "మూడేళ్లకు పైగా నేను అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని చాలా బాధను అనుభవించాను. పైపెచ్చు, నాకు ఏమాత్రం నయం కాలేదు. ఈ పరిస్థితి కారణంగా నా కుటుంబం కూడా విపరీతమైన ఒత్తిడికి గురైంది. నా కాలిని కాపాడటమే కాకుండా, మానసిక క్షోభ నుంచి బయటపడటానికి నాకు సహాయపడిన డాక్టర్ కిషోర్ బి. రెడ్డి, ఆస్పత్రిలోని వైద్యబృందం మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే.. సరైన వైద్యుడిని, సరైన ఆస్పత్రిని సంప్రదించడం ఎంత ముఖ్యమో నేను ఇప్పుడు గ్రహించాను" అన్నాడు.
వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. అత్యంత సంక్లిష్టమైన సమస్యలను అధిగమించడంలో రోగులకు ఉపయోగపడేందుకు సరికొత్త చికిత్స పద్ధతులు, ప్రత్యేకమైన పరికరాలు కూడా వచ్చాయి. సంక్లిష్టమైన విధానాలకు సరైన వైద్య పరికరాలతో పాటు, సరైన నిపుణులు కూడా అవసరమని గమనించడం ముఖ్యం. అన్ని సంక్లిష్ట ఆర్థోపెడిక్ చికిత్సలకు అత్యుత్తమ కేంద్రం.. అమోర్ ఆస్పత్రి. ఇక్కడ అన్ని విభాగాల్లోనూ ఉత్తమ వైద్యులు ఉన్నారు.