ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా 'కర్ణ' మూవీ ట్రైలర్ విడుదల
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కంటెంట్ ఉండే చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుండే దిల్ రాజు.. ఈ ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు.
యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు.
మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ BJ సంగీతం సమకూరుస్తుండగా శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'గుడి యనక నా సామీ' పాటను విడుదల చేయగా ప్రేక్షకాదరణ పొందింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ కర్ణ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.
నటీనటులు: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
నిర్మాత: కళాధర్ కొక్కొండ
బ్యానర్: సనాతన క్రియేషన్స్
మ్యూజిక్: ప్రశాంత్ BJ
DOP: శ్రవణ్ G కుమార్కొరియోగ్రఫీ : కిరణ్ బండార్
ఆడియో: మధుర ఆడియో
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు