హైదరాబాదులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రీటెయిల్ వారి “ప్లానెట్ ఫ్యాషన్” ఒక కొత్త రీటెయిల్ గుర్తింపుతో ట్రెండీగా మారుతోంది
హైదరాబాదు, జూన్ 19, 2023: ఆధిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రీటెయిల్ (ఏబిఎఫ్ఆర్ఎల్) లో భాగమైన ప్లానెట్ ఫ్యాషన్, హైదరాబాదులోని సిటి సెంటర్ లో ఉన్న 2394 చ.అ. దుకాణములో తన కొత్త రీటెయిల్ గుర్తింపును విడుదల చేసింది. ఈ బ్రాండ్ కు భారతదేశ వ్యాప్తంగా 164 దుకాణాలు ఉన్నాయి మరియు సరసమైన ధరలలో ఆధునిక అంతర్జాతీయ ఫ్యాషన్ ఎంపికలను అందిస్తుంది.
ప్లానెట్ ఫ్యాషన్ వారి కొత్త రీటెయిల్ గుర్తింపు తమ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా, కొత్త-తరం వినియోగదారులను ఆకర్షించుటకు ఉత్పత్తి మరియు ప్యాకేజింగ్ ఆవిష్కరణలను జోడించింది. ఈ ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు ద్వారా ఈ బ్రాండ్ సులభంగా మరియు ప్రత్యేకమైనదిగా గుర్తించబడుతుంది.
హైదరాబాదులోని సిటి సెంటర్ లో ఉన్న ఈ ప్రధాన దుకాణం ఒక లీనమైయ్యే షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు బ్రాండ్ యొక్క ఇటీవలి రీటెయిల్ గుర్తింపుకు కొనసాగింపు. ఈ దుకాణములో కాజువల్స్, డెనిమ్స్ మరియు సీజనల్ దుస్తులు, ఫార్మల్ షర్ట్స్ మరియు ట్రౌజర్స్, లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెస్, అలెన్ సోలి, సైమన్ కార్టర్ వంటి బ్రాండ్స్ నుండి సూట్స్ మరియు బ్లేజర్స్ సహా విస్తృతమైన ఉత్పత్తి శ్రేణి ఉంది.
శ్రీమతి ఫరీద కలియాదన్, సిఓఓ, లూయిస్ ఫిలిప్ మరియు ప్లానెట్ ఫ్యాషన్, ఇలా అన్నారు, “హైదరాబాదు దుకాణములో ప్రారంభమైన మా కొత్త రీటెయిల్ గుర్తింపు అనుభవముతో మా వినియోగదారులను ఆనందపరచడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్లానెట్ ఫ్యాషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణములో, మేము వినియోగదారులకు ఉత్తమ పనితనము, విస్తృత ఉత్పత్తి శ్రేణి మరియు అసమానమైన రీటెయిల్ అనుభవములతో విలువను అందించుటపై దృష్టి సారిస్తున్నాము.”
ప్లానెట్ ఫ్యాషన్ యొక్క కొత్త రీటెయిల్ గుర్తింపుకు, తెలుపు, బూడిదరంగు మరియు రాగి రంగులతో ఒక కొత్త లోగో ఉంది, ఇది దుకాణానికి ఒక ఆధునాతనమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. విస్తృత శ్రేణి లైఫ్ స్టైల్ లుక్స్ ను ప్రదర్శించే విధంగా ఫిక్స్చర్స్ రూపొందించబడ్డాయి మరియు , బ్రాండ్ కథనాలను మరియు చిత్రాలను శ్రమలేకుండా తెలిపేందుకు నైరూప్య బొమ్మ ప్రదర్శించబడుతుంది.
ప్లానెట్ ఫ్యాషన్ కు భారతదేశములో 143 నగరాలలో 164 దుకాణాలు ఉన్నాయి మరియు ఒకేచోట లూయిస్ ఫిలిప్, వాన్ హ్యూసెన్, అలెన్ సోలి, సైమన్ కార్టర్, రీబాక్ & అమెరికన్ ఈగల్ వంటి ప్రముఖ బ్రాండ్స్ ను అందిస్తుంది.
కొత్త్ సేకరణ హైదరాబాదు దుకాణములో మరియు https://www.planetfashion.in/ వద్ద ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది.
ప్లానెట్ ఫ్యాషన్ రూ. 1999 నుండి ప్రారంభం అయ్యే అద్భుతమైన ధరలలో కలెక్షన్ ను అందిస్తుంది.
దుకాణము చిరునామా: ప్లానెట్ ఫ్యాష, దుకాణము #5, గ్రౌండ్ ఫ్లోర్, # 8–2-592, బంజారా హిల్స్, హైదరాబాదు - 500034