అరుదైన కేసుకు విజయవంతంగా చికిత్స చేసిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్
గుంటూరు, మే 26, 2023: ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG) మరియు యాంటీరియర్ మెడియాస్టినల్ థైమోమాతో బాధ పడుతున్న 45 ఏళ్ల రోగికి విజయవంతంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, గుంటూరు చికిత్స అందించింది. ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG) అనేది అత్యంత అరుదైన స్వయం ప్రతిరక్షక రుగ్మత (ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ) , ఇది కళ్ళు మరియు కనురెప్పలను కదిలించే కండరాలను ప్రభావితం చేస్తుంది. ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ (OMG) యొక్క లక్షణాలలో ద్వంద దృష్టి (ఒకటికి బదులుగా రెండు గా చిత్రాలను చూడటం), దృష్టి కేంద్రీకరించటం లో ఇబ్బంది మరియు కనురెప్పలు వాలిపోవడం వంటివి కనిపిస్తాయి. ఈ ప్రత్యేక కేసులో, బ్రెస్ట్ బోన్ వెనుక ఉన్న థైమస్ గ్రంధిలో ఉన్న ఒక కణితి, యాంటీరియర్ మెడియాస్టినల్ థైమోమా ఉండటం వల్ల రోగి యొక్క పరిస్థితి క్లిష్టంగా మారింది.
క్రాంతి తుమ్మ (పేరు మార్చబడింది) బైలాటరల్ PTOSIS (రెండు ఎగువ కనురెప్పలు పడిపోవడం) యొక్క సమస్య తో వచ్చారు. ఉదయంతో పోలిస్తే రోజు చివరి భాగంలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తదుపరి పరీక్షలు మరియు పరిశోధన తర్వాత, రోగి కుటుంబ సభ్యులతో సంప్రదించి VATS (వీడియో-సహాయక థొరాకోస్కోపిక్) థైమెక్టమీకి సిఫార్సు చేయబడింది.
డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిశెట్టి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ నేతృత్వంలో డాక్టర్ చందన వేమూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు డాక్టర్ సాయిబాబు, అనస్థీషియాలజీ బృందం ఆయనకు చికిత్స చేసింది. రైట్- సైడెడ్ VATS థైమెక్టమీ అని పిలువబడే ప్రక్రియ థొరాకోస్కోపికల్‌గా నమూనాను సేకరించటం కోసం చిన్న కోతతో నిర్వహించబడింది. సాంప్రదాయ స్టెర్నోటమీ వలె కాకుండా అతి తక్కువ ప్రమాదకర శస్త్రచికిత్సా విధానంలో చిన్న కోతలు చేయడం మరియు థైమస్ గ్రంధిని చూడటం చేయడానికి మరియు తొలగించడానికి కెమెరాతో సన్నని ట్యూబ్‌ని ఉపయోగించి థొరాకోస్కోప్‌ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధానం ఫలితంగా శస్త్రచికిత్స అనంతర నొప్పి తక్కువగా ఉంటుంది , తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండటం తో పాటుగా రోగి వేగంగా కోలుకున్నాడు.
ఈ ప్రక్రియను గురించి మరింతగా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిశెట్టి మాట్లాడుతూ, "ఈ కేసు ఏకకాలంలో ఆక్యులర్ మయస్తీనియా గ్రావిస్ మరియు యాంటీరియర్ మెడియాస్టినల్ థైమోమా కారణంగా ప్రత్యేకమైన సవాళ్లను అందించింది. థొరాకోస్కోపికల్‌గా రైట్ సైడెడ్ వాట్స్ థైమెక్టమీని నిర్వహించడం ద్వారా, థైమస్ గ్రంధి మరియు కణితిని ప్రభావవంతంగా తొలగించాము, అదే సమయంలో ఈ ప్రక్రియ తో ఇన్వాసివ్‌నెస్‌ను తగ్గించడం మరియు రోగిని త్వరగా కోలుకునేలా చేయడం జరిగింది" అని అన్నారు.
రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, “ఈ సంక్లిష్ట కేసు యొక్క విజయవంతమైన ఫలితం వినూత్నమైన మరియు వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో AOI యొక్క నిబద్ధతను ప్రధానంగా వెల్లడిస్తుంది . అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మరియు మల్టీడిసిప్లినరీ బృందం యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్న రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. AOI వద్ద మేము రోగి ఫలితాలను మెరుగుపరచడానికి అంకితభావంతో ఉన్నాము మరియు మా రోగులకు అత్యున్నత స్థాయి సంరక్షణను నిర్ధారించడానికి మేము కొత్త చికిత్సా పద్ధతులు మరియు ప్రక్రియలను అన్వేషించడం కొనసాగిస్తాము" అని అన్నారు
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (పెదకాకిని)లో పూర్తి స్థాయి సదుపాయాలతో గుంటూరులో క్యాన్సర్‌కు సంబంధించిన అగ్రగామి హాస్పిటల్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా, AOI తన సూపర్-స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను భారతదేశం మరియు దక్షిణాసియాలో ప్రామాణిక క్యాన్సర్ చికిత్స ప్రోటోకాల్‌లు మరియు USలోని ప్రముఖ ఆంకాలజీ కేంద్రాలలో అనుసరించిన మార్గాలతో విస్తరించింది. 1998లో స్థాపించబడిన, అత్యాధునిక ఆసుపత్రి గుంటూరు-విజయవాడ రోడ్‌లో NH 5కి ఆనుకుని ఉన్న కారణంగా గుంటూరు జిల్లా మరియు చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ రోగులకు సేవలందించేందుకు ప్రసిద్ధి చెందింది; గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ; మరియు పెదకాకాని గ్రామం నుండి సుమారు 1 కి.మీ. దూరంలో వున్న AOI గుంటూరు, అన్ని వయసుల వారికి రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ వంటి సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తుంది. అత్యంత సౌకర్యవంతమైన ఇంకా రోగి-కేంద్రీకృత వాతావరణంలో అత్యున్నత స్థాయి సంరక్షణ మరియు చికిత్స ఎంపికలను ఆసుపత్రి అందిస్తుంది, అవి అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంటాయి.