వెలుగు లోకి రాని హీరోలకు మద్దతు ఇవ్వడం ద్వారా MSME దినోత్సవాన్ని జరుపుకోవడానికి NI-MSMEతో భాగస్వామ్యం చేసుకున్న రికార్డెంట్

Related image

హైదరాబాద్, 27 జూన్ 2023: హైదరాబాద్‌ కేంద్రంగాకార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఫిన్-టెక్ సంస్థ రికార్డెంట్, MSME దినోత్సవాన్ని వేడుక చేయటం కోసం  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (NI-MSME)తో భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వెల్లడించింది . ఈ కార్యక్రమంలో భాగంగా, గుర్తించబడిన MSMEలలో వెలుగు లోకి రాని  హీరోలైన భద్రత మరియు సహాయక సిబ్బందికి, ముఖ్యంగా హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతాల్లోని తయారీ యూనిట్లకు - రికార్డెంట్ మరియు NI-MSME గొడుగులను పంపిణీ చేయనున్నాయి. 


ఈ MSMEల భద్రత మరియు సహాయక సిబ్బంది ఎక్కువగా నిరాడంబరమైన నేపథ్యాల నుండి వస్తారు మరియు వీరు  మంచి జీవనోపాధి అవకాశాలను కోరుకుంటారు. సుదీర్ఘ పని గంటలు మరియు అంతగా స్నేహపూర్వకంగా లేని ఉద్యోగ విధి విధానాలు కొన్నిసార్లు వారిని నిరుత్సాహపరుస్తాయి, వారి సహకారాలు విలువైనవని మరియు ఎక్కువ ప్రశంస నీయమని వారికి చూపించడం ముఖ్యం.


రికార్డెంట్ మరియు NI-MSME ల ఈ భాగస్వామ్యం  MSMEల యొక్క ఈ గుర్తింపు పొందని హీరోలను గుర్తించి, వారికి అవసరమైన మద్దతు అందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం  MSME రంగంలో సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భద్రత మరియు సహాయక సిబ్బంది యొక్క శ్రేయస్సు మరియు ప్రేరణకు దోహదపడుతుంది. వాతావరణ పరిస్థితుల నుండి అవసరమైన రక్షణను అందించడానికి మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ భావాన్ని పెంపొందించడానికి ఉచితంగా, అధిక-నాణ్యత మరియు మన్నికైన గొడుగులు వారికి అందించబడతాయి.


గొడుగుల పంపిణీతో పాటు, MSMEలు ఎదుర్కొంటున్న క్రెడిట్/లిక్విడిటీ ఫ్లో సవాళ్లను పరిష్కరించడానికి సంబంధిత వెబినార్లును నిర్వహించడానికి రికార్డెంట్ మరియు NI-MSME ప్లాన్ చేశాయి. ఈ వెబినార్లు క్రెడిట్ మేనేజ్‌మెంట్‌లో విలువైన పరిజ్ఞానం  మరియు నైపుణ్యాన్ని అందించడం ద్వారా రికార్డెంట్ పరిష్కారాలను ఎలా అందించగలదో మరియు వారి వ్యాపారాలకు విలువను ఎలా జోడించగలదో హైలైట్ చేస్తుంది.


MSME దినోత్సవాన్ని భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఏటా జూన్ 27న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు మద్దతును తెలియజేయడానికి ఈ రోజు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. ఇది MSME రంగం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం అభివృద్ధిలో దాని ముఖ్యమైన పాత్రను నొక్కి చెబుతుంది. 
 

More Press Releases