మెలోడీ, హిప్-హాప్ ప్రత్యేక సమ్మేళనంతో జస్లీన్ రాయల్, డినో జేమ్స్ పాడిన మొదటి ఒరిజినల్ ‘పెహ్లే జైసీ బాత్ నహీ’ పాట
- వివిధ వేదికల ద్వారా విడుదల చేయనున్న రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ నాలుగు ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్స్‌లో ఇది మొదటిది
- ఇది అద్భుతమైన సమ్మేళనం కోసం కాన్సెప్ట్ డెవలప్‌మెంట్, బ్రాండ్ సౌల్యూషన్‌లో తనకున్న అనుభవాన్ని అందిస్తున్న వయాకామ్18.
July, 2023: వయాకామ్18 సహకారంతో బాలీవుడ్ మెలోడీని హిప్- హాప్ గల్లితో సమ్మిళితం చేస్తూ పూర్తి సరికొత్త జోనర్‌కు శ్రీకారం చుడుతూ చేపట్టిన మొట్టమొదటి సంగీత ప్రయోగం రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్. సంగీతం అనేది అన్ని వయస్సుల వారిలో భావోద్వేగాలను రేకేత్తిస్తుంది. సీగ్రామ్ రాయల్ స్టాగ్‌కు ఇది కీలక పునాదిరాయిగా నిలిచింది. ఈ ఆధునిక యుగపు యువ ప్రేక్షకులు ఉత్తేజకరమైన కొత్త సంగీత స్వరూపాలను అన్వేషించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 'లివింగ్ ఇట్ లార్జ్' స్ఫూర్తిని అందిపుచ్చుకొని మణిపాల్, భువనేశ్వర్, పూణే, ఇండోర్ & డెహ్రాడూన్‌లోని వేలాది మంది సంగీత ప్రియులను తనదైన ప్రత్యేక అనుభూతి ద్వారా ఆకట్టుకున్న రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ 4 ఒరిజినల్ మ్యూజిక్ వీడియోలతో తదుపరి దశలోకి ప్రవేశించనుంది. విడుదల చేస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ మ్యూజిక్ ట్రాక్ సోల్ సింగింగ్ క్వీన్ జస్లీన్ రాయల్, స్పంకీ రాపర్ డినో జేమ్స్ మధ్య ప్రత్యేకమైన సహకారంతో రూపుదిద్దుకుంది.
బాలీవుడ్ వైబ్, హిప్-హాప్ బీట్స్ కలబోతతో రూపొందించి అద్భుతమైన బీట్స్ ప్రతిధ్వనించే కలయితో కూడిన సరికొత్త పాట 'పెహ్లే జైసీ బాత్ నహీ'. ఈ సంగీతం నేటి యువతను ఆకట్టుకుంటుంది. ఒక యువ జంట రిలేషన్‌షిప్ సమస్యలు, కోల్పోయిన ప్రేమ కోసం పరితపించడం, దాన్నుంచి వచ్చే వ్యామోహ భావనను తెలియజెప్పే పాట ఇది.
రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ వారి ప్రత్యేకమైన ఫిజిటల్ ఫార్మట్‌లో వివిధ వేదికలపై విడుదల కానున్న మెలోడి X హిప్-హాప్ నాలుగు ఒరిజినల్స్‌లో ఇది మొదటిది.
ఈ సందర్భంగా ర్యాపర్ డినో జేమ్స్ మాట్లాడుతూ, “రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ వారు రూపొందించిన ఈ వినూత్న సంగీత ప్రయోగంలో నేను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. సంగీతంపై నాకున్న విభిన్నమైన ఆలోచనకు ఈ సరికొత్త పాట ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ పాటలో మేము పండించిన ఆర్తితో కూడిన భావోద్వేగాలను జనం తమలో తాము చూసుకుంటారని ఆశిస్తున్నాను” అన్నారు.
గాయని జస్లీన్ రాయల్ మాట్లాడుతూ, “ఏదైన ప్రత్యేకమైనది సృష్టించాలనే ఆలోచన గాయనిగా నేను బాగా ఇష్టపడతాను. ఆ ప్రయోగానికి రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఒక చక్కని వేదిక. “పెహ్లే జైసీ బాత్ నహీ” లో ఉన్న ప్రేమ, అభిరుచి, శక్తిని ప్రేక్షకులు ఎలా అందుకుంటారనే దాని కోసం నేమ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
సీగ్రామ్ రాయల్ స్టాగ్ అభిరుచికి సంగీతం ఒక పునాదిరాయి. నేటి యువత సంగీతంలో కొత్త రూపాల అన్వేషణకు మొగ్గుచూపుతున్నారు. హిప్-హాప్ వంటి సమకాలీన జోనర్స్‌కు చక్కని ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ మెలోడీస్ యువత సాంస్కృతిక సమాహారంలో ఇప్పటికీ అంతర్భాగంగానే నిలుస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన బాలీవుడ్ సంగీతాన్నివారు మాట్లాడుకునే జోనర్ అంటే హిప్-హాప్‌తో సమ్మిళితం ఈతరం ఊహాలకు కొత్త రెక్కలు అందించాలన్నది రాయల్ స్టాగ్ ఉద్దేశం.ఇందులో భాగంగా వస్తున్న మొదటి పాట పెహ్లే జైసీ బాత్ నహీ – ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియా, ఇతర ప్రధాన ఆడియో వేదికల్లో అందుబాటులో ఉంది.