గ్రేడ్ IV CNS కణితి అయిన గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్‌తో బాధ పడుతున్న 9 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా చికిత్స చేసిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), గుంటూరు
గుంటూరు, 29 జూలై 2023 – గ్రేడ్ IV కేంద్ర నాడీ వ్యవస్థ కణితి అయిన గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ (GBM) ( హై గ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్ ) తో బాధపడుతున్న 9 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) , గుంటూరు చేరుకుంది. మెదడు క్యాన్సర్ యొక్క ఈ కణితి కారణంగా తలనొప్పి, వికారం, వాంతులు మరియు అవయవాల బలహీనత వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. దీనికి తక్షణ మరియు ప్రత్యేక శ్రద్ద తో పాటుగా సమర్థవంతమైన చికిత్స కూడా అవసరం పడుతుంది.
అడపాదడపా తలనొప్పి, ఉదయం పూట వాంతులు మరియు కుడి వైపు అవయవ బలహీనత కారణంగా ఆమె పాదాలను ఈడ్చటం వంటి సమస్యలతో ఆమె హాస్పిటల్ కు వచ్చింది. ఆమె మెదడుకు MRI చేసినప్పుడు కుడి వైపు హై ఫ్రంటో-ప్యారిటల్ (లలాట పార్శ్వక) ప్రాంతంలో 6.5x4.0cm పరిమాణంలో కణితిని AOI గుంటూరులోని వైద్య బృందం గుర్తించింది, ఈ కణితి కుడి పార్శ్వ జఠరికపై ఒత్తిడిని కలిగిస్తుంది.
తొలుత ఆమెకు బయటి ఆసుపత్రిలో రైట్ ఫ్రంటో-ప్యారిటల్ క్రానియోటమీ శస్త్రచికిత్స చేశారు. అక్కడ ఆమెకు GBM గ్రేడ్ IV నిర్ధారణ చేశారు. శస్త్రచికిత్స అనంతర MRI మెదడు స్కాన్ చేయగా కార్పస్ కాలోసమ్ తో కూడిన కణితిని రైట్ ఫ్రంటో-ప్యారిటల్ వద్ద 4.5x4.3cm పరిమాణం తో ఉన్నట్లు గుర్తించారు.
డాక్టర్ కె. సుధాకర్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మరియు డాక్టర్ సాయి బాబు, అనస్థీషియాలజిస్ట్, AOI గుంటూరు నిపుణుల ఆధ్వర్యంలో అధునాతన రేడియేషన్ థెరపీని ఉపయోగించి ఆమెకు చికిత్స అందించారు. అత్యాధునిక హల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్‌ను ఉపయోగించి ఆమెకు చికిత్స చేశారు, ఇది మస్తిష్కమూలం, కంటి నరం ( ఆప్టిక్ నర్వ్) మరియు కర్ణవృత్తము ( టెంపోరల్ లోబ్) వంటి పరిసర కీలక అవయవాలకు (OARs) అతి తక్కువగా రేడియేషన్ ఎక్స్పోజర్ కలిగించి , కణితికి రేడియేషన్ మోతాదును ఖచ్చితంగా అందించింది. ఈ విధానం న్యూరోకాగ్నిటివ్ మరియు డెవలప్‌మెంటల్ ఫంక్షన్‌లను సంరక్షించడానికి కీలకమైనది, ముఖ్యంగా పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యంత కీలకం" అని అన్నారు.
"గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్‌తో బాధ పడుతున్న ఈ 9 ఏళ్ల చిన్నారికి విజయవంతమైన చికిత్స అందించడం మా రోగులకు అత్యాధునికమైన మరియు కారుణ్య సంరక్షణను అందించడంలో AOI గుంటూరు యొక్క నిబద్ధతను ఉదహరిస్తుంది" అని డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. "అధునాతన హల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్ సహాయంతో, మేము కణితిని అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలిగాము, అదే సమయంలో క్లిష్టమైన మెదడు నిర్మాణాలకు సంభావ్య నష్టాన్ని తగ్గించడం మరియు రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాన్ని అందించడం చేయగలిగాము" అని అన్నారు.
రోగి రేడియేషన్ చికిత్సకు ఆ బాలిక చక్కగా స్పందించింది, ఆమె పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కూడా కనిపించింది. ఆమె కు చికిత్స చేసి ప్రస్తుతానికి మూడు సంవత్సరాలు అయింది. ఆమె ఆరోగ్యం పరంగా ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆమె తన విద్యా కార్యకలాపాలను చక్కగా నిర్వహించగలుగుతోంది.
డాక్టర్ కె. సుధాకర్ మాట్లాడుతూ "చికిత్స తర్వాత ఈ బాలిక పురోగతి మాకు అపారమైన ఆనందాన్ని కలిగించింది మరియు క్యాన్సర్ సంరక్షణను అభివృద్ధి చేయడంలో మరియు మా రోగులకు మరియు వారి కుటుంబాలకు ఆశను అందించడంలో మా అంకితభావాన్ని ఇది మరింతగా వెల్లడించింది" అని అన్నారు.
రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ మహేందర్ రెడ్డి మల్టీడిసిప్లినరీ టీమ్ కృషికి తన అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "AOI గుంటూరు వద్ద , మేము సేవలందిస్తున్న ప్రతి రోగికి సమగ్రమైన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ విజయవంతమైన చికిత్స క్యాన్సర్‌పై మా పోరాటంలో మేము ఉపయోగించే సహకార విధానానికి మరియు అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనం." అని అన్నారు.
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) , బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (పెదకాకిని)లో పూర్తి స్థాయి సదుపాయాలతో గుంటూరులో క్యాన్సర్‌కు సంబంధించిన అగ్రగామి హాస్పిటల్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా, AOI తన సూపర్-స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను భారతదేశం మరియు దక్షిణాసియాలో ప్రామాణిక క్యాన్సర్ చికిత్స ప్రోటోకాల్‌లు మరియు USలోని ప్రముఖ ఆంకాలజీ కేంద్రాలలో అనుసరించిన మార్గాలతో విస్తరించింది. 1998లో స్థాపించబడిన, అత్యాధునిక ఆసుపత్రి గుంటూరు-విజయవాడ రోడ్‌లో NH 5కి ఆనుకుని ఉన్న కారణంగా గుంటూరు జిల్లా మరియు చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ రోగులకు సేవలందించేందుకు ప్రసిద్ధి చెందింది; గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ; మరియు పెదకాకాని గ్రామం నుండి సుమారు 1 కి.మీ. దూరంలో వున్న AOI గుంటూరు, అన్ని వయసుల వారికి రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ వంటి సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తుంది. అత్యంత సౌకర్యవంతమైన ఇంకా రోగి-కేంద్రీకృత వాతావరణంలో అత్యున్నత స్థాయి సంరక్షణ మరియు చికిత్స ఎంపికలను ఆసుపత్రి అందిస్తుంది, అవి అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంటాయి.