‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ : దర్శకుడు రాజేష్ దొండపాటి
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఆగస్ట్ 4న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ దొండపాటి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
నేపథ్యం...
* మాది గుంటూరు జిల్లా. 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్నాను. ‘టెన్త్ క్లాస్’చందుగారితో కలిసి జర్నీ చేశాను. అలా పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో వర్క్ చేసుకుంటూ వచ్చాను. నేను డైరెక్టర్ కృష్ణ వంశీగారికి వీరాభిమానిని.
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ ఆలోచన...
* కరోనా సమయంలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. అప్పుడే నాకు ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ మూవీ ఐడియా వచ్చింది. అదే సమయంలో ఓ స్నేహితుడు ద్వారా నిర్మాత రఘురామ్‌గారు పరిచయం అయ్యారు. ఆయన అమెరికాలో ఉంటారు. ఆయనతో ఫోన్‌లో సినిమా గురించి చర్చ జరిగినప్పుడు నేను అనుకున్న పాయింట్ గురించి 15 నిమిషాలు పాటు చెప్పాను. వెంటనే ఆయనకు పాయింట్ నచ్చడంతో సినిమా చేయాలనుకున్నాం.
రొటీన్‌గా కాకుండా...
* ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో హీరో పేరు కృష్ణ. తన లైఫ్‌నే ఈ సినిమాలో చూపించాం. హీరో గురించి సినిమాలో చూపించాలని అనుకున్నప్పుడు తన చుట్టూ ఉన్న జనాలు ఎలా ఉంటారనే విషయాన్ని కూడా చూపించాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెటూర్లనే చూపిస్తారు. కానీ నేను రొటీన్‌గా కాకుండా విలేజ్ కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో చాలానే వెతికాను. చివరకు గుంటూరు సమీపంలో ఓ గ్రామం అయితే మా కథకు సరిపోతుందనిపించింది. ఇంతకు ముందు ఇక్కడ వందేమాతరం అనే సినిమా చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా చేశాం. దీంతో ఆ ఊరి ప్రజలు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు.
సినిమాలో హైలైట్స్...
* హీరో హీరోయిన్ సహా అందరి బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండాలని డిసైడ్ చేసుకుని ఆడిషన్స్ చేశాం. అందులోనే రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీలను హీరో హీరోయిన్లుగా తీసుకున్నాం. వారిద్దరూ వారి పాత్రల్లో చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ఉండే లవ్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి 20 నిమిషాలైతే ప్రేక్షకులు సినిమాలో అలా ఎంగేజ్ అయిపోతారు.
గట్స్ ఉన్న నిర్మాత...
* సినిమాను అనుకున్న బడ్జెట్‌లో సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేశాం. మా నిర్మాత రఘురామ్‌గారు గట్స్ ఉన్న వ్యక్తి. మా కథను నమ్మారు. మూవీ షూటింగ్ అయ్యే వరకు ఆయన ఇక్కడకు రానే లేదు. ఎంటైర్ ఔట్‌పుట్ చూసుకున్న ఆయన హ్యాపీగా ఫీలై ఇక్కడకు వచ్చి సినిమా రిలీజ్ కోసం వర్క్ చేస్తున్నారు. సినిమా బావుందని, అందుకనే ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నానని అన్నారు.
నిర్మాత సపోర్ట్‌తో...
* దర్శకుడిగా ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ నా తొలి సినిమా. మేకింగ్‌లో చిన్నా చితక ఇబ్బందులు తప్ప ఏమీ ఎదురు కాలేదు. ప్రొడ్యూసర్ రఘురామ్‌గారి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న దాని కంటే రెండు రోజుల ముందే పూర్తి చేశాం.
పాటలు గురించి...
* చాలా మంచి టీమ్ కుదిరింది. ముఖ్యంగా సాబు వర్గీస్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలిచింది. దానికి తగ్గట్లు వరికుప్పల యాదగిరిగారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. మూవీలోని పాటలు విన్నవాళ్లందరూ బావున్నాయని అప్రిషియేట్ చేస్తున్నారు.
నెక్ట్స్ మూవీ...
* నెక్ట్స్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతుంది. అంతా ఫైనలైజ్ అయ్యాక వివరాలను తెలియజేస్తాను. ... అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్ రాజేష్ దొండపాటి.