చంద్రయాన్-3, ఈ సంభాషణ నిర్దేశించని భూభాగాలను సైతం పరిశీలిస్తుంది. భారతదేశం యొక్క అంతరిక్ష అన్వేషణ దృష్టిని తెరుస్తుంది

Related image

ఆగస్ట్ 23న, ఇస్రో ఒకప్పుడు భయంకరమైన "20 నిమిషాల భీభత్సంగా" భావించిన దానిని "20 నిమిషాల ఆనందం"గా విజయవంతంగా మార్చింది మరియు దాని ఘనత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్  డైరెక్టర్ గౌరవనీయులైన డాక్టర్ వి. నారాయణన్‌కు చెందుతుంది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్వహించడంలో డాక్టర్ నారాయణన్ అత్యంత కీలక పాత్ర పోషించారు.



సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ల పరిధిలో ఆకర్షణీయమైన చర్చలను నిర్వహించేందుకు ఖుల్ కే తన అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తోంది. మోడరేటర్ పల్లవ బాగ్లా తన ఇటీవలి రౌండ్‌టేబుల్ చర్చలో డాక్టర్ నారాయణన్ తో స్వయంగా కూర్చునే అవకాశాన్ని పొందారు.



ఈ అద్భుతమైన విజయం వైపు నౌకను నడిపించడానికి ముందు, డాక్టర్ నారాయణన్ చంద్రయాన్-2 కోసం జాతీయ-స్థాయి వైఫల్య విశ్లేషణ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిష్టాత్మకమైన పదవిని నిర్వహించారు. మిషన్ యొక్క సవాళ్లను విడదీయడంలో అతని అచంచలమైన అంకితభావం దాని వైఫల్యాలకు మూల కారణాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది.



ల్యాండర్ మరియు రోవర్‌ల శాస్త్రీయ లక్ష్యాలపై డాక్టర్ నారాయణన్ మాట్లాడుతూ, “ఈ మిషన్‌కు మా వద్ద ఆరు సైంటిఫిక్ పేలోడ్‌లు ఉన్నాయి...మాంగనీస్, కాల్షియం, సల్ఫర్, టైటానియం, క్రోమియం, ఆక్సిజన్ మరియు ఎనిమిది ఖనిజాలు వంటి ముఖ్యమైన ఖనిజాలను కనుగొన్నాము. ల్యాండర్ మరియు రోవర్‌లలో చంద్ర భూకంప కార్యకలాపాల కోసం ప్రత్యేక పరికరం కూడా అమర్చబడి ఉంది, ఇది చంద్ర భూకంపాలను గుర్తించి అధ్యయనం చేస్తుంది. మరొక పేలోడ్ చంద్ర గ్రహ ఉపరితల థర్మో-ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ChaSTE), ఇక్కడ మనం ప్రాథమికంగా చంద్రుని ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత చరిత్రను అర్థం చేసుకోవాలనుకుంటున్నాము... RAMBHA మరియు లాంగ్‌ముయిర్ ప్రోబ్ అని పిలువబడే మరొక ప్రోబ్ చంద్రునిపై ప్లాస్మా కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి ప్రయోగాలను నిర్వహిస్తుంది… మరొకటి -చంద్రుని కక్ష్య ప్రవర్తనను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి చంద్రుడు మరియు భూమి మధ్య సమయ దూర కొలతలను వాస్తవిక సమయంలో లెక్కిస్తుంది.  కాబట్టి, మనం జరుపుకోవాల్సిన వేడుక, షార్ప్ ల్యాండింగ్‌ను సాధించడం పరంగా మాత్రమే కాదు, ఈ మిషన్ నుండి మనం సాధించే అన్ని శాస్త్రీయ పేలోడ్‌ల గురించి...” అని అన్నారు. 



ఇస్రో కూడా చంద్రయాన్-3తో తమ మిషన్ లక్ష్యాలను అధిగమించింది, దాని 14 రోజుల పరిశోధనల ముగింపులో, అది విజయవంతంగా హాప్ పరీక్షను నిర్వహించింది మరియు రెండుసార్లు చంద్రునిపై అత్యంత నైపుణ్యం గా  సాఫ్ట్-ల్యాండింగ్ చేసింది. రోవర్‌లు నమూనాలతో సహా  తిరిగి వచ్చే మిషన్‌ల తో పాటుగా  భవిష్యత్తులో మనుషులతో కూడిన మిషన్‌లను నిర్వహించడానికి ఇస్రో సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. 



ఖుల్ కే కోసం డాక్టర్ నారాయణన్  తన అనుభవాన్ని వివరిస్తూ, “మేము విజయవంతంగా ల్యాండ్ అయ్యాము మరియు రోవర్ బయటకు వచ్చింది మరియు దాదాపు 100 మీటర్లు ప్రయాణించింది.  అప్పుడు మేము హాప్ పరీక్షను నిర్వహించగలమా అని ఆలోచించడం ప్రారంభించాము. భవిష్యత్తులో మనం చంద్రునిపై అడుగుపెట్టినప్పుడు, మన లక్ష్యం కేవలం సాఫ్ట్ ల్యాండింగ్ మాత్రమే కాకుండా పరీక్ష కోసం నమూనాలతో భూమికి తిరిగి వెళ్లగలగడం కూడా. ఈ పనులన్నీ చేయడానికి, మేము ల్యాండర్‌ను ఎత్తాలని నిర్ణయించుకున్నాము ... వాస్తవానికి ఉదయం 4 గంటలకు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇస్రో చైర్మన్ స్వయంగా మాతో ఉన్నారు. మేము హాప్ కోసం రెండు ఇంజిన్‌ల ఆపరేషన్‌కు అధికారం ఇచ్చాము…తర్వాత చివరకు అది చంద్రుని ఉపరితలం నుండి 40 సెం.మీ ఎత్తుకు ఎత్తబడింది. ఈ డాటా ఇస్రోకే కాకుండా ప్రపంచానికే అత్యంత విలువైనది. ఇది అసలు మిషన్ పరిధికి మించిన అద్భుతమైన ప్రయోగం. మేము మిషన్ నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాము" అని అన్నారు. 


చంద్రయాన్-3 మిషన్‌లకు సమీపంలోనే,  ఆదిత్య ఎల్1 ప్రోబ్‌ను సూర్యునిపై అధ్యయనం చేయడానికి ఇస్రో ఎందుకు పంపాలని  నిర్ణయించుకుందనే అంశమై డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ, “ఇస్రోలో, మేము గత  7-8 సంవత్సరాలు గా సూర్యునికి ప్రోబ్‌ను పంపాలని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో, భారతదేశం కాకుండా కేవలం 3 దేశాలు మాత్రమే వెళ్లి సూర్యుని అధ్యయనం చేశాయి. చంద్రయాన్-3 లాగా, ఇది ఇస్రోలోని ప్రతి ఒక్కరికీ మానస పుత్రిక లాంటి ప్రాజెక్ట్. ఆదిత్య కోసం కూడా, మేము ఫంక్షనల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను నిర్ధారించాలి మరియు చంద్రయాన్‌ను చంద్రునిపైకి తీసుకెళ్లిన అదే ఇంజిన్‌ను ఆదిత్య సిస్టమ్‌లకు కూడా ఉపయోగించాము…ఈ మిషన్ కూడా మాకు విస్తృతమైన డాటాను సేకరించడంలో సహాయపడుతుంది మరియు మరోసారి అపారమైన విజయానికి అర్హమైనది. భారతీయులమైన మా అందరికీ ఇది గర్వకారణంగా నిలుస్తుయింది..." అని అన్నారు. 


ఖుల్ కే, ఇస్రో అధిగమించిన మరియు అవిశ్రాంత శాస్త్రీయ అన్వేషణలో ఎదుర్కొంటూనే ఉన్న భయంకరమైన సవాళ్లకు సంబంధించి ఒక  సమగ్ర సమాచారం అందించడం ద్వారా భారత అంతరిక్ష రంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంభాషణలను ప్రధానంగా వెల్లడించింది. సెప్టెంబరు 22వ తేదీన, చంద్రుని పై సూర్యోదయం సందర్భంగా, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ రెండూ (ఆశాజనకంగా) మేల్కొంటాయని భావిస్తున్నారు. మేము మరొక కొత్త ఉషస్సు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న వేళ, ఇస్రో యొక్క అద్భుతమైన ప్రయాణం కృషి మరియు సూక్ష్మ  అంశాల పై శ్రద్ధ చూపే శక్తికి నిదర్శనంగా మారిందనకుండా  ఉండలేము.

More Press Releases