ఉత్తేజకరమైన 2 సరికొత్త వాటర్ రైడ్లతో ఒక గొప్ప ఆనందం అందించడానికి సిద్ధమైన వండర్‌లా హైదరాబాద్

Related image

హైదరాబాద్, 20 సెప్టెంబర్ 2023: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చెయిన్‌గా ఉన్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ ఇప్పుడు వండర్‌లా హైదరాబాద్‌లో రెయిన్‌బో లూప్స్ మరియు డ్రాప్ లూప్ అనే రెండు థ్రిల్లింగ్ వాటర్ రైడ్లను ప్రారంభించింది. వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కె చిట్టిలపిల్లి మరియు పార్క్ హెడ్ శ్రీ మధు సూధన్.జి సమక్షంలో, ప్రముఖ తెలుగు సినీనటి శ్రీమతి లావణ్య త్రిపాఠీ చేతుల మీదుగా సెప్టెంబర్ 20వ తేదీన ఉదయం 11:30 గంటలకు ఈ రైడ్‌లను ప్రారంభించారు. టర్కీ నుండి దిగుమతి చేసిన ఉల్లాసం రేకెత్తించే ఈ రెండు వాటర్ అట్రాక్షన్లను పరిచయం చేయడం ద్వారా, సందర్శకుల అనుభవాన్ని సంవృద్ధం చేయడానికి కట్టుబడి ఉన్నామనే తమ అచంచల నిబద్ధతను వండర్‌లా మరోసారి ప్రదర్శించింది.

 
"రెయిన్‌బో లూప్స్" అనే పేరు వెనుక ఉన్న ఆకర్షణీయ కథనం ద్వారా, ఆ పేరు వెనుక ఉన్న చమత్కారమైన మూల కథను తెలుసుకోవచ్చు. ఈ వాటర్ వండర్‌కి తగిన పేరు సూచించాల్సిందిగా వండర్‌లా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఒక పోటీని తీసుకొచ్చింది. ఈ కాల్ టూ యాక్షన్‌కి గొప్ప ప్రతిస్పందన లభించింది. పోటీలో పాల్గొన్నవారు దాదాపుగా 357 విభిన్న పేర్లు సూచించారు. ఈ విస్తృతమైన ఆలోచనల నుండి రెండు విలక్షణమైన పేర్లను లోతైన మూల్యాంకనం కోసం ఎంచుకున్నారు. చివరకు, "రెయిన్‌బో లూప్స్"ని ఎంపిక చేశారు.

 
ఈ కార్యక్రమంలో భాగంగా, వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, హైదరాబాద్ పార్క్‌లో రెయిన్‌బో లూప్స్ మరియు డ్రాప్ లూప్ అనే రెండు కొత్త వాటర్ రైడ్లు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సందర్శకులకు వినోదం మరియు ఉత్సాహంతో పాటు ఒక మరపురాని అనుభూతిని అందించేలా ఈ రైడ్లను రూపొందించినట్లు ఆయన నొక్కి చెప్పారు. వినోదపు సరిహద్దులను విస్తరించడంతో పాటు ప్రతిఒక్కరూ సంపూర్ణంగా ఆనందించే ఒక పర్యావరణాన్ని సృష్టించడమనే వండర్‌లా నిబద్ధతను అరుణ్ కె. చిట్టిలపిల్లి ఈ సందర్భంగా ప్రముఖంగా పేర్కొన్నారు. "మా పార్క్‌లోకి సందర్శకులను స్వాగతించడంతో పాటు మా కొత్త రైడ్లను ఆస్వాదించే సమయంలో వారి ముఖాల్లో చిరునవ్వులు చూడడాన్ని మేము థ్రిల్లింగ్‌గా భావిస్తాము" అని ఆయన అన్నారు.

 
కార్యక్రమంలో భాగంగా, లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ, "రెయిన్‌బో లూప్స్" మరియు "డ్రాప్ లూప్"లను ఆవిష్కరించడాన్ని తాను సగర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. పార్క్ పట్ల ప్రజలు ప్రదర్శించే ఇష్టం మరియు కుటుంబాల్లో పార్క్‌కి ఉన్న ఆదరణ గురించి మరియు రెండు దశాబ్దాలుగా ప్రతిఒక్కరిలో పార్క్ సృష్టించిన శాశ్వత జ్ఞాపకాలను ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాటర్ గేమ్స్ ఔత్సాహికురాలిగా మరియు సాహసాల కోసం అన్వేషించే వ్యక్తిగా, తన దృష్టిలో ఈ కొత్త రైడ్లు వినోదానికి సిసలైన కేంద్రంగా ఉంటాయని ఆమె అన్నారు. “ఈ రైడ్లు అందించే ఉత్సాహం మరియు ఆహ్లాదంతో సందర్శకులు పరవశించిపోతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని ఆమె అన్నారు.


ఈ రైడ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 
డ్రాప్ లూప్

డ్రాప్ లూప్ అనేది ఉరకలెత్తించే ఉత్సాహం రేకెత్తించే ఒక రైడ్‌గా ఉంటుంది. ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లుగా, 45-అడుగుల ఎత్తు నుండి ఈ రైడ్ మొదలై, 200-అడుగుల పొడవైన ఒక అపారదర్శక ట్యూబ్‌ వ్యాప్తంగా సాగుతూ, 82-అడుగుల రనౌట్‌తో ముగుస్తుంది. శరీరం జారుతూ వెళ్లే ఈ రైడ్ అనేది మీరు ఒక ట్రాప్‌డోర్ మీద నిలబడడం ద్వారా మొదలవుతుంది. ఆ ట్రాప్‌డోర్ తెరచుకోగానే, గుండె గుబేలుమనిపించే లూప్‌లు మరియు వంపుల ద్వారా మీరు వేగంగా జారుకుంటూ వెళ్తారు. మీ ప్రయాణానికి వాటర్ ఫీచర్లు కూడా తోడు కావడంతో, మీరు ఉత్సాహపు అదనపు ఎత్తుని చవిచూస్తారు. మరపురాని సాహసం చేయడం ద్వారా, థ్రిల్‌ని అనుభవించాలనుకునేవారు ఈ రైడ్‌ని తప్పక ప్రయత్నించాలి.


రెయిన్‌బో లూప్స్

రెయిన్‌బో లూప్స్ అనేది వండర్‌లా హైదరాబాద్ పార్క్‌లోని ఒక అత్యద్భుతమైన సరికొత్త వాటర్ రైడ్. ఇది సందర్శకులను ఒక గొప్ప స్లయిడింగ్ మీద థ్రిల్లింగ్ ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది. ఈ ట్యూబ్ స్లయిడ్ అనేది నేల మీద నుండి 45 అడుగుల ఎత్తులో ప్రారంభమై, ఆతర్వాత, 112 అడుగుల పొడవైన ఒక ట్యూబ్‌ లోపల సాగుతుంది. ఈ ప్రయాణం వ్యాప్తంగా సూర్యకాంతి మీ మీద ప్రకాశించడం వల్ల మీరు ఒక ఇంద్రధనస్సులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి, ఈ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. ఆ తర్వాత, 105 అడుగుల పొడవుతో ఉండే ఆరు లైన్లలో ఒక దానిలో మీరు వేగంగా ముందుకు వెళ్తారు. ఇదొక ఉద్వేగభరిత పోటీలా ఉంటుంది. చివరగా, మీరు 100 అడుగుల నిటారుగా ఉండే ఒక స్లయిడర్‌లో జారుకుంటూ వెళ్తారు. ఈ అనుభవం గొప్ప ఉద్వేగభరితంగా ఉంటుంది. రెయిన్‌బో లూప్స్ అనేది సంపూర్ణమైన ఆనందం, ఉద్వేగం మరియు సాహసంతో నిండి ఉంటుంది. మీకు ఎప్పటికీ గుర్తుండే అనుభవాన్ని ఈ రైడ్‌ అందిస్తుంది.

More Press Releases