భారతదేశంలో అమితంగా ఇష్టపడే 150cc , పల్సర్ N150 ను సరికొత్త రూపంలో విడుదల చేసిన బజాజ్ ఆటో

Related image


•       13.5 Nm టార్క్‌తో 14.5 PS గరిష్ట శక్తి మరియు అత్యుత్తమ బ్రేకింగ్ మరియు ట్రాక్షన్ కోసం సింగిల్-ఛానల్ ABS వంటి ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి వుంది. 

•       వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ మరియు స్పోర్టి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్

•       ఈ బైక్ మూడు అద్భుతమైన రంగులు -  రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ & మెటాలిక్ పెరల్ వైట్ - లో లభిస్తుంది. 

•       Priced at ₹ 1,17,798 ex-showroom Andhra Pradesh



 సెప్టెంబర్ 2023:  ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్ర వాహన మరియు త్రీ-వీలర్ కంపెనీ గా ఖ్యాతి గడించిన బజాజ్ ఆటో, భారతదేశంలో  తమ పూర్తి సరికొత్త పల్సర్ N150ని విడుదల చేసింది. విస్తరిస్తున్న పల్సర్ పోర్ట్‌ఫోలియోకి సరైన జోడింపు గా పల్సర్ N150 నిలుస్తుంది. ఇది గత 18 నెలలుగా సంచలనాత్మక ఆవిష్కరణలను చూసింది, ఇందులో అతిపెద్ద పల్సర్ N250 మరియు అద్భుతమైన రీతిలో  విజయవంతమైన పల్సర్ N160 ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్పోర్ట్స్ బైక్ కుటుంబం , పల్సర్ N150తో  విలువైన నూతన ప్రవేశాన్ని చూసింది, ఇది పల్సర్మానియాక్స్ సైన్యాన్ని నిలుపుకుంటామంటూనే కొత్త వాటిని జోడిస్తామనే  వాగ్ధానం చేస్తుంది. 



ఈ  బైక్  డిజైన్ లాంగ్వేజ్ శక్తివంతమైన  మరియు ఉత్సాహపూరితమైన క్యారెక్టర్ లైన్స్,  టైటర్ ప్రొపోర్షన్స్  మరియు ఆధునిక ఏరో డైనమిజం కలిగి ఉంటుంది. వంపు తిరిగినట్లుగా వుండే ట్యాంక్ ఒక సొగసైన, స్టైలిష్ నడుము విభాగంతో విభిన్నంగా ఉంటుంది, ఇది కాంటూర్డ్ స్టెప్ సీటు వరకు విస్తరించి ఉంది, ఇది కంటికి ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. ఇది అధిక RPMల వద్ద గర్జించే స్పోర్టియర్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్‌తో అమర్చబడి ఉంటుంది. బెల్లీ పాన్, ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు ఫ్రంట్ ఫెండర్ వంటి ఫ్లోటింగ్ బాడీ ప్యానెల్‌లు గంభీరమైన ప్రొఫైల్‌ను పూర్తి చేస్తాయి.



బజాజ్ ఆటో  - మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే మాట్లాడుతూ, “ఇరవై సంవత్సరాల క్రితం, మేము మొదటి పల్సర్ 150 సిసి మోటర్‌సైకిల్‌ను విడుదల చేసాము, ఇది ఎంట్రీ లెవల్ స్పోర్ట్ బైకింగ్ సెగ్మెంట్‌  లో సంచలనాలను సృష్టించింది. అప్పటి నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న 150 సిసి గా నిలిచింది. ఈ N150తో, పల్సర్ తన అతిపెద్ద మరియు ధైర్యమైన అవతార్‌లో మళ్లీ రోడ్ పై తన ఆధిపత్యం ప్రదర్శించటానికి తిరిగివచ్చింది. దాని అగ్రెసివ్ శైలి , ఈ విభాగం లో అత్యుత్తమ ఫీచర్లు,  రోడ్ పై ఆకట్టుకునే  పనితీరు మరియు నమ్మశక్యంకాని ఆకర్షణీయమైన ధర వంటివి పల్సర్ కుటుంబానికి అద్భుతమైన విలువ జోడింపుగా మారింది. రైడింగ్ ఆనందాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం, ఈ కొత్త బైక్ ఆ మిషన్‌కు నిదర్శనం..." అని అన్నారు. 



 పనితీరు: నూతన బజాజ్ పల్సర్ N150 రెండు చక్రాలపై ఒక పవర్‌హౌస్ లాంటిది, ఇది ఆకట్టుకునే రీతిలో  14.5 PS గరిష్ట శక్తి మరియు 13.5 Nm టార్క్‌ను కలిగి ఉంది. దాని విస్తృత టార్క్ బ్యాండ్ దీన్ని నిజంగా మిగిలిన వాటికి భిన్నంగా నిలుపుతుంది, తక్కువ నుండి పైభాగానికి మొత్తం RPM పరిధిలో ఉపయోగించదగిన టార్క్‌ను ఇది అందిస్తుంది. ఈ మోటర్‌సైకిల్‌తో, రైడర్‌లు ఎలాంటి రైడింగ్ పరిస్థితిలోనైనా థ్రిల్లింగ్ పనితీరు మరియు సౌకర్యవంతమైన నియంత్రణను అనుభవించవచ్చు. రైడర్ భద్రత విషయానికి వస్తే, పల్సర్ N150 భారీ విజయాన్ని అందిస్తుంది. సింగిల్-ఛానల్ ABS అత్యుత్తమ బ్రేకింగ్ నియంత్రణ మరియు ట్రాక్షన్‌ను అందజేస్తుంది, రైడర్‌లు ఎలాంటి  రహదారిని అయినా సులభంగా నావిగేట్ చేయగలరని నిర్ధారిస్తుంది. శక్తి, ఖచ్చితత్వం మరియు భద్రత యొక్క సామరస్య సమ్మేళనం, పల్సర్ N150 రైడింగ్ అనుభవాలను కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్తుంది.



 ఫీచర్లు: ఆవిష్కరణ మరియు పనితీరును వేడుక చేస్తూ , కొత్త బజాజ్ పల్సర్ N150 శైలి మరియు కార్యాచరణ పరంగా నూతన బెంచ్‌మార్క్‌లను ఏర్పరుస్తుంది. మెరుగైన నియంత్రణ కోసం వెనుకవైపు కచ్చితమైన-ఇంజనీరింగ్ మోనో-షాక్ సస్పెన్షన్, స్పోర్టి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ దాని సౌందర్యానికి మరింత ఆకర్షణ జోడించడమే కాకుండా పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఈ విభాగం లో మొట్టమొదటి సారిగా   LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌  మీరు ప్రయాణిస్తున్న  మార్గాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది.   శ్రేష్ఠత  పట్ల  బజాజ్ యొక్క  నిబద్ధతకు నిజమైన నిదర్శనం పల్సర్ N150. దాని చురుకుదనానికి జోడిస్తూ, విశాలమైన 120 క్రాస్-సెక్షన్ వెనుక టైర్ నిష్కళంకమైన పట్టు మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది, రైడర్‌లకు ఎలాంటి రహదారినైనా  విజయం సాధించగల విశ్వాసాన్ని ఇస్తుంది.



శైలి :  'సర్జికల్ ప్రెసిషన్' మరియు చురుకైన కలర్ బ్రేక్స్ ను కలిగిన 'కాంట్రాస్టింగ్ ఫినిషెస్ ' థీమ్‌ల ద్వారా ప్రేరణ పొందిన గ్రాఫిక్ స్కీమ్‌తో ఖచ్చితత్త్వం తో పల్సర్ N150  రూపొందించబడింది. ఇది విజువల్ మాస్టర్ పీస్, ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవటమే  కాకుండా మోటార్‌సైకిల్ సౌందర్యశాస్త్రంలో కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది.

అద్భుతమైన ఫీచర్లు మరియు నూతన స్థాయి నవీకరణలతో , పల్సర్ N150 బ్రాండ్ వేగాన్ని మరింత పెంచుతుంది. బైక్ దాని స్టైల్ మరియు పనితీరు యొక్క బలంతో కొత్త మానియాక్స్ ను పల్సర్ ప్రపంచంలోకి తీసుకువస్తుందనే  వాగ్దానాన్ని కలిగి ఉంది, ఇది అభిరుచి మరియు ఖచ్చితత్వంతో రైడ్ చేయడం అంటే ఏమిటో పునర్నిర్వచించనుంది. 

     

More Press Releases