సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఏందిరా ఈ పంచాయితీ' అక్టోబర్ 6న విడుదల
ఓ మంచి గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథను చూసి చాలా కాలమే అవుతోంది. వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీని చూపించేందుకు 'ఏందిరా ఈ పంచాయితీ' అనే చిత్రం రాబోతోంది. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి.
రీసెంట్గా హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయింది. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా అర్థం అవుతోంది. ఎమోషనల్ డైలాగ్స్, విజువల్స్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కారక్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.
అక్టోబర్ 6న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక బృందం
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
డీఐ : పీవీబీ భూషణ్
పీఆర్వో : సాయి సతీష్