ప్యూర్ EV- 201 KM రేంజ్ లో.. ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
ప్యూర్ EV- 201 KM రేంజ్ లో.. ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివర్స్ మోడ్ కూడా కలిగిన స్కూటర్ గా దీని ప్రత్యేకతలెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ సంస్థ.
ప్యూర్ EV E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్‌కు కనెక్ట్ చేయటంతో.. ఎంతో స్పెషల్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాకుండా, మరెన్నో స్పెషల్ ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చిందీ కంపెనీ.
మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ .. మొత్తం నాలుగు రంగుల్లో లభ్యమవుతోన్న ప్యూర్ EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తోందీ సంస్థ. దీని ఎక్స్- షోరూమ్ ధర.. కేవలం రూ. 1, 14, 999 మాత్రమే. ఈ స్కూటర్ బుకింగ్.. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైంది. ప్లూటో వాహనాన్ని బుక్ చేసుకున్న వారికి ఈ పండుగ సీజన్ నుంచి డెలివరీ ఇవ్వనున్నారు.
రెట్రో-థీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా తీర్చిదిద్దిన ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 201 కిలోమీటర్ల నాన్ స్టాప్ గా పరుగులు దీస్తుంది. అంతే కాదు, ఈ EVలో ఎన్నో ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇది హిల్-స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ ను సైతం కలిగి ఉంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ AI వంటి సదుపాయాలుండటం మరో ప్రత్యేక ఆకర్షణ.
ఈ స్కూటర్ కి కనెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌కు 3.5 kWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్ ను అనుసంధించడం వల్ల.. ఇది 3.21 bhp మేర.. అత్యధిక శక్తినందిస్తుంది. ఈ AIS-156-సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్‌లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన స్మార్ట్ బ్యాటరీ దీని సామర్ధ్యాన్ని మరింత మెరుగు పరుస్తోందని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.
రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ని మరింత మెరుగుపరచడానికి, మొత్తం మూడు రైడింగ్ మోడ్లు కలిగి ఉన్నాయని అంటున్నారు. దీంతో పాటు, ఈ EV స్కూటర్ 60 వేల కిలోమీటర్ల వారంట్ తో వస్తోంది. దీంతో పాటు 70 వేల కిలోమీటర్ల వారంటీ కూడా అందుబాటులో ఉందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధులు.
సో, బైక్ లవర్స్..
గోటు రైడ్.. గెట్ ద ప్రైడ్..
ఓన్ ద మ్యాక్స్..
గెయిన్ ద మ్యాగ్జిమం ఎక్స్ పీరియన్స్..
అన్నది వీరి స్లోగన్ గా కనిపిస్తోంది.