భారతదేశంలో సరికొత్త డీబీ 12 కూపే ప్రారంభం
భారతదేశంలో డీబీ 12 విడుదలతో విలాసం పునర్నిర్వచనానికి సిద్ధమైన ఆస్టన్ మార్టిన్
హైదరాబాద్, భారతదేశం - ఆస్టన్ మార్టిన్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటీష్ అల్ట్రా-లగ్జరీ ఉన్నతమైన సామర్థ్యం గల స్పోర్ట్స్ కారు తయారీదారు, ఆస్టన్ మార్టిన్ డీబీ 12 విడుదలతో భారతదేశపు ఆటోమోటివ్ దృశ్యంలో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆస్టన్ మార్టిన్ డీబీ 12 ప్రారంభపు ధర, ప్రపంచపు మొదటి సూపర్ టూరర్ ధర కస్టమైజేషన్ ఆప్షన్స్ మినహాయించి రూ. 4.59 కోట్లు. సాటిలేని ఉత్తమతతో ఉత్తేజభరితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిపిన ఆధునిక టెక్నాలజీ మరియు లీనమయ్యే లగ్జరీ, డీబీ 12 ప్రపంచపు మొదటి సూపర్ టూరర్ గా కొత్త నిర్వచనాన్ని కోరుతోంది.
గ్రెగరీ ఆడమ్స్, రీజనల్ ప్రెసిడెంట్-ఆసియా, ఆస్టన్ మార్టిన్, ఇలా అన్నారు భారతదేశంలో డీబీ 12ను విడుదల చేయడం, “తమ 110వ వార్షికోత్సవానికి చిహ్నం అని, 2023లో ఆస్టన్ మార్టిన్ డీబీ 12, మార్పును కలిగించే నిజమైన మోడల్ రాకతో ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. 110 సంవత్సరాలుగా, ఆస్టన్ మార్టిన్ దిగ్గజపు రెక్కలు అల్ట్రా-లగ్జరీ, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా ఇష్టపడే ఉన్నతమైన పనితీరు స్పోర్ట్స్ కార్ నవ్యత, పనితనాలకు చిహ్నంగా నిలిచాయి.
“ఆస్టన్ మార్టిన్ దిగ్గజపు 110 సంవత్సరాలలో 95 నాటి భారతదేశపు ఆస్టన్ మార్టిన్ చరిత్ర ఎంతో సుదీర్ఘమైనది. 1928లో మొదటి ఆస్టన్ మార్టిన్-ఆస్టన్ మార్టిన్ ఎస్-టైప్ స్పోర్ట్స్ భారతదేశంలోకి దిగుమతి చేయబడింది. భారతదేశంలో ఆ మొదటి ఆస్టన్ మార్టిన్ యొక్క రాక మా క్లైంట్స్ ఆస్టన్ మార్టిన్ శ్రేణి - మా అల్ట్రా - లగ్జరీ SUVలు, డీబీఎక్స్ & డీబీఎక్స్ 707 నుండి వాంటేజ్ స్పోర్ట్స్ కార్స్ వరకు, ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి సూపర్ టూరర్ డీబీ 12ను ఆనందిస్తున్నారు.
“ప్రపంచంలో మొదటి సూపర్ టూరర్ ను మీడియా, కస్టమర్స్ మరియు భారతదేశంలో కాబోయే కస్టమర్స్ కు రాబోయే వారాల్లో, న్యూఢిల్లీలో ఆరంభించి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు ముంబయిలలో కొనసాగించడానికి మేము డీబీ 12 కూపేను సమర్పించి, విడుదల చేయడానికి గర్విస్తున్నాము.”
భారతదేశపు రహదారుల పై పరుగులు తీయనున్న ప్రపంచపు మొదటి సూపర్ టూరర్
కస్టమర్స్ మరియు డీలర్స్ లో ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్న, ఆస్టన్ మార్టిన్ భారతదేశపు మార్కెట్ లో డీబీ 12ను పరిచయం చేయడానికి గర్విస్తోంది.
ఆస్టన్ మార్టిన్ వారి ఉన్నతమైన అంచనా వేయబడిన మొదటి ఆధునిక స్పోర్ట్స్ కార్, డీబీ 12 ఆస్టన్ మార్టిన్ డీబీ క్రమంలో 75 సంవత్సరాల అత్యున్నత స్థాయికి చెందినది. సంవత్సరాల తరబడి ఉత్పత్తి అభివృద్ధిలో, ఈ మోడల్ ఆస్టన్ మార్టిన్‌ను ఆధునిక అల్ట్రా-లగ్జరీ, అధిక పనితీరు బ్రాండ్‌గా స్థిరంగా ఉంచింది, ఇది సరికొత్త సాంకేతికత, విలాసవంతమైన నైపుణ్యం మరియు అత్యంత ఉత్కంఠభరితమైన డ్రైవింగ్ అనుభవంతో కలిపి శాశ్వతమైన డిజైన్‌ను కలిగి ఉంది.
ప్రపంచంలోనే మొదటి సూపర్ టూరర్ గా గుర్తించబడిన, డీబీ 12 ప్రస్తుతమున్న జీటీ ఆటోమోటివ్ విభాగాన్ని అధిగమించి, ఒక కొత్త వర్గాన్ని సృష్టిస్తుంది. శ్రేణిలో ప్రముఖమైన పనితీరు అత్యంత వేగవంతమైన 202mph, 3.5 సెకండ్స్ యొక్క 0-60mph సమయం మరియు ఆస్టన్ మార్టిన్ ఇంజనీర్స్ నైపుణ్యంగా తీర్చిదిద్దిన 4.0 ట్విన్-టర్బో V8 ఇంజన్ మినహాయింపు సహా పునః నిర్వచనానికి మద్దతునిస్తోంది.
ఆధునిక సాంకేతికత, నవీన డిజైన్, సాటిలేని లగ్జరీ కలయికతో, డీబీ 12 కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దిగ్గజాలు హాజరైన ప్రీమియర్ సందర్భంగా అంతర్జాతీయంగా మొదటిసారి ప్రవేశించిన నాటి నుండి కస్టమర్‌లు, కాబోయే కస్టమర్స్ మరియు డీలర్స్ లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.
భవిష్యత్తు ఆవిష్కరించబడింది: డీబీ 12
డీబీ 12 కొత్త దిశలో పయనించింది. మెరుగైన పనితీరు, నిర్వహణ మరియు డైనమిక్స్, స్పష్టమైన డిజైన్ మరియు ఉత్తమమైన ఇంటీరియర్స్ మరియు టెక్నాలజీతో డీబీ 12 ఆస్టన్ మార్టిన్ యొక్క గౌరవప్రదమైన చరిత్రలో అత్యంత సంపూర్ణమైన మరియు విజయవంతమైన డీబీ మోడల్.
సాటిలేని పనితీరు మరియు అత్యంత శ్రమించే వారిని సంతృప్తిపరిచి, బహుమతి ఇవ్వడానికి నిర్వహణతో గౌరవించబడింది. సూక్ష్మంగా తీర్చిదిద్దబడిన దీని ఛాసిస్ శ్రేణిలో ప్రముఖ 680PS/800NM V8 ట్విన్ – టర్బో పవర్ ట్రైన్ కు పరిపూర్ణంగా జోడించబడింది. 8 - స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా పవర్ అందించబడింది మరియు ఆస్టన్ మార్టిన్ డీబీ మోడల్ మొదటిసారి, ఎలక్ట్రానిక్ రియర్ డిఫరెన్షియల్ లో అందించబడుతుంది. ఫలితంగా శక్తివంతం చేయబడిన ఆస్టన్ మార్టిన్ అనేది ప్రామాణికత, సామర్థ్యం మరియు ఎవ్వరికీ లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలనే అభిరుచిని కలిగి ఉంది.
డీబీ 12 స్టైలింగ్ లో, సరికొత్త ఫ్రంట్-ఎండ్ ట్రీట్మెంట్, విశాలమైన రూపం మరియు మరింత దృఢమైన ఉపరితలాలతో ప్రగతి కూడా కనిపించింది. దీని యొక్క పూర్తిగా పునః రూపకల్పన చేయబడిన ఇంటీరియర్ స్థలం యొక్క భావానికి ప్రాధాన్యతనిచ్చే స్పష్టమైన లైన్స్ ను కలిగి ఉంది మరియు ఆస్టన్ మార్టిన్ యొక్క గొప్ప , ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టం యొక్క మొదటిసారి వాడకానికి సమకాలీన నేపధ్యాన్ని అందిస్తుంది-ఇది సంస్థ లోపలే తయారు చేయబడింది.
ఆస్టన్ మార్టిన్ : భారతదేశంలో లగ్జరీకి మార్గదర్శకత్వం
భారతదేశంలోని లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమలో ఆస్టన్ మార్టిన్ ఉనికి డీబీఎక్స్ & డీబీఎక్స్ 707 యొక్క విజయవంతమైన విడుదలతో గుర్తించదగిన అభివృద్ధి మార్గంలో ఉంది. డీబీ 12ను ప్రవేశపెట్టడం వలన అల్ట్రా-లగ్జరీ విభాగంలో మార్గదర్శకునిగా భారతదేశంలో బ్రాండ్ యొక్క స్థానం మరింత శక్తివంతమైంది. భారతదేశంలో అల్ట్రా-లగ్జరీ ఆటోమొబైల్ రంగంలో ఆస్టన్ మార్టిన్ విప్లవాత్మకమైన ప్రధమ స్థానాన్ని ఆక్రమించడం వలన, డీబీ 12 పెను మార్పును కలిగించేదిగా, డిజైన్, పనితీరు మరియు ప్రత్యేకతలో కొత్త ప్రామాణాలను నెలకొల్పింది.
డీబీ 12తో ఆస్టన్ మార్టిన్ రాక భారతదేశపు ఆటోమోటివ్ దృశ్యంలో ల్యాండ్ మార్క్ గా నిలిచింది. అతి ఉత్తమమైన లగ్జరీ మరియు పనితీరుతో అర్హత గల భారతదేశపు వినియోగదారులకు కేటాయించడానికి బ్రాండ్ యొక్క నిరంతర నిబద్ధతకు ఇది రుజువుగా నిలిచింది.