తమ ఫ్లాగ్ షిప్ Portable SSD T9ని విడుదల చేసిన Samsung; సాటిలేని పనితీరు మరియు డేటా నమ్మకంతో ప్రొఫెషనల్స్ ను శక్తివంతం చేయడం

Related image

USB 3.2 Gen 2x2 ఇంటర్‌ఫేస్‌ను కలిగి, 2,000 MB/s read/write speeds   వరకు పెరిగిన ఉత్పాదకతను అందిస్తోంది
ఆధునిక  స్టోరేజ్ యూనిట్ రెండు రెట్ల వేగవంతమైన వేగాన్ని కలిగి ఉంది, దీని వలన వినియోగదారులు రెండు సెకండ్లలో  4GB వీడియోను  సుమారు రెండు సెకండ్లలో బదిలీ చేయవచ్చు
గరిష్టంగా 4TB వరకు ఉన్న సామర్థ్యం ప్రో-గ్రేడ్ కంటెంట్ కోసం  కావలసినంత స్టోరేజ్  ఇస్తుంది
 
గురుగ్రామ్, భారతదేశం-అక్టోబర్ 09, 2023- భారతదేసపు అతి పెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Samsung తమ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైజ్, పోర్టబుల్ సాలిడ్-స్టేట్ డ్రైవ్ (ఎస్ ఎస్ డీ) టీ9ను ఈ రోజు పరిచయం చేసింది. ఇది స్టోరేజ్ ఆప్షన్స్ 4TB  వరకు అందిస్తుంది, వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్ వేగాన్ని మరియు కావలసినంత స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది, యూజర్స్ కు కావలసిన నమ్మకం మరియు సౌకర్యాన్ని నిర్థారిస్తుంది.

 
T9 నాజూకైన డిజైన్ తో పాటు, మెరుపు వేగంతో USB 3.2 Gen 2x2 ఇంటర్ ఫేస్ ను   కలిగి ఉంది. 2,000 MB/s రీడ్/రైట్ వేగాల వరకు పెరిగిన ఉత్పాదకతను అందిస్తుంది. ఇది T9ని కంటెంట్ తయారీదారుల కోసం విచారరహితమైన ఎంపికను చేసింది, సృజనాత్మకత కోసం సమయం కేటాయిస్తుంది.
 

 “హై-రిజల్యూషన్ కంటెంట్ పరిస్థితిలో, T9  అనేది డేటా నిర్వహణ, పెద్ద ఫైల్స్ బదిలీ చేయడం, మన్నిక మరియు పనితీరు సమస్యలు వంటి సవాళ్లు కోసం పరిష్కారాలు కోరుకునే ప్రొఫెషన్స్ కోసం  ఒక జవాబు. శామ్ సంగ్ పోర్టబుల్ SSD T9 ఆడేటా సవాళ్లను పరిష్కరించడం ద్వారా మరియు తమ సృజనాత్మక అభిలాషలను పెంపొందించే మెమోరీ పరిష్కారాలు కేటాయించడం ద్వారా ఆధునిక కంటెంట్ సృష్టికర్తలను శక్తివంతం చేస్తుందని,” పునీత్ సేథీ, వైస్ ప్రెసిడెంట్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ ప్రైజ్ బిజినెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు. 

 
గొప్ప పనితీరు మరియు భారీ స్టోరేజ్ సామర్థ్యం

గరిష్ట వరుస క్రమం రీడ్/రైట్ స్పీడ్స్ తో USB 3.2 Gen 2x2 ఇంటర్ ఫేస్ పై 2,000 MB/s కు చేరుకుంటున్న, T9 ఇంతకు ముందున్న T7 ని దాదాపు రెట్టింపు వేగంతో నిర్మూలించింది. అనగా మీరు  4GB  ఫుల్ HD  వీడియోని  సుమారు రెండు సెకండ్లలో  పంపించవచ్చు.

 
మూడు వేర్వేరు సామర్థ్యాలలో - 1TB, 2TB మరియు 4TB – లభిస్తున్న T9 సృష్టికర్తల విభిన్నమైన అవసరాలకు సహాయపడుతుంది. ఇది వేగవంతమైన మరియు తరచూ బదిలీలు కోసం రూపొందించబడింది కాగా పెద్ద డేటా పరిమాణాలు కోసం గణనీయమైన స్టోరేజ్ స్థలాన్ని కేటాయిస్తుంది.   T9 యొక్క నాజూకైన మరియు క్రెడిట్ కార్డ్ సైజ్ డిజైన్ యూజర్స్  ఎక్కడకు వెళ్లినా తమ సృజనాత్మక ప్రేరణను తీసుకునేలా అవకాశం ఇస్తుంది.

 
కరుకుదనానికి విలాసం చేర్చబడింది

T9 కేవలం పని చేసే ప్రయోజనాలను అందించడమే కాకుండా  ‘కరుకుదనానికి విలాసం చేర్చబడింది ‘ భావన కింద విలక్షణమైన డిజైన్ ప్రయోజనాలు అందిస్తుంది.

 
తన సొగసైన డిజైన్ మరియు కఠినమైన నిర్మాణంతో ఇది ఆధునిక వాలెట్ వలే స్టైల్ మరియు మన్నికను కలుపుతుంది.  T9 రబ్బర్ ఎక్స్ టీరియర్ సౌకర్యవంతమైన గ్రిప్ ను నిర్థారిస్తుంది మరియు తక్కువ ఉష్ణోగ్రత బర్న్స్ నుండి కాపాడుతుంది.

 
సాటిలేని నమ్మకం మరియు థర్మల్ నియంత్రణ

మూడు మీటర్స్ ఎత్తు నుండి కింద పడిపోయినప్పుడు నిరోధకతను కలిగి ఉండే T9  అయిదేళ్ల పరిమిత వారంటీ ఇస్తుంది మరియు మీ అమూల్యమైన డేటా యొక్క భద్రత మరియు రక్షణకు హామీ ఇస్తుంది. ఈ హామీతో, సృష్టికర్తలు భయం లేకుండా తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ను ఆరంభించవచ్చు.

 

ఈ కఠినమైన డ్రైవ్ అధిక వేడి వలన సామర్థ్యం తగ్గిపోవడాన్ని సమర్థవంతంగా తగ్గించే  శామ్ సంగ్ వారి డైనమిక్ ధర్మల్ గార్డ్ టెక్నాలజీతో లభిస్తోంది. స్థిరమైన మరియు వేగవంతమైన బదిలీ రేట్స్ ను నిర్థారిస్తోంది. అదనంగా,  అంతర్జాతీయ భద్రతా ప్రామాణం IEC 62368-1కు అనుగుణంగా ఉండి అతి తక్కువగా వేడి ఉత్పన్నమయ్యే విస్తృత శ్రేణి పనుల కోసం పరిపూర్ణమైన ఎంపికను చేస్తోంది.

 
శామ్ సంగ్ మెజీషియన్ సాఫ్ట్ వేర్ 8.0తో T9 నిర్వహించండి

శామ్ సంగ్ మెజీషియన్ సాఫ్ట్ వేర్ పెర్ఫార్మెన్స్ ప్రమాణం, భద్రతా విధులు, ఫర్మ్ వేర్ అప్ డేట్స్ మరియు వాస్తవిక సమయం ఆరోగ్య స్థితుల తనిఖీ వంటి ఫీచర్స్ ద్వారా  యూజర్స్ కు  మెరుగుపరచబడిన అనుభవాన్ని ఇస్తుంది.

 
ఫర్మ్ వేర్ అప్ డేట్ మెమోరీ ప్రోడక్ట్స్ కోసం అత్యంత ముఖ్యమైన ఫీచర్ మరియు మెజీషియన్ సాఫ్ట్ వేర్ సంభవించే అవకాశమున్న ఏవైనా ఫీల్డ్ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటుంది. సెప్టెంబర్ 2023లో  కొత్త 8.0 వెర్షన్ విడుదలతో , డేటా మైగ్రేషన్, PSSD  సాఫ్ట్ వేర్ వంటి శామ్ సంగ్ సాఫ్ట్ వేర్ మరియు కార్డ్ ను ప్రమాణీకరించే సాధనం మెజీషియన్ సాఫ్ట్ వేర్ కు సమీకృతం చేయబడుతుంది మరియు OS మద్దతు రేంజ్ విండోస్, మాక్ మరియు ఆండ్రాయిడ్ యూజర్ సౌకర్యం  కోసం విస్తరించబడుతుంది.
 

నిరంతర అనుకూలత

శామ్ సంగ్  Portable SSD T9 అనేది  SSD  టెక్నాలజీలో  కంపెనీ వారి విస్తృతమైన అనుభవం యొక్క ఫలితం. T9  అనేది USB Type-C  పవర్ వివరణలతో సంపూర్ణంగా అనుసంధానం అవుతుంది, ప్రొఫెషనల్ సృష్టికర్తల పనితో నిరంతరంగా కలిసిపోవడాన్ని నిర్థారిస్తుంది.

 దీని క్రాస్ –ప్లాట్ ఫాం అనుకూలత విండోస్, macOS, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, గేమింగ్ కన్సోల్స్, మరియు అధిక –రిజల్యూషన్ కెమేరాలుకు విస్తరించబడింది. ప్లస్, T9 ప్యాకేజీ USB టైప్ C-to-C తో  మరియు యూఎస్ బీ టైప్ C-to-A కేబుల్స్ తో  పూర్తవుతుంది.

 
భారీ బఫర్ సైజ్ మరియు సుస్థిరమైన వీడియో షూటింగ్ తో పెర్ఫార్మెన్స్ గరిష్టం చేయండి

తన సాటిలేని సుస్థిరమైన రైట్ పెర్ఫార్మెన్స్ తో నిరంతరమైన హై-రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ కు  Samsung T9 హామీ ఇస్తుంది. ఇది నిరంతర వాడకం కోసం  8K  లేదా 12K హై-రిజల్యూషన్ కెమేరాకు నేరుగా కనక్ట్ చేయబడుతుంది.

 
దీని టర్బోరైట్ టెక్నాలజీ డేటా బదిలీ సమయంలో  వేగవంతమైన స్పీడ్స్ ను నిర్థారిస్తుంది. మొత్తం యూజర్ అనుభవాన్ని పెంచుతుంది. తమ పోటీదారులు కంటే మూడు రెట్లు వరకు పెద్దదియైన బఫర్ సైజెస్ తో, T9  ప్రత్యేకంగా కంటెంట్ సృష్టికర్తల కోసం అనుకూలీకరించబడింది.

 
ధర, వేరియెంట్స్ & ఎక్కడ కొనాలి

ద పోర్టబుల్ SSD T9 1టీబీ వేరియెంట్ రూ. 12799కి, 4టీబీ వేరియెంట్ రూ.33599కి లభిస్తుంది.  ఇది అన్ని శామ్ సంగ్ రీటైల్ స్టోర్స్ లో, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ లో మరియు ఆన్ లైన్ ప్లాట్ ఫాంస్ లో ఇది లభిస్తుంది.

 
వారంటీ

Portable SSD T9  పై 5 సంవత్సరాల పరిమిత వారంటీ వినియోగదారులకు ఇవ్వబడుతుంది.

More Press Releases