ప్రీమియం కొట్టా స్టైల్ డిజైన్ & అందమైన గ్లాస్ ఫినిష్ తో Samsung వారి సరికొత్త Bespoke డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ తో మీ కిచెన్ ను స్టైల్ చేయండి
· BESPOKE ప్రీమియం కొట్టా వేరియెంట్ మీ కిచెన్ కు పురాతన మరియు స్నేహపూర్వకమైన అందాన్ని ఇస్తుంది
· BESPOKE ప్రీమియం కొట్టా స్టీల్ వేరియెంట్ కన్వెర్టిబుల్ 5-ఇన్-1 మరియు ట్విన్ కూలింగ్ ప్లస్™ వంటి ఫీచర్స్ తో లభిస్తోంది; బిస్పోక్ గ్లాస్ వేరియెంట్ ఆప్టిమల్ ఫ్రెష్ , స్మార్ట్ థింగ్స్ ఏఐ ఎనర్జీ మోడ్ మరియు Wi-Fi సదుపాయం గలవి.
· రూ. 30,500 నుండి ధరలు ఆరంభం. కొత్త BESPOKE డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ శ్రేణి భారతదేశంలో ప్రముఖ రీటైల్ స్టోర్స్ లో మరియు Samsung.com పై లభిస్తాయి.
గురుగ్రామ్, భారతదేశం - అక్టోబర్ 13 2023: ఆధునిక భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన తమ BESPOKE డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణిని ఈ రోజు ప్రారంభించినట్లు భారతదేశంలో నంబర్ 1 రిఫ్రిజిరేటర్ బ్రాండ్ Samsung ప్రకటించింది. అందమైన రంగు ఎంపికల శ్రేణితో, కొత్త BESPOKE రిఫ్రిజిరేటర్‌లు ఏదైనా కిచెన్ కైనా పట్టణ సొగసుదనం మరియు వ్యక్తిగతతను అందిస్తాయి.
BESPOKE ప్రీమియం కొట్టా స్టీల్ మరియు BESPOKE గ్లాస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న Samsung వారి సరికొత్త BESPOKE డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి, వ్యక్తిగతీకరించిన అందాన్ని ఆధునిక రిఫ్రిజిరేషన్‌తో సజావుగా కలుపుతుంది, రోజువారీ జీవితాన్ని శ్రమరహితంగా మరియు స్టైలిష్‌గా చేస్తుంది.
BESPOKE ప్రీమియం కొట్టా వేరియెంట్ మీ కిచెన్ కు పురాతన అందం మరియు స్నేహపూర్వకమైన రూపాన్ని ఇస్తుంది. ఇది కొట్టా బీజ్ మరియు చార్ కోల్ (డ్యూయల్ టోన్) మరియు కొట్టా చార్ కోల్ అనే రెండు రంగులలో లభిస్తోంది. bespoke గ్లాస్ వేరియెంట్ క్లీన్ వైట్ మరియు పింక్ గ్లాస్ (డ్యూయల్ టోన్) మరియు క్లీన్ బ్లాక్ గ్లాస్ వంటి రెండు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది.
“మా BESPOKE డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లు భారతీయ వినియోగదారుల విలక్షణమైన అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆవిష్కరణలను అందిస్తాయి. BESPOKE ప్రీమియమ్ కొట్టా వేరియంట్ సాంప్రదాయ కొట్టా డిజైన్‌కు నివాళులు ఇస్తుంది, ఆధునిక కిచెన్ కు మధుర స్మృతులను జోడిస్తుంది. విలక్షణమైన డిజైన్‌తో పాటు, BESPOKE ప్రీమియం కొట్టా వేరియంట్, ఇది విలక్షణమైన భారతీయ వంటలను మరిన్ని నిల్వ చేసే ఎంపికలను అందించడాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలో అత్యుత్తమ ఫీచర్స్ యైన కన్వర్టిబుల్ 5-ఇన్-1తో లభిస్తోంది. బిస్పోక్ గ్లాస్ వేరియంట్‌లో ఉన్న స్మార్ట్ థింగ్స్ ఏఐ ఎనర్జీ మోడ్ శక్తి వినియోగాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. రోజువారీ జీవితంలో సౌలభ్యం, శైలి మరియు స్థిరత్వాన్ని పెంపొందించే ఈ కొత్త శ్రేణిని భారతదేశంలో తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము ” అని డిజిటల్ అప్లయెన్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్, Samsung ఇండియా సౌరభ్ బైశాఖియా అన్నారు.
కొత్త BESPOKE డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ పనితీరును అధిగమించాయి మరియు గొప్ప డిజైన్ మరియు సాంకేతిక ఆవిష్కరణలు రెండింటినీ అందిస్తాయి. BESPOKE ప్రీమియమ్ కొట్టా మోడల్‌లో కన్వర్టిబుల్ 5-ఇన్-1 ఫీచర్స్ ఉన్నాయి, తన ఐదు కన్వర్షన్ మోడ్‌లతో సీజన్స్ అంతటా రిఫ్రిజిరేషన్ అవసరాలకు మరింత స్టోరేజ్ స్థలం మరియు సరళత అందించడానికి రూపొందించబడింది.
BESPOKE గ్లాస్ మోడల్ SmartThings AI ఎనర్జీ మోడ్ తో లభిస్తోంది. ఇది వినియోగదారులు తమ రిఫ్రిజిరేటర్ శక్తి వాడకం పర్యవేక్షించడానికి మరియు అనుకూలం చేయడానికి వీలు కల్పిస్తుంది, విద్యుత్తు బిల్స్ పై ఆదా చేయడంలో వారికి సహాయపడుతుంది. ఆప్టిమల్ ఫ్రెష్ ఫీచర్ భారతదేశపు కుటుంబాలు తమకు ఇష్టమైన వంటకాలను ఎక్కువ సమయం వరకు భద్రపరిచి ఆనందించడాన్ని నిర్థారిస్తుంది
ధర మరియు లభ్యత
రూ. 30,500 నుండి ధర ప్రారంభమైన కొత్త BESPOKE డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ భారతదేశంలో అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్స్ లో మరియు శామ్ సంగ్ వారి సొంత ఆన్ లైన్ ప్లాట్ ఫాం-శామ్ సంగ్ షాప్ లో లభిస్తాయి. BESPOKE ప్రీమియం కొట్టా మోడల్ 236L, 256L, 301L మరియు 322L సామర్థ్యాలలో, రూ. 30,500 నుండి రూ. 42,500 ధరల శ్రేణి వరకు లభిస్తోంది. BESPOKE గ్లాస్ వేరియెంట్ 415L మరియు 465L సామర్థ్యాలలో , రూ. 54,000 మరియు రూ. 57,800 ధరల శ్రేణులలో అందుబాటులో ఉంది.
BESPOKE డిజైన్
Samsung వారి కొత్త BESPOKE డబల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ స్నేహపూర్వకమైన, సొసగైన మరియు ఆధునిక రంగులను మరియు ఆకర్షణీయమైన ఆకృతులను కలిగి వినియోగదారుల కిచెన్ ను వ్యక్తిగత అభిరుచితో ప్రతిబింబిస్తాయి మరియు తమ ఇంటీరియర్ డిజైన్ స్టేట్మెంట్ తో అనుకూలంగా ఉంటాయి.
కన్వర్టిబుల్ 5-ఇన్-1
ఈ విలక్షణమైన ఫీచర్ అయిదు వేర్వేరు కన్వర్షన్ మోడ్స్ – నార్మల్, సీజనల్, ఎక్స్ ట్రా ఫ్రిడ్జ్, వెకేషన్ మరియు హోమ్ అలోన్ నుండి వినియోగదారులు ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి మరింత స్టోరేజ్ స్థలం మరియు అత్యంత సౌకర్యం అందిస్తుంది. సీజన్ మార్పిడితో కేవలం ఫ్రిడ్జ్ మాత్రమే ఆన్ అయి ఉండటానికి ‘సీజనల్ మోడ్ ‘కు మారండి మరియు ఫ్రీజర్ ఆఫ్ చేయండి. ఇంటికి మరిన్ని కిరాణా సరుకులు తీసుకురండి మరియు ఫ్రీజర్ ను ‘ఎక్స్ ట్రా ఫ్రిడ్జ్ మోడ్’ తో ఫ్రిడ్జ్ గా మార్చండి. మీరు వెకేషన్ కు వెళ్తుంటే మరియు ఫ్రీజర్ లో కొంచెం ఆహారం భద్రపరచాలని కోరుకుంటే, ‘వెకేషన్ మోడ్’ స్విచ్ ఆన్ చేయండి మరియు ఫ్రీజర్ మాత్రమే ఆన్ చేసి ఉంచండి, ఫ్రిడ్జ్ కంపార్ట్ మెంట్ ఆఫ్ అయి ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటే మరియు నిల్వ చేయడానికి ఎక్కువ పదార్థాలు లేకపోతే ‘హోమ్ అలోన్ మోడ్’ ఆన్ చేయండి మరియు