పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రివర్యులు సీతక్క ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి. దనసరి అనసూయ సీతక్క గారు టి.ఎస్.ఐ.ఆర్.డి. రాజేంద్రనగర్ లో తేధీ:11.12.2023 (సోమవారం) నాడు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై శాఖ యొక్క పని తీరును సమీక్షించారు.
ఈ సమావేశమునకు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. సందీప్ కుమార్ సుల్తానియా, ఐ.ఏ.ఎస్ గారితో పాటు ఆ శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీ. ప్రదీప్ కుమార్ శెట్టి, ఐ.ఎఫ్.ఎస్. గారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ. సంజీవ రావ్ గారు, స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొని ఆయా విభాగాల వారీగా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.
ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, PMKSY వాటర్ షెడ్స్, రూర్బన్ మిషన్, స్వచ్చ భారత్ మిషన్, ఈ.జి.ఎమ్.ఎమ్ (EGMM), 15వ ఆర్ధిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ, పౌరులకు గ్రామములోనే వివిధ రకాల సేవలను ఈ-పంచాయతీ ద్వారా అందించడం, గ్రామపంచాయతీ అభివృద్ది కొరకు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమల గురించి, సెర్ప్ మహిళా సంఘాలు, సెర్ప్ బ్యాంక్ లింకేజ్, వికలాంగుల సదరం సర్టిఫికేట్ జారీ, అన్ని రకాల పెన్షన్ లు, మహిళా రైతు ఉత్పత్తి దారుల (FPO) ల సంఘాల కార్యక్రమాలు, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల పారదర్శకమైన పద్దతిలో ఋణాల మంజూరీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో చేపట్టే వివిధ రకాల రోడ్లు వేయు కార్యక్రమాల గురించి వివరంగా తెలీసుకున్నారు.
ఆదేవిధముగా, ఈ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడే కార్యక్రమాలని, ఈ కార్యక్రమాలు సమర్ధవంతముగా ప్రజలందరికి చేరువయ్యేలాగా నిర్వహించడానికి అధికారుల అనుభవాన్ని ఉపయోగించి, అధికారులందరు బాగా కష్టపడి పనిచేయాలని, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి. దనసరి అనసూయ సీతక్క గారు తెలిపారు మరియు అధికారుల పనితీరును ప్రశంసించారు. ఇట్టి కార్యక్రమానికి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఐ.ఏ.ఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతిరాజ్& గ్రామీణాభివృద్ధి శాఖ, శ్రీ ఎస్.వి ప్రదీప్ కుమార్ శెట్టి,స్పెషల్ కమీషనర్, గ్రామీణాభివృది శాఖ ఇతర ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్లు శ్రీ రామా రావు, శ్రీ. వెస్లీ, శ్రీ. రవీందర్ మరియు పంచాయతీరాజ్ శాఖ,
జాయింట్ కమిషనర్లు శ్రీ. రాజారావ్, శ్రీ. శేషు కుమార్, శ్రీ. శ్రీనివాస్, సెర్ప్ డైరెక్టర్లు, ఇంజనీర్-ఇన్-చీఫ్ శాఖ ఉన్నతాధికారులు, శ్రీ నరేంద్ర నాథ్ రావు, జాయింట్ డైరెక్టర్, టి.ఎస్.ఐ.ఆర్.డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.