హైదరాబాద్ నగరంలో ఐదు కళాశాలల్లో నేడు సేఫ్టీ క్లబ్ ల ప్రారంభం: తెలంగాణ పోలీస్ శాఖ

హైదరాబాద్ నగరంలో విద్యార్థినులు, మహిళల భద్రతకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు గాను కళాశాలల్లో విద్యార్థినులు సభ్యులుగా సేఫ్టీ క్లబ్ లను ఏర్పాటు చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినుల భద్రతకై డయల్ 100, హాక్-ఐ, షీ-టీమ్ లను ప్రవేశ పెట్టిన పోలీస్ శాఖ ఈ విషయంలో మరో వినూత్న విధానాన్ని ప్రవేశ పెట్టనుంది.

ప్రతీ కళాశాలలో కళాశాల విద్యార్థినులు సభ్యులుగా " యువతులు, మహిళల భద్రతకు-సేఫ్టీ క్లబ్"లను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభిస్తోంది. తొలిదశలో నగరంలో ఐదు కళాశాల్లో ఈ క్లబ్ లను ప్రారంభిస్తున్నట్టు మహిళా భద్రతా విభాగం ఐ.జీ. స్వాతీ లక్రా తెలిపారు. ఈ సేఫ్టీ క్లబ్ లను ముందుగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంబిస్తున్నట్టు స్వాతీ లక్రా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని బ్రిటీష్ హైకమీషనర్ ఫ్లెమింగ్ ప్రారంభిస్తారని స్వాతి లక్రా తెలిపారు.


More Press News