income tax: ‘విపరీత మార్పులు’ చేయకూడదు.. పన్ను చెల్లింపుదారులకు గట్టి హెచ్చరికలు జారీ


అవకతవకలకు పాల్పడుతున్న పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.  ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటిఆర్) మార్పుల్లో తప్పుడు సమాచారం ఇస్తే  కఠిన చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. తాము ఐటీఆర్ లో పొందుబ‌రిచిన‌ నిబంధనను అదునుగా తీసుకొని అందులో విపరీత మార్పులు చేస్తే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన శిక్షలు విధిస్తామ‌ని చెప్పింది. ఐటీ రిటర్న్స్ మార్పులు చేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీబీడీటీ భావిస్తోంది.

ఐటీ చట్టం 139(5) నిబంధన సెక్షన్  ప్రకారం ఐటీ రిటర్న్స్ లో ప‌న్నుచెల్లింపుదారులు మార్పులు చేసుకునే అవ‌కాశం ఉంది. దీని ప్ర‌కారం వారు క్యాష్ ఇన్ హ్యాండ్ తో పాటు త‌మ‌కు వ‌స్తోన్న‌ లాభాలు వంటి ప‌లు వివరాలను మార్చుకోవచ్చు. ఈ నేప‌థ్యంలోనే సిబిటిడి ఈ హెచ్చ‌రిక‌లు చేసింది.  

  • Loading...

More Telugu News