chinese rajamudra: ఆ చైనీస్ రాజ‌ముద్ర‌ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయింది!


పారిస్‌లో ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ వేలంపాట‌లో చైనాకు చెందిన ఓ రాజ‌ముద్ర అంచనాల‌ను మించి రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయింది. తొమ్మిది డ్రాగ‌న్ల చిహ్నంతో ఉండే ఈ చైనీస్‌ రాజ‌ముద్ర.. చైనాను సుదీర్ఘ కాలం పాలించిన‌ చ‌క్ర‌వ‌ర్తి క్విన్‌లాంగ్ కు చెందినదిగా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ రాజ‌ముద్ర 18వ శ‌తాబ్దం నాటిది. అయితే, 19వ శ‌తాబ్దంలో చైనా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఓ ఫ్రెంచ్ వ్య‌క్తి ఈ రాజ‌ముద్ర‌ను వేలంపాట‌లో సొంతం చేసుకుని త‌మ దేశానికి ప‌ట్టుకెళ్లాడు. తాజాగా మ‌ళ్లీ దీన్ని వేలం వేశారు. ఈ సారి చైనాకు చెందిన ఓ వ్య‌క్తి ఈ రాజ‌ముద్ర‌ను 150 కోట్ల రూపాయ‌లకు పాడి సొంతం చేసుకున్నాడు. నిర్వాహ‌కులు వేసిన అంచ‌నా క‌న్నా ఆ చైనా వ్య‌క్తి 20 రెట్ల అధిక ధ‌ర‌కు దీనిని సొంతం చేసుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News